Jump to content

కాజీపేట రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 17°58′26″N 79°30′40″E / 17.974°N 79.511°E / 17.974; 79.511
వికీపీడియా నుండి
07:43, 17 జూన్ 2020 నాటి కూర్పు. రచయిత: InternetArchiveBot (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
కాజీపేట
భారతీయ రైల్వే జంక్షన్ స్టేషను
కాజీపేట రైల్వేస్టేషనులో ముఖద్వారం
సాధారణ సమాచారం
Locationమెయిన్ రోడ్డు, కాజీపేట
భారత దేశము
Coordinates17°58′26″N 79°30′40″E / 17.974°N 79.511°E / 17.974; 79.511
Elevation292 మీటర్లు (958 అ.)
యజమాన్యంభారతీయ రైల్వే
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే
లైన్లుకాజీపేట-హైదరాబాద్ రైలు మార్గము
కాజీపేట-విజయవాడ రైలు మార్గము
కాజీపేట-నాగపూర్ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
నిర్మాణం
నిర్మాణ రకంభూమి మీద ప్రామాణికం
పార్కింగ్ఉంది
Bicycle facilitiesలేదు
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుKZJ
డివిజన్లు సికింద్రాబాదు
History
Opened1874 , 1889 మధ్య
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

కాజీపేట రైల్వే స్టేషను తెల���గాణ రాష్ట్రంలోని వరంగల్ పట్టణ జిల్లా యందలి కాజీపేటలోగల రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనిది.

చరిత్ర

[మార్చు]

1929 లో కాజీపేట-బల్లార్షా లింకు పూర్తయిన తరువాత చెన్నై కూడా నేరుగా ఢిల్లీతో కలుపబడింది.[1]

వాడి-సికింద్రాబాదు లైను 1874 లో నిర్మించబడింది. ఈ లైను నిజాం ద్వారా ఆర్థిక సహాయం చేయబడింది. ఆ తర్వాత ఇది నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వేలో ఒక భాగమైనది. 1889 లో ప్రధాన నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లైన్ విజయవాడ (అప్పటికి బెజవాడ అనేవారు) వరకు పొడిగించబడింది.[2]

1909 లో "గ్రేట్ ఇండియా పెనిష్యులా రైల్వేలోని వాడి నుండి, నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే తూర్పున వరంగల్ వరకు, తరువాత బెజవాడ వరకు కలుపబడింది".[3]

విద్యుదీకరణ

[మార్చు]

డోర్నకల్-ఖాజీపేట సెక్టరు 1988-89 ప్రాంతంలో విద్యుదీకరణ చేయబడింది. ఖాజీపేట-రామగుండం సెక్టర్ 1987-88 లోనూ, ఖాజీపేట-సికింద్రాబాదు సెక్టరు 1991-93 లోనూ విద్యుదీకరింపబడింది.[4]

సదుపాయాలు

[మార్చు]

ఖాజీ పేట రైల్వే స్టేషను రిజర్వేషను సౌకర్యం కంప్యూటరీకరింపబడింది. రిజర్వేషను కౌంటర్లు, రిటైరింగ్ గది, విశ్రాంతి గది, శాకాహార, మాంసాహార భోజన వసతి, పుస్తక దుకాణాలు ఉన్నాయి.[5]

ఆర్థిక లాభం

[మార్చు]

సింగరేణి, కోతగూడెం, బెల్లంపల్లి, బల్హర్షా గనుల నుండి బొగ్గు రవాణా, సరుకు రవాణాలో 40 శాతం పనులు వరకు కాజీపేట-బల్హర్షా విభాగంలో రైల్వేలు నిర్వహించ బడతాయి.[6]

లోకో షెడ్లు

[మార్చు]

కాజీపేటలో డబ్ల్యుడిఎం-2, డబ్ల్యుడిఎం-3ఎ, డబ్ల్యుడిజి-4 లోకోల కొరకు డీజిల్ లోకో షెడ్స్ ఉన్నాయి. 2006 లో ప్రారంభించబడిన కాజిపేట్ ఎలెక్ట్రిక్ లోకో షెడ్ లో 150 కి పైగా డబ్ల్యుఎజి-7 ఎలక్ట్రికల్ లోకోలను నిలుపుదల చేయగల సామర్ధ్యం కలిగి ఉంది. కాజీపేట వద్ద ఒక కోచింగ్ నిర్వహణ డిపో ఉంది.[7]

మూలాలు

[మార్చు]
  1. "IR History: Early Days – III". Chronology of railways in India, Part 3 (1900-1947). Retrieved 26 November 2013.
  2. "[IRFCA] Indian Railways FAQ: IR History: Early Days - 2". www.irfca.org. Retrieved 2019-11-05.
  3. "Hyderabad - Imperial Gazetteer of India". IRFCA. Retrieved 26 November 2013.
  4. "History of Electrification". IRFCA. Retrieved 26 November 2013.
  5. "Kazipet to Visakhapatnam trains". Make My Trip. Retrieved 26 November 2013.
  6. Economic History of Hyderabad State: Warangal Suba, 1911-1950, by V.Ramakrishna Reddy, p. 582<
  7. "Sheds and Workshops". IRFCA. Retrieved 26 November 2013.

ఇతర లింకులు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే