నారప్ప
నారప్ప | |
---|---|
దర్శకత్వం | శ్రీకాంత్ అడ్డాల |
రచన | వెట్రిమారన్ |
దీనిపై ఆధారితం | పూమాని రాసిన వెక్కై నవల ఆధారంగా |
నిర్మాత | కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు |
తారాగణం | వెంకటేష్ ప్రియమణి కార్తీక్ రత్నం నాజర్ రావు రమేశ్ రాజీవ్ కనకాల అమ్ము అభిరామి రాఖీ |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె. నాయుడు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 20 జులై 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నారప్ప, 2021 జూలై 20న విడుదలైన తెలుగు సినిమా. పూమాని రాసిన వెక్కై నవల ఆధారంగా 2019లో రూపొందించిన తమిళ చిత్రం అసురన్ సినిమాకు రీమేక్ గా,[1] తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించగా, వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామి, రాఖీ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.[2] వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన[3] ఈ సినిమా 20 జులై 2021న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ చిత్ర షూటింగ్ 2020, జనవరిలో ప్రారంభమైంది.[4] ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.[5] ఈ సినిమాకు విమర్శకుల నుండి మంచి సమీక్షలు వచ్చాయి. వెంకటేష్ నటనను, రీమేక్ తీసిన విధానాన్ని, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వాన్ని ప్రశంసించారు.
కథా సారాశం
[మార్చు]అణగారిన కులానికి చెందిన ఒక కుటుంబం, సంపన్న కులంలోని ధనిక భూస్వామి వల్ల కలిగే సమస్యలను ఎదుర్కొని, పరిష్కరించుకునే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది.[6]
నటవర్గం
[మార్చు]- వెంకటేష్ (నారప్ప)
- ప్రియమణి (నారప్ప భార్య సుందరమ్మ)[7]
- కార్తీక్ రత్నం (నారప్ప పెద్దకొడుకు మునికన్నా)
- రాఖీ - సిన్నబ్బ [8]
- రావు రమేశ్ (లాయర్ వరదరాజులు)
- రాజీవ్ కనకాల (బసవయ్య)
- అమ్ము అభిరామి (కన్నమ్మ)
- శ్రీతేజ్ (రంగబాబు)
- నాజర్ (షావుకారు శంకరయ్య)
- బ్రహ్మాజీ (మునెప్ప)
- ఆడుకలం నరేన్ (పండుస్వామి)
- దీపక్ శెట్టి
- వశిష్ఠ సింహ
- రామరాజు
- ప్రియాంక
- కాదంబరి కిరణ్
- ఝాన్సీ
- అరుంధతి అరవింద్
- ప్రభాకర్
- చైత్ర
- రాజశేఖర్ అనింగి (శుభోదయం సుబ్బారావు)
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల [9]
- కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్ బాబు
- రచన: వెట్రిమారన్ (పూమాని రాసిన వెక్కై నవల ఆధారంగా)
- సంగీతం: మణిశర్మ
- ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు
- కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
- నిర్మాణసంస్థ: సురేష్ ప్రొడక్షన్స్
నిర్మాణం
[మార్చు]అభివృద్ధి, నటవర్గం ఎంపిక
[మార్చు]అసురన్ సినిమాను వెంకటేష్ హీరోగా తెలుగు రీమేక్‌కి దర్శకత్వం వహిస్తానని 2019 నవంబరులో శ్రీకాంత్ అడ్డాల ప్రకటించాడు.[10] 2020, జనవరిలో సినిమాపేరు నారప్ప అని ప్రకటించారు.[11] ఈ చిత్రంలో ప్రియమణి నారప్ప భార్య సుందరమ్మగా, కార్తీక్ రత్నం పెద్ద కొడుకు మునికన్నగా నటించారు.[12]
చిత్రీకరణ
[మార్చు]2020, జనవరి 22న అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని ఒక గ్రామంలో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.[13][14] మొదటి షెడ్యూల్ రాయలసీమ ప్రాంతంలో చిత్రీకరించబడింది.[15] లాక్ డౌన్ కు ముందు సినిమా యూనిట్ తమిళనాడు వెళ్ళింది.[16] తమిళనాడులోని కురుమలై, తేరికడు, తిరునెల్వేలి తదితర ప్రాంతాలలో యాక్షన్ డైరెక్టర్ పీటర్ హీన్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలను తీశారు.[17][18] కరోనా-19 మహమ్మారి కారణంగా 2020, మార్చిలో చిత్రీకరణ నిలిపివేయబడింది.[19] ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభమవుతుందని 2020 అక్టోబరులో ప్రకటించారు.[20] 2020 నవంబరు 9న హైదరాబాద్‌లో చిత్రీకరణ తిరిగి ప్రారంభమవుతుందని ధృవీకరించబడింది, వెంకటేష్ ఐదు రోజుల చిత్రీకరణలో పాల్గొన్నాడు.[21] 80% షూటింగ్ పూర్తి చేసుకున్న[22] ఈ సినిమా 2021 జనవరి చివరి నాటికి, షూటింగ్ పూర్తిచేసుకుంది.[23][24][25] సెకెండ్ వేవ్ సమయంలో 2021 మే నెలలో వెంకటేష్ తన డబ్బింగ్ ను పూర్తి చేశాడు.[26]
థీమ్స్, ప్రభావాలు
[మార్చు]సంగీత దేవి డూండూ ప్రకారం "ప్రతీకార కథ, కథానాయకుడి పరివర్తన రజినీకాంత్ నటించిన బాషా (1995) సినిమాని గుర్తుచేస్తుంది".[27]
సంగీతం
[మార్చు]Untitled | |
---|---|
2013లో సీతమ్మ వకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు నేపథ్య సంగీతంకోసం పనిచేసిన తరువాత, శ్రీకాంత్‌తో కలిసి మణిశర్మ పనిచేయడం ఇది రెండవసారి, పాటలకు స్వరకల్పన చేయడం మొదటిసారి. మొదటి సింగిల్ "చలాకి చిన్నమ్మీ" 2021, జూలై 11 న సురేష్ ప్రొడక్షన్స్ మ్యూజిక్ లేబుల్ ద్వారా విడుదలైంది.[28][29]
సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: మణిశర్మ.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "చలాకీ చిన్నమ్మీ" | అనంత శ్రీరామ్ | ఆదిత్యా అయ్యంగార్, నూతన మోహన్ | 3:27 |
2. | "ఓ నారప్ప" | అనంత శ్రీరామ్ | ధనుంజయ్, వరం | 3:41 |
3; తల్లి పేగు చూడు , సైందవి సిరివెన్నెల .
4: రాజ్ఆఫ్ నారప్ప, అనంత శ్రీరామ్, శ్రీకృష్ణ ఎల్. వి. రేవంత్, సాయి చరణ్
5: ఊరు నట్ట,సిరివెన్నెల , అనురాగ్ కులకర్ణి
విడుదల
[మార్చు]2021 మే 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా[30] భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.[31] 2021, జూన్ 29న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుండి ఈ చిత్రం యు/ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు ప్రకటించబడింది.[32][33] 2021, జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నట్టు 2021, జూలై 10న ప్రకటించారు.[34] అమెజాన్ ప్రైమ్ వీడియోలో సినిమా విడుదల గురించి, నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ, "ఈ ��ినిమా ప్రధాన సందేశం చాలా ముఖ్యమైనది. కాని ఎవరూ ఊహించని విధంగా ఇది ప్రభావం చూపుతుందని నాకు తెలుసు. 240 దేశాల్లోని ప్రేక్షకులకు మా చిత్రాన్ని ప్రదర్శించగలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని అన్నాడు.[35]
స్పందన
[మార్చు]ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికు చెందిన నీషిత న్యాపతి ఈ సినిమాకు 3.5/5 రేటింగ్ ఇచ్చింది. "ఈ సినిమా తీయడం ద్వారా శ్రీకాంత్ అడ్డాల కుటుంబ కథా చిత్రాల కంఫర్ట్ జోన్ నుండి బయటపడతాడు" అని రాసింది.[36]"మొత్తం మీద, నారప్ప రీమేక్ బాగుంది; అసురన్ సినిమా రీమేక్ ను తప్పు పట్టే మార్గం లేదు. నారప్ప లోపాలు ఉన్నప్పటికీ, తెలుగు సినిమాలో స్వాగతించే మార్పు ఇది" అని సినిమా ఎక్స్‌ప్రెస్ పత్రికకు చెందిన రామ్ వెంకట్ శ్రీకర్ రాశాడు.[37]
"నారప్ప సినిమా అసురన్ సినిమాకు రీమేక్ అయినప్పటికీ, ఈ సినిమాలో అసురన్ సినిమా ఆత్మ లేదు" అని ఇండియా టుడే పత్రికకు చెందిన కె. జనని రాసింది.[38] "నిజంగా అసురన్ సినిమా రిమేక్ అవసరమా?, రీమేక్ బాగుంది కాని ధనుష్ నటనకు సమానం కాదు. అయినప్పటికీ నటీనటుల నటన, దర్శకుడి ప్రతిభను ప్రశంసించాల్సిన అవసరం ఉంది" అని కొయిమోయి పత్రికకు చెందిన శుభం కులకర్ణి రాశాడు.[39]
మూలాలు
[మార్చు]- ↑ "Asuran is Naarappa in Telugu: Venkatesh looks fierce in Srikanth Addala's film". India Today. Retrieved 13 December 2020.
- ↑ "Venkatesh Daggubati's Narappa shoot put on hold - Times of India". The Times of India. Retrieved 13 December 2020.
- ↑ "Venkatesh starts shoot for 'Asuran' Telugu remake 'Naarappa'". The New Indian Express. 22 January 2020. Retrieved 13 December 2020.
- ↑ "Asuran is Naarappa in Telugu: Venkatesh looks fierce in Srikanth Addala's film". India Today. Ist. Retrieved 13 December 2020.
- ↑ "Telugu remake of 'Asuran' titled 'Naarappa' starring Venkatesh". The Hindu. 22 January 2020. Retrieved 13 December 2020.
- ↑ Sakshi (20 July 2021). "'నారప్ప' మూవీ రివ్యూ". Archived from the original on 20 July 2021. Retrieved 20 July 2021.
- ↑ Andrajyothy (16 July 2021). "ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో ..ఏమో". chitrajyothy. Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
- ↑ Namasthe Telangana (25 July 2021). "'నారప్ప' కొడుకు శీనప్ప రోల్ చేసింది ఎవరో తెలుసా…?". Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
- ↑ Namasthe Telangana (19 July 2021). "నాలోని మాస్ కోణాన్ని చూపించా!". Archived from the original on 19 July 2021. Retrieved 19 July 2021.
- ↑ "Telugu director Srikanth Addala to remake Dhanush's 'Asuran'". The News Minute. 2019-11-20. Retrieved 13 December 2020.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Desk, The Hindu Net (2020-01-22). "Telugu remake of 'Asuran' titled 'Naarappa' starring Venkatesh". The Hindu. ISSN 0971-751X. Retrieved 13 December 2020.
- ↑ "Karthik Rathnam's first-look as Munikanna from Narappa released on his birthday - Times of India". The Times of India. Retrieved 13 December 2020.
- ↑ "Narappa: Venkatesh Daggubati starrer Asuran Telugu remake goes on floors; See Pics". PINKVILLA (in ఇంగ్లీష్). Archived from the original on 14 జూలై 2021. Retrieved 21 July 2021.
- ↑ "Venkatesh's 'Naarappa' begins shoot in Anantapur - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ Nyayapati, Neeshita (22 January 2020). "Venkatesh's 'Naarappa' begins shoot in Anantapur". The Times of India. Retrieved 13 December 2020.
- ↑ "నారప్ప వచ్చాడప్ప". Sakshi. 2020-03-19. Retrieved 21 July 2021.
- ↑ "Narappa Update! Shooting of 'Asuran' remake progressing rapidly at Theri Kaadu Red Desert - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "Venkatesh Narappa shot at Theri kaadu Red Desert". www.ragalahari.com (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "Venkatesh Daggubati's Narappa shoot put on hold". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 22 March 2020. Retrieved 21 July 2021.
- ↑ World, Republic. "Asuran's Telugu remake, Narappa's shooting process to restart in October 2020?". Republic World (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "Venky to shoot some scenes for Narappa". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2020-10-21. Retrieved 21 July 2021.
- ↑ "Team of Narappa resumes shooting in the new normal | Telugu Movie News - Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "Shooting for Venkatesh and Priyamani starrer Narappa wrapped up - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "Narappa: Priyamani And Venkatesh Starrer Telegu Film Wraps Up Its Shooting". www.spotboye.com (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "Narappa wraps up shooting". Filmy Focus (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Venkatesh's special care in dubbing for Narappa". 123telugu.com (in ఇంగ్లీష్). 2021-06-12. Retrieved 21 July 2021.
- ↑ Dundoo, Sangeetha Devi (2021-07-20). "'Narappa' movie review: A faithful, frame-to-frame remake of 'Asuran'". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 21 July 2021.
- ↑ Hymavathi, Ravali (11 July 2021). "First Single 'Chalaaki Chinnammi' From Narappa Is Out". The Hans India (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2021. Retrieved 21 July 2021.
- ↑ "Narappa's Chalaaki Chinnammi: Melody Brahma Mani Sharma's family song is beautiful". Pinkvilla (in ఇంగ్లీష్). Archived from the original on 11 July 2021. Retrieved 21 July 2021.
- ↑ "Chiranjeevi's 'Acharya', Venkatesh's 'Narappa' eye summer 2021 releases". The Hindu. Special Correspondent. 29 January 2021. Archived from the original on 14 February 2021. Retrieved 21 July 2021.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ Palisetty, Ramya (29 April 2021). "Venkatesh's Narappa release date postponed due to Covid-19 spike". India Today. Archived from the original on 15 May 2021. Retrieved 21 July 2021.
- ↑ "Venkatesh's 'Narappa' gets U/A certification". The News Minute (in ఇంగ్లీష్). 2021-06-30. Retrieved 21 July 2021.
- ↑ "Venkatesh Daggubati and Priya Mani's Narappa gets U/A certification". www.msn.com. Retrieved 21 July 2021.
- ↑ Bhasin, Shriya (2021-07-12). "Venkatesh, Priyamani-starrer Telugu film 'Narappa' to premiere on Amazon Prime Video in July". www.indiatvnews.com (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ "The narrative of 'Narappa' is layered and thought-provoking: Co-producer D Suresh Babu". Zee News (in ఇంగ్లీష్). 2021-07-14. Retrieved 21 July 2021.
- ↑ "Narappa Movie Review", The Times of India, retrieved 21 July 2021
- ↑ "Narappa Movie Review: Asuran's identical twin is pedantic yet powerful". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
- ↑ ChennaiJuly 20, Janani K.; July 20, 2021UPDATED:; Ist, 2021 08:46. "Narappa Movie Review: Venkatesh's Asuran Telugu remake lacks soul". India Today (in ఇంగ్లీష్). Retrieved 21 July 2021.
{{cite web}}
:|first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Narappa Movie Review: Did We Really Need A Scene-To-Scene Copy..." Koimoi (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-07-20. Retrieved 21 July 2021.
ఇతర లంకెలు
[మార్చు]- CS1 maint: url-status
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- CS1 Indian English-language sources (en-in)
- CS1 errors: numeric name
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు
- డి. సురేష్ బాబు నిర్మించిన సినిమాలు
- వెంకటేష్ నటించిన సినిమాలు
- ప్రియమణి నటించిన సినిమాలు
- రాజీవ్ కనకాల నటించిన సినిమాలు
- 2021 తెలుగు సినిమాలు
- నాజర్ నటించిన సినిమాలు