నిర్మలా జోషీ
మదర్‌థెరిస్సా శిష్యురాలు సిస్టర్ నిర్మల (81) మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్‌గా సిస్టర్ నిర్మల బాధ్యతలు నిర్వర్తించారు. 1997లో మదర్‌థెరిస్సా తరువాత ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతలు స్వీకరించారు. సంస్ధ కార్యకలాపాలను మరింతగా విస్తరించారు. నిర్మల 1934, జూలై 23న రాంచిలో జన్మించారు. నేపాల్ నుంచి వలస వచ్చిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సిస్టర్ నిర్మల 17 ఏళ్ల వయస్సులోని క్రైస్తవ సన్యాసం తీసుకున్నారు. మదర్ థెరిస్సా తర్వాత సిస్టర్ నిర్మల మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలను చూస్తున్నారు. నిర్మలా జోషీ 1934లో రాంచీలో జన్మించారు. సిస్టర్ తల్లిదండ్రులు నేపాల్‌కు చెందిన హిందూ జాతీయులు. తండ్రి బ్రిటీష్ ఆర్మీలో ఉద్యోగి. విద్యాభ్యాసం మొత్తం పాట్నాలోని క్రిస్టియన్ మిషనరీలో జరిగింది. మదర్ థెరిస్సా సేవాభావం నచ్చి రోమన్ క్యాథలిక్‌లోకి మారింది. అనంతరం మదర్ థెరిస్సా స్థాపించిన మిషనరీ ఆఫ్ ఛారిటీస్‌లో చేరి తన సేవలను కొనసాగించారు. సిస్టర్ సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం 2009లో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ తో సత్కరించింది.కొంతకాలం క్రితం సిస్టర్ నిర్మల అస్వస్థతకు గురయ్యారు. హృద్రోగ సమస్యతో ఆమె బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా 23 జున్ 2015 ఉదయం మరణించారు.