Jump to content

చర్చ:కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
09:04, 20 ఏప్రిల్ 2024 నాటి కూర్పు. రచయిత: Thangi Ogeswara Rao (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 08 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


సమీక్ష

[మార్చు]

ఈ వ్యాసానికి విషయ ప్రాధాన్యత ఉంది.

1. ఈ వ్యాసంలో రచయిత పొందిన బిరుదులు, బహుమతులను పేర్కొన్నారు.

2. రచయిత యొక్క రచనలను నవలలు, పద్యాకావ్యాలు, కథలు, నాటకాలు, వ్యాసాలుగా వర్గీకరించి రాశారు.

3. రచయితకు మరింత విషయ ప్రాధాన్యత ఉన్నపటికీ ఆ అంశాలను ఈ వ్యాసంలో పొందుపర్చలేదు. అక్షర దోషాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

తటస్థత:

ఈ వ్యాసానికి తాటస్థత కొంతమేరకే ఉంది. రచయితను ఉద్దేశించి గౌరవవాచకాలను అధికంగా ఉపయోగించారు.

కాపీరైట్స్:

రచయిత ఏవిధమైన కాపీరైట్స్ ఉల్లంగించలేదు.

నిర్ధారత్వం:

ఈ వ్యాసంలో కొంతమేరకే ఆధారాలను చూపించడం జరిగింది. కానీ ఈ వ్యాసంలో బోయకోట్టములు పండ్రెండు అనే ఇతని రచనకు ఇచ్చిన లింక్ ద్వారా మరింత సమాచారం, ఆధారాలు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన ఆధారాల్లో ఒక లింక్ పనిచేయడం లేదు.

సమాచారవిస్తరణ:

ఈ వ్యాసంలో వాస్తవమైన సమాచారం ఇచ్చారు. కానీ అది పరిమితంగానే ఉంది. కానీ ఇతని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇతని రచనల్లో ఒక్క బోయకోట్టములు పండ్రెండు గురించి మాత్రమే కొంత సమాచారం ఇవ్వడం జరిగింది.మిగిలిన రచనలను పేర్కొన్నాడే గాని వాటి గురించి సమాచారం ఇవ్వలేదు. బాలసుబ్రహ్మణ్యం పిళ్ళే పత్రికా సంపాదకత్వం గురించిగాని, రేడియో రచనల గురించిగాని పేర్కొనలేదు.

--Thangi Ogeswara Rao (చర్చ) 08:58, 20 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]