టైమ్ జోన్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
టైమ్ జోన్ (కాల మండలం), అనేది భూమి మీద ఒకే వేళకు ఒకే సమయం సూచించే ప్రాంతాలను కలిపి ఒకే సమయ ప్రాంతంగా పరిగణించటం. సాధారణంగా పక్కపక్కన ఉండే సమయ ప్రాంతాలు ఒక గంట తేడాలో ఉంటాయి. సాంప్రదాయికంగా గ్రీన్‌విచ్ మీన్ టైముతో పోల్చి తమ స్థానిక సమయాన్ని లెక్కవేస్తాయి.
ప్రపంచంలోని సమయ మండలాలన్నీ కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (యుటిసి) ను అనుసరించి ఉంటాయి. 0o రేఖాంశం వద్ద సగటు సౌర సమయమే యుటిసి. ప్రపంచ దేశాలన్నీ దీన్ని అనుసరించి తమ తమ దేశాల్లోని సమయ మండలాన్ని నిశ్చయించుకుం���ాయి. ప్రతీ రేఖాంశానికీ 4 నిమిషాల చొప్పున సమయం ముందుకు గాని, వెనక్కు గానీ ఉంటుంది. దీన్ని యుటిసి నుండి 30o తూర్పున ఉన్న రేఖాంశం వద్ద సమయం యుటిసి కంటే 120 నిమిషాలు (2 గంటలు) ముందు ఉంటుంది. చాలా దేశాలు తమ దేశంలో సుమారుగా మధ్యన ఉన్న రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకుని, ఆ రేఖాంశం వద్ద యుటిసి నుండి ఎంత ఆఫ్‌సెట్ అయి ఉందో ఆ సమయాన్ని తమ దేశ ప్రామాణిక సమయంగా తీసుకుంటాయి. భారతీయ ప్రామాణిక సమయాన్ని 82.5′ తూర్పు రేఖాంశం వద్ద నున్న సమయాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది యుటిసి నుండి 330 నిమిషాలు ముందు ఉంటుంది. అంటే "యుటిసి+05:30 " అన్నమాట. కొన్ని దేశాల్లో యుటిసి ని గ్రీన్‌విచ్ మీన్ టైమ్ (జిఎమ్‌టి) అని అంటారు.
నేలపైని చాలా కాల మండలాలను యుటిసి నుండి గంటల్లో తేడా ఉండేలా రూపొందించారు. కానీ కొన్ని కాల మండలాలు అరగంట, ముప్పావుగంటల తేడాల్లో కూడా ఉన్నాయి. ఉదాహరణకు భారత ప్రామాణిక సమయం యుటిసి+05:30 కాగా, నేపాల్ సమయం యుటిసి+05:45
ప్రపంచవ్యాప్తంగా కాల మండలాలు
[మార్చు]మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- The tz database - Provides specific information on the beginning and ending dates of daylight saving time for each zone and tracks time zones over the years. Often called tz or zoneinfo, this database is used by several implementations, including the GNU C library used by many Unix variants.
- Animated time zones - Shows the relationship between arbitrary time zones and "natural" zones
- US Official Time Clock - Java enabled clock to graphically display night and day around the globe.
- The World Clock - Time zones
- World times on one page - Current date and time in all timezones and major world cities.
- Time Zones of Russia
- World Time Zone
- World Time Zone Map Archived 2007-02-11 at the Wayback Machine - Interactive World Time Zone Map