Jump to content

విశ్వామిత్రుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకోవడం: కొంత భాగాన్ని దాచాను. మరి కొన్ని సవరణలు
(2 వాడుకరుల యొక్క 5 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 1: పంక్తి 1:
[[బొమ్మ:Rama and Laxmana killing Tataka.jpg|thumb|right|తాటకను సంహరించుటకు రామలక్షణులను పురమాయించుచున్న విశ్వామిత్రుడు (బాలాసాహెబ్ పండిత్ పంత్ ప్రతినిధి చిత్రం, 1916)]]
'''విశ్వామిత్రుడు''' (Viswamitra) హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి.
'''విశ్వామిత్రుడు''' (Viswamitra) హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి.


* [[గాయత్రీ మంత్రము]] సృష్టి కర్త
* [[గాయత్రీ మంత్రము]] సృష్టి కర్త
* శ్రీరామునకు గురువు
* శ్రీరామునకు గురువు
* హరిశ్చంద్రుని పరీక్షించినవాడు
* హరిశ్చంద్రుని పరీక్షించినవాడు
* త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహాతపోశక్తి సంపన్నుడు
* త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన సంపన్నుడు
* శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.
* శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.


[[గౌతముడు|గౌతమ మహర్షి]], [[అహల్య]]ల కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతాన్ని [[శ్రీరాముడు|శ్రీరామచంద్రులకు]] వినిపిస్తాడు. ఆవిధంగా శతానందుడి చేత వివరింపబడిన విశ్వామిత్రుడి జన్మ వృత్తాంతాన్ని [[వాల్మీకి]] మహర్షి [[రామాయణం|శ్రీమద్రామాయణం]] లోని [[బాలకాండము]]లో 51-65 సర్గల మధ్య వివరిస్తారు.
[[గౌతముడు|గౌతమ మహర్షి]], [[అహల్య]]ల కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతాన్ని [[శ్రీరాముడు|]] వినిపిస్తాడు. ఆవిధంగా శతానందుడి చేత వివరింపబడిన విశ్వామిత్రుడి జన్మ వృత్తాంతాన్ని [[వాల్మీకి]] మహర్షి [[రామాయణం|శ్రీమద్రామాయణం]] లోని [[బాలకాండము]]లో 51-65 సర్గల మధ్య .


==వంశ వృత్తాంతం==
==వంశ వృత్తాంతం==
[[బ్రహ్మ]] కుమారుడు కుశుడు. ఆయన పుత్రుడు కుశనాభుడు. ఆయనకు నూరుగురు కుమార్తెలు. ఆ నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత కుశనాభుడికి పుత్రసంతానం లేకపోవడం వల్ల పుత్రకామేష్టి యాగం చేస్తాడు. తండ్రి అయిన కుశ మహారాజు ప్రత్యక్షమై, అత్యంత పరాక్రమం కలిగి కీర్తిని ఇవ్వగల పుత్రుడుగా [[గాది]] జన్మిస్తాడు అని వరమిస్తాడు. ఆ విధంగా కుశనాభుడికి జన్మించిన గాది కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అని కూడా పిలుస్తారు.
[[బ్రహ్మ]] కుమారుడు కుశుడు. ఆయన పుత్రుడు కుశనాభుడు. ఆయనకు నూరుగురు కుమార్తెలు. ఆ నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత కుశనాభుడికి పుత్రసంతానం లేకపోవడం వల్ల పుత్రకామేష్టి యాగం చేస్తాడు. తండ్రి అయిన కుశ మహారాజు ప్రత్యక్షమై, అత్యంత పరాక్రమం కలిగి కీర్తిని ఇవ్వగల పుత్రుడుగా [[గాది]] జన్మిస్తాడు అని వరమిస్తాడు. ఆ విధంగా కుశనాభుడికి జన్మించిన గాది కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు కూడా .


==వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకోవడం==
==వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకోవడం==
విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి అలసి, [[వశిష్ఠ]] మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షికి నమస్కరించి ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా, యజ్ఞ యాగాదులు సక్రమంగా జరుగుతున్నాయా అని కుశలం అడుగుతాడు. వశిష్ఠుడు బదులిచ్చి, రాజ్యంలో ప్రజలు సౌభాగ్యంగా ఉన్నారా, సామంత రాజులు సఖ్యంగా ఉంటున్నరా అని విశ్వామిత్రుడిని కుశలం అడుగుతాడు. కుశల ప్రశ్నలు, అర్ఘపాద్యాదులు అయ్యాక, విశ్వామిత్రుడు సెలవు తీసుకొంటానని పలుకగా వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు. అప్పుదు విశ్వామిత్రుడు "మీ దర్శనం వల్ల, అర్ఘపాద్యాదుల వల్ల ఇప్పటికే సంతుష్టుడనయ్యాను. కాబట్టి సెలవు ఇప్పించవలసింది" అని అంటాడు. కానీ వశిష్ఠుడు ఆతిథ్యం తీసుకోమని బలవంతపెట్టడంతో, విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు. వశిష్ఠుడు ఆయన ఆశ్రమంలోని [[కామధేనువు]] సంతతికి చెందిన ''శబల'' అనే గోవును పిలిచి మహారాజుకు, అక్షౌహిణి సైన్యానికి వారివారి ఇచ్ఛానుసారం పదార్ధాలు తయారు చెయ్యమంటాడు. శబల వశిష్ఠుని ఆజ్ఞ మేరకు సైన్యంలో ఎవరి ఇష్ఠాన్ని గ్రహించి ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి అతిథి సత్కారాలు చేస్తుంది.
విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి అలసి, [[వశిష్ఠ]] మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు. విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షికి నమస్కరించి ఆశ్రమంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా, యజ్ఞ యాగాదులు సక్రమంగా జరుగుతున్నాయా అని కుశలం అడుగుతాడు. వశిష్ఠుడు బదులిచ్చి, రాజ్యంలో ప్రజలు సౌభాగ్యంగా ఉన్నారా, సామంత రాజులు సఖ్యంగా అని విశ్వామిత్రుడిని కుశలం అడుగుతాడు. కుశల ప్రశ్నలు, అయ్యాక, విశ్వామిత్రుడు సెలవు వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు. అప్పుదు విశ్వామిత్రుడు "మీ దర్శనం వల్ల, అర్ఘపాద్యాదుల వల్ల ఇప్పటికే సంతుష్టుడనయ్యాను. కాబట్టి సెలవు ఇప్పించవలసింది" అని అంటాడు. కానీ వశిష్ఠుడు ఆతిథ్యం తీసుకోమని బలవంతపెట్టడంతో, విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు. వశిష్ఠుడు ఆయన ఆశ్రమంలోని [[కామధేనువు]] సంతతికి చెందిన ''శబల'' అనే గోవును పిలిచి మహారాజుకు, సైన్యానికి వారివారి ఇచ్ఛానుసారం పదార్ధాలు తయారు చెయ్యమంటాడు. వశిష్ఠుని ఆజ్ఞ మేరకు గ్రహించి ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి అతిథి సత్కారాలు చేస్తుంది.


==శబల ను కోరడం- వశిష్ఠుడు నిరాకరించడం==
==శబల ను కోరడం- వశిష్ఠుడు నిరాకరించడం==
పంక్తి 33: పంక్తి 34:


==మేనకా విశ్వామిత్రుల క్రీడలు==
==మేనకా విశ్వామిత్రుల క్రీడలు==
[[Image:Menaka Vishwamitra by RRV.jpg|thumb|right|మేనకతో విశ్వామిత్రుడు (రాజా రవివర్మ చిత్రం)]]
ఆవిధంగా శునశేపుడిని పంపించేశాక మళ్ళి పశ్చిమ తీరంలోని పుష్కర క్షేత్రం లొ తపస్సు మెదలు పెట్టబోతాడు. ఆసమయంలొ [[మేనక]] పుష్కరక్షేత్రం లొ స్నానం చేయడానికి వస్తుంది. మేనకని చూసి కాముకుడై మేనక తో రమించడం ప్రారంభిస్తాడు. ఒకటి రెండు రోజులులలో రతి క్రీడ ముగించి తపస్సు ప్రారంభిద్దాం అనుకొంటాడు కాని అది పది సంవత్సరాలకు చేరుకొంటుండి. ఇలా ఉండగా ఒకరోజు విశ్వామిత్రుడి పది సంవత్సరాలు అయిపోయాయి స్పురణలొకి వస్తుంది. ఇది దేవతల పని అని గ్రహించి కామక్రోదాలకు వశుడునైయ్యాను అని భావించి పశ్చిమ తీరం నుండి మరల బయలు దేరి ఉత్తరాన [[హిమాలయాలకు]] చేరుకొంటాడు. [[వాల్మీకి]] [[రామాయణం]] లో మాత్రం మేనకకు విశ్వామిత్రుడికి భరతుడు జన్మించడం అనే ప్రస్తావన లేదు. ఇది వేరే ఇతిహాసం లొ ఉండి ఉండవచ్చు.
ఆవిధంగా శునశేపుడిని పంపించేశాక మళ్ళి పశ్చిమ తీరంలోని పుష్కర క్షేత్రం లొ తపస్సు మెదలు పెట్టబోతాడు. ఆసమయంలొ [[మేనక]] పుష్కరక్షేత్రం లొ స్నానం చేయడానికి వస్తుంది. మేనకని చూసి కాముకుడై మేనక తో రమించడం ప్రారంభిస్తాడు. ఒకటి రెండు రోజులులలో రతి క్రీడ ముగించి తపస్సు ప్రారంభిద్దాం అనుకొంటాడు కాని అది పది సంవత్సరాలకు చేరుకొంటుండి. ఇలా ఉండగా ఒకరోజు విశ్వామిత్రుడి పది సంవత్సరాలు అయిపోయాయి స్పురణలొకి వస్తుంది. ఇది దేవతల పని అని గ్రహించి కామక్రోదాలకు వశుడునైయ్యాను అని భావించి పశ్చిమ తీరం నుండి మరల బయలు దేరి ఉత్తరాన [[హిమాలయాలకు]] చేరుకొంటాడు. [[వాల్మీకి]] [[రామాయణం]] లో మాత్రం మేనకకు విశ్వామిత్రుడికి భరతుడు జన్మించడం అనే ప్రస్తావన లేదు. ఇది వేరే ఇతిహాసం లొ ఉండి ఉండవచ్చు.
[[బొమ్మ:VishwaMitra-Menaka RRV.jpg|thumb|left|మేనకతో విశ్వామిత్రుడు (రాజా రవివర్మ చిత్రం)]]
==ఉత్తర తీరంలొ తపస్సు - మహర్షి అవడం==
==ఉత్తర తీరంలొ తపస్సు - మహర్షి అవడం==
ఉత్తర తీరానికి వెళ్ళి అత్తగారైన సత్యవతి కౌశికి నది గా ఉండగా అక్కడ ఘొరాతి ఘొర తపస్సు చేయనారంభించాడు.( [[పరశురాముడు|పరశురాముడి]] జన్మ వృత్తాంతం చూడండి). వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికి ఆ తపస్సుకి ప్రీతి చెంది [[బ్రహ్మ|చతుర్ముఖ బ్రహ్మ]] వచ్చి "విశ్వామిత్రా నీ తపాస్సుకి మెచ్చాను నువ్వు మహర్షి వి అయ్యావు" అని అంటాడు. విశ్వామిత్రుడు భాద పడక ఆనందించక బ్రహ్మతో తాను జితేంద్రియుడిని అయ్యానా అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం గా బ్రహ్మ ఇంకా జితేంద్రుడివి కాలేదు ఇంకా తపస్సు చేయ వలసి ఉంది అని చెప్పి అంతనార్థం అవుతాడు.బ్రహ్మ అదృశ్యమై పోయాక మళ్ళీ ఘొరాఘొరాతి తపస్సు చేయడం ఆరంభిస్తాడు. [[గ్రీష్మ]] ౠవులో పంచాగ్ని హోత్రం మధ్య్లొ నిలబడి, [[శశిర]] ఋతువు లొ నీళ్ళలో నిలబడి చేస్తున్న తపస్సుకు [[ఇంద్రుడు]] కంగారు పడి పరీక్ష కోసం[[రంభ]] ను విశ్వామిత్రుడి వద్దకు పంపిస్తాడు.రంభ సంకోచిస్తుంటే [[ఇంద్రుడు]] తాను వసంతుడు (మన్మధుడు) ఆమె వెంట వస్తామని చెబుతారు. రంభ విశ్వమిత్రుడి ఆశ్రమానికి చేరుకోగా ఆశ్రమమంతా[[వసంత]] ఋతువు ల మారిపోయింది. ఆశ్రమం అంతా వసంత ఋతువు లా మారిపోవడం తో విశ్వామిత్రుడికి సందేహం వచ్చి ఇది అంతా ఇంద్రుడి మాయా అని గ్రహించి రంభ తనను ప్రలోభ పెట్టడానికి వచ్చి నట్లు గ్రహించి ఆమె ను దశవర్ష సహస్రాణి(పదివేల సంవత్సరాలు) పాషాణ రూపంగా మారిపోయేటట్లు శపిస్తాడు. ఆ తరువాత క్రోధ వశుడైనాను అని భావించి రంభ తో బ్రాహ్మణోత్తముడు ఆవిడను ఉద్ధరించగలడు అని శాపవిమౌచనం చెప్పి తూర్పు తీరానికి తపస్సు చేసు కోవడానికి వెళ్ళి పోతాడు.
ఉత్తర తీరానికి వెళ్ళి అత్తగారైన సత్యవతి కౌశికి నది గా ఉండగా అక్కడ ఘొరాతి ఘొర తపస్సు చేయనారంభించాడు.( [[పరశురాముడు|పరశురాముడి]] జన్మ వృత్తాంతం చూడండి). వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికి ఆ తపస్సుకి ప్రీతి చెంది [[బ్రహ్మ|చతుర్ముఖ బ్రహ్మ]] వచ్చి "విశ్వామిత్రా నీ తపాస్సుకి మెచ్చాను నువ్వు మహర్షి వి అయ్యావు" అని అంటాడు. విశ్వామిత్రుడు భాద పడక ఆనందించక బ్రహ్మతో తాను జితేంద్రియుడిని అయ్యానా అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం గా బ్రహ్మ ఇంకా జితేంద్రుడివి కాలేదు ఇంకా తపస్సు చేయ వలసి ఉంది అని చెప్పి అంతనార్థం అవుతాడు.బ్రహ్మ అదృశ్యమై పోయాక మళ్ళీ ఘొరాఘొరాతి తపస్సు చేయడం ఆరంభిస్తాడు. [[గ్రీష్మ]] ౠవులో పంచాగ్ని హోత్రం మధ్య్లొ నిలబడి, [[శశిర]] ఋతువు లొ నీళ్ళలో నిలబడి చేస్తున్న తపస్సుకు [[ఇంద్రుడు]] కంగారు పడి పరీక్ష కోసం[[రంభ]] ను విశ్వామిత్రుడి వద్దకు పంపిస్తాడు.రంభ సంకోచిస్తుంటే [[ఇంద్రుడు]] తాను వసంతుడు (మన్మధుడు) ఆమె వెంట వస్తామని చెబుతారు. రంభ విశ్వమిత్రుడి ఆశ్రమానికి చేరుకోగా ఆశ్రమమంతా[[వసంత]] ఋతువు ల మారిపోయింది. ఆశ్రమం అంతా వసంత ఋతువు లా మారిపోవడం తో విశ్వామిత్రుడికి సందేహం వచ్చి ఇది అంతా ఇంద్రుడి మాయా అని గ్రహించి రంభ తనను ప్రలోభ పెట్టడానికి వచ్చి నట్లు గ్రహించి ఆమె ను దశవర్ష సహస్రాణి(పదివేల సంవత్సరాలు) పాషాణ రూపంగా మారిపోయేటట్లు శపిస్తాడు. ఆ తరువాత క్రోధ వశుడైనాను అని భావించి రంభ తో బ్రాహ్మణోత్తముడు ఆవిడను ఉద్ధరించగలడు అని శాపవిమౌచనం చెప్పి తూర్పు తీరానికి తపస్సు చేసు కోవడానికి వెళ్ళి పోతాడు.

06:22, 4 ఆగస్టు 2007 నాటి కూర్పు

తాటకను సంహరించుటకు రామలక్షణులను పురమాయించుచున్న విశ్వామిత్రుడు (బాలాసాహెబ్ పండిత్ పంత్ ప్రతినిధి చిత్రం, 1916)

విశ్వామిత్రుడు (Viswamitra) హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి.

  • గాయత్రీ మంత్ర సృష్టి కర్త
  • శ్రీరామునకు గురువు
  • హరిశ్చంద్రుని పరీక్షించినవాడు
  • త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు
  • శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.

గౌతమ మహర్షి, అహల్యల కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతాన్ని శ్రీరామచంద్రునికి వినిపిస్తాడు. ఆవిధంగా శతానందుడి చేత వివరింపబడిన విశ్వామిత్రుడి జన్మ వృత్తాంతాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం లోని బాలకాండములో 51-65 సర్గల మధ్య వర్ణించాడు.

వంశ వృత్తాంతం

బ్రహ్మ కుమారుడు కుశుడు. ఆయన పుత్రుడు కుశనాభుడు. ఆయనకు నూరుగురు కుమార్తెలు. ఆ నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత కుశనాభుడికి పుత్రసంతానం లేకపోవడం వల్ల పుత్రకామేష్టి యాగం చేస్తాడు. తండ్రి అయిన కుశ మహారాజు ప్రత్యక్షమై, అత్యంత పరాక్రమం కలిగి కీర్తిని ఇవ్వగల పుత్రుడుగా గాది జన్మిస్తాడు అని వరమిస్తాడు. ఆ విధంగా కుశనాభుడికి జన్మించిన గాది కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది.

వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకోవడం

విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్యం చేశాడు. ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి, అలసి, వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు. కుశల ప్రశ్నలు, అర్ఘ్యపాద్యాదులు అయ్యాక, విశ్వామిత్రుడు సెలవు తీసుకోబోగా, వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు. అప్పుదు విశ్వామిత్రుడు "మీ దర్శనం వల్ల, అర్ఘపాద్యాదుల వల్ల ఇప్పటికే సంతుష్టుడనయ్యాను. కాబట్టి సెలవు ఇప్పించవలసింది" అని అంటాడు. కానీ వశిష్ఠుడు ఆతిథ్యం తీసుకోమని బలవంతపెట్టడంతో, విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు. వశిష్ఠుడు ఆయన ఆశ్రమంలోని కామధేనువు సంతతికి చెందిన శబల అనే గోవును పిలిచి మహారాజుకు, ఆయన సైన్యానికి వారివారి ఇచ్ఛానుసారం పదార్ధాలు తయారు చెయ్యమంటాడు. వశిష్ఠుని ఆజ్ఞ మేరకు శబల సైనికుల ఇష్ఠాలను గ్రహించి, ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి, అతిథి సత్కారాలు చేస్తుంది.

శబల ను కోరడం- వశిష్ఠుడు నిరాకరించడం

అది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్య చకితుడై ఆ శబర ను తనకు ఇచ్చి లక్ష గోవులను దానం గా స్వీకరించమంటాడు.లక్ష గోవులు ఇచ్చినా శబల ని ఇవ్వడానికి వశిష్ఠుడికి నిరాకరించడం తో విశ్వామిత్రుడికి క్రౌర్యం వచ్చి వశిష్ఠునితొ రాజ్యానికి చెందిన రాజుని నేను రత్నం అయిన ఈ గోవు తన వద్దే ఉండాలి అంటాడు. అప్పుడు వశిష్ఠుడు శబల వల్లనే ఆశ్రమంలొ హవ్యం(హవిస్సులు) కవ్యం(పితృకార్యాలు) జరుగుతున్నాయి,అసలు ఈ గోవు వల్లే ప్రాణయాత్ర నడుస్తోందిన్నా విశ్వామిత్రుడు పద్నాలుగు వేల ఏనుగులు ఎనిమిది బంగారు రథాలు పదకొండు గుర్రాలు కోటి గోవులని, బంగారం , వెండి ఇస్తానంటాడు. వాటిని కూడా వశిష్ఠుడు నిరాకరించి మౌనం పాటిస్తాడు. మౌనాన్ని పాటించిన మహర్షి చూసి ఆమహారాజు కోపం వచ్చి తన సైన్యానికి శబలను రాజ్యానికి తోలుకొనిపోమని ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడి సైన్యం శబల మెడలొ గొలుసు వేసి తొలుకొని పోతుండగా శబల ఏడుస్తు వశిష్ఠ మహర్షి ని ఈ విధంగా ప్రశ్నిస్తుంది" నేనేమేనా లోపం చేశానా నన్ను పరిత్యజిస్తున్నారు, మీరు నన్ను రక్షిస్తారా నన్ను నేను రక్షించుకోమటారా?" అని అన్నవేంటనే వశిష్ఠ మహర్షి దానికి అంగీకారాన్ని తెలుపుతాడు.వశిష్ఠుని అంగీకారం తెలిపిన వేంటనే ఒక హూం భారం(అంబా నాదం) చేసివేంటనే శులాయుదులైన పప్లవులు మరియు యవనులు కి జన్మనిచ్చి వారి ద్వారా విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది. ఆతరువాత వశిష్ఠుని తో అంగీకారం తో ఇంకా కాంభోజ వంశియులు, పొదుగు నుండి పప్లవులు, యౌని స్థానం నుంది యవనులు, గోమయం వచ్చే స్థానం నుండి షవులు, రోమకుపాలనుండి హరీకులు, కిరాతకులు పుట్టి విశ్వామిత్ర సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. అది చూసిన విశ్వమిత్రుడి నూరుగురు కుమారులు వశిష్స్థమహర్షి మీద చంపడానికి వెళ్తారు. వశిష్ఠ మహర్షి ఒక హుంకారం చేయడం తో నూరుగు భస్మరాశులై పడిపోతారు. అది చూసి విచారించి తన దగ్గర ఉన్న శక్తులతో వశిష్ఠున్ని గెలవలేను అనుకొని రాజ్యానికి తిరిగి వెళ్ళి మిగిలిన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి హిమాలాయాకు వెళ్ళి పరమశివుడి కోసం తీవ్ర సపస్సు చేస్తాడు.

పరమ శివుడి కోసం తపస్సు

ఘోర తపస్సుకి మెచ్చి వృషభవాహనుడై శివుడు విశ్వమిత్రుడి కోరికను వెల్లడి చెయ్యమంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు తనకు ధనుర్వేదం లోని సర్వ విద్యాలు సాంగో-పాంగాది విద్యాలు రహస్యం సహితంగా ఇప్పటికి ఇప్పుడు రావాలని కోరుతాడు.శివుడు తధాస్తు అని పల్కుతాడు.ఆ వరాన్ని పొందిన వేంటనే విశ్వమిత్రుడు పౌర్ణమి నాడు సముద్రం ఉరకలు వేసినట్లు ఉప్పొంగి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు.

వశిష్ఠుని మీద దనుర్వేద ప్రయౌగం

విశ్వమిత్రుడు తన అస్త్రాలను ఆశ్రమం పై ప్రయౌగం చేస్తే ఆశ్రమవాసులందరు చిన్నభిన్నం గా పరుగెడుతారు. వశిష్ఠ మహర్షి దానిని గమనించి బయటకు వచ్చి విశ్వామిత్రుడిని చూస్తారు. విశ్వామిత్రుడు ఆమహర్షిని చూసిన వేంటనే అగ్నేయాస్త్రాన్ని ప్రయౌగిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మదండాన్ని అడ్డు పెడితే ఆ ఆగ్నేయాస్త్రం బ్రహ్మదండం లోకి చేరిపోతుంది. అది చూసిన విశ్వామిత్రుడికి కోపం వచ్చి తనకు వచ్చిన అస్త్రాలు వరసగా ఒకదాని వెంట మరొకటి ప్రయౌగిస్తాడు.సాంగో పాంగ విద్యలసారం వల్ల క్రౌంచస్త్రం,వారుణాస్త్రం,రౌద్రాస్త్రం,ఇంద్రాస్త్రం,పాశుపతం,మానవాస్త్రం,మెసలం,గదలు,ధర్మచక్రం,విష్ణుచక్రం,బ్రహ్మపాశం,కాలపాశం,విష్ణుపాశం అనే వివిధ అస్త్రాలు వేసిన వశిష్ఠమహ��్షి నిశ్చలుడై ఉంటాడు.ఇంక చేసేది లేక తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్రాన్ని స్మరిస్తుంటె సముద్రాలు పోర్లుతాయి,పర్వతాలు బ్రద్దలౌతాయి, ఆవిధంగా స్మరించిన బ్రహ్మాస్త్రాన్ని వశిష్ఠుడి మీద ప్రయౌగిస్తాడు.అప్పుడు బ్రహ్మస్త్రం వెళ్ళి వశిష్ఠుడి బ్రహ్మదండం లోకి చేరి పోతుంది. అది చూసిన విశ్వామిత్రుడు చింతించి బ్రహ్మబలాన్ని క్షత్రియ బలంతో జయించడం జరగదని భావించి తాను కూడా బ్రహ్మర్షి కావాలని భావిస్తాడు.

దక్షిణం తీరానికి చేరి బ్రహ్మ గురించి తపస్సు

భార్య సమేతంగా దక్షిణ తీరానికి పొయి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తాడు. అక్కడ వెయ్యి సంవత్సరాలు చేస్తాడు ఆసమయం లొనే విశ్వామిత్రుడికి హనిషేంద్రుడు,మధుస్సందుడు,ధృడనేత్రుడు,మహారథుడు అనే నాలుగురు కుమారులు జన్మిస్తారు. చతుర్ముఖబ్రహ్మ ఆ తపస్సుతో ప్రీతి చెంది విశ్వామిత్రా నువ్వు రాజర్షి ఆయ్యావు అని దీవించి అంతనార్థనమౌతాడు. విశ్వామిత్రుడు దానితో ప్రీతి చెందలేదు. ఎప్పటికి నేను ఋషిని అవుతాను,ఎప్పటికి మహర్షి అవుతాను, ఎప్పటికి బ్రహ్మర్షిని అవుతాను అని చింతిస్తాడు.

త్రిశంకు స్వర్గం

ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజుకి ఒక విచిత్రమైన ఆలోచన్ కలుగుతుంది. తన పూర్వవంశీయుల మాదిరిగా కాకుండా సశరీరం తో స్వర్గానికి చేరుకోవాలి అనే కోరిక పుడుతుంది. కులగురువులైన వశిష్ఠులవరికి కోరిక విన్నవిస్తాడు, సశరీరం తో స్వర్గానికి వెళ్ళడానికి ఏదైన యాగం చెయ్యమని కోరగా అది కూడని పని అని ధర్మశాస్త్ర విరుద్దమని చెప్పి పంపేస్తాడు.వశిష్ఠుడు కాదన్నాడని వశిష్ఠుని నూరుగు కొడుకువద్దకు వెళ్ళి తన ఇచ్ఛను ప్రకటిస్తాడు.వశిష్ఠిని కుమారు సశరీరం గా స్వర్గానికి వెళ్ళే కార్యం కూడని పని బోధిస్తారు.త్రిశంకుడు వశిష్ఠుడి కుమారులతో మీ వల్ల ఆ కార్యం కాకపోతే నేను వేరే గురువుని చూసుకోంటాను అని అంటాడు.ఆ మాట విన్న వశిష్ఠకుమారులు త్రిశంకుడిని ఛండాలుడిగా అవ్వమని శపిస్తారు. తరువాతి ఉదయమే త్రిశంకుడు మెడలొ ఉన్న బంగారు ఆభరణాలు అన్ని ఇనుపగొలుసులైపోయి ఛండాలుడు మారిపోతాడు. ఛండాలుడిగా మారిపోయినా త్రిశంకుడు తిరుగుతు తిరుగుతు దక్షిణ తీరం లో తపస్సు ముగించిన విశ్వామిత్రుడి కంటపడి తన వృత్తాంతాన్ని అంతా విశదీకరిస్తాడు.త్రిశంకుడిని చూసి సంతోషపడి వశిష్ఠుడు చెయ్యలేని పని తాను చెయ్యలనే కోరికతో త్రిశంకుడికి అభయం ఇచ్చి తాను యాగం నిర్వహించి త్రిశంకుడిని సశరీరంగా ఛండాలావతారంతో స్వర్గానికి పంపుతానని చెబుతాడు.విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి సమస్త భూగోళంలొ ఉన్న బ్రహ్మణులను యజ్ఞానికి అహ్వానించమంటాడు.వశిష్ఠుడి కుమారులు మరియు మహోదయుడు అనే బ్రాహ్మణుడు యజ్ఞానికి రాన్నరని, మహోధయిడైతే క్షత్రియుడు చెయ్యించే యజ్ఞంలొ ఛండాలుడు హవిస్సులు ఇస్తే దేవతలు తీసుకోరని చెప్పడని విశ్వామిత్రుని కుమారులు తండ్రికి విన్నవిస్తారు. ఇది విన్న విశ్వామిత్రుడు కోపాగ్నికి లొనై వశిష్ఠుని నూరు గురు కుమారులని,మహోధయుడిని తన కమండలం లోని ఉదకం తీసుకొని భస్మరాశి అవ్వమని శపిస్తాడు. ఆతరువాత 700 జన్మలు శవమాంసాన్ని ఆ తరువాత తింటు బ్రతుకుతారు.ఆ తరువాత ముష్టికులగా పుట్టి కుక్కమాంసం తింటు బ్రతుకుతారు,మహోదయుడు నిషాదుడిగా బ్రతుకుతాడు.యాగం లో హవిస్సులు సమర్పిస్తుంటే హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రారు. అది గమనించిన విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడిని సశరిరంగా స్వర్గానికి పంపుతాడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో గురుపుత్రుల శాపానికి గురాన నీకు స్వర్గ ప్రవేశం లేదని వచ్చి దారిలొనే త్రిశంకుడిని తలక్రిందులుగా భూలోకానికి నెట్టేస్తాడు. ఇలా నెట్టి వేయబడ్డ త్రిశంకుడూ విశ్వామిత్రా రక్షించు అని ఆర్థనాదం చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గమధ్యం లో ఆపి బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి (స్వర్గాన్ని,నక్షత్రమండలాన్ని)చేయనారంభిస్తాడు.దీనిని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయడం తగదని వారిస్తారు. వారి అభ్యర్థన మేరపు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్రమండలానికి ఆవల త్రిశంకుడు తలక్రిందులుగా త్రిశంకు స్వర్గం లో ఉందేటట్లు అంగీకరిస్తాడు.

అంబరీషుడి అశ్వమేధం - శునశేపుడికి విశ్వామిత్రుడి మంత్రాలు

శునషేపుడు విశ్వామిత్రుడిని శరణు వేడుకోవడం
శునషేపుడు విశ్వామిత్రుడిని శరణు వేడుకోవడం

త్రిశంకుడిని ఆవిధంగా త్రిశంకు స్వర్గానికి పంపిన తరువాత తపస్సుచేసుకోవడం కోసమని పశ్చిమ దిక్కు కు చేరుకొంటాడు. ఆ సమయంలోనే ఇక్ష్వాకు వంశానికి చెందిన అంబరీషుడు అనే మహారాజు అయౌధ్యని పరిపాలన చేస్తు అశ్వమేధ యాగంలొని భాగంగా అశ్వాన్ని విడిచి పెడతాడు. ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరిస్తాడు.యాగం నిర్వహించే ఋతువిక్కులు అశ్వాన్ని వెతికి బలి ఇవ్వపోతే ప్రతికూలమైన చర్యలు జరుగుతాయి అనిచెప్పి దాని నివృత్తి కోసం అశ్వం తో సమానమైన పశువు తీసుకొని వచ్చి, అశ్వాన్ని పెట్టవలసిన స్థానంలో(యూప స్తంభం) ఒక మనుష్యుడిని ఉంచి బలి ఇవ్వాలని సూచిస్తారు.అశ్వంతో సమానమైన పశువు ని వెతికే పని మీద అంబరీషుడు తన రథం మీద వెళ్ళుతుండగా భార్యా సమేతంగా ఋచీకుడు అనే ఋషి భృతుంగ పర్వతం మీద కనిపిస్తాడు. ఆ ఋషి కి తన కధ చెప్పి యాగ సమాప్తి కొరకు సహాయం రుపం గా ఋషి కుమారుడిని అర్థిస్తాడు. మెదటి సంతానం పూర్వ కర్మ సుకృతం వల్ల జన్మస్తుంది,చివరి సంతానం మైన శునేకుడిని ఇవ్వడానికి తల్లి నిరాకరిస్తుంది. ఇక అమధ్య సంతానమైన శున:శేపుడు అంబరీష మహారాజుకి దానమిచ్చేస్తాడు ఋచీకుడు. అంబరీషుడు ఆ ఋషికి మణులు మాణిక్యాలు, బంగారం, పది లక్ష గోవులు ప్రతిగా దానమిస్తాడు.అంబరీషుడు శునశేపుడిని రథం ఎక్కించుకొని అశ్వమేధం చేసే స్థలానికి బయలు దేరుతారు. మార్గమధ్యంలో బడలిక తీర్చుకోవడానికి ఒక ప్రదేశం లో ఆగితే అక్కడ శునశేపుడికి విశ్వామిత్రుడు తపస్సు చేసుకొనే ఆశ్రమం కనిపిస్తుంది. శునశేపుడు విశ్వామిత్రుడి వద్ద కు వెళ్ళి తన కధంతా విన్న వించుకొని తనకు బ్రతికి ఉండవలెనని కోరిక ఉన్నదని, ఎంతో గొప్ప తపస్సు చేయవేయలని తపన ఉన్నదని చెప్పగా విశ్వామి��్రుడు తన కుమారులను యాగం కోసం బలి గా వెళ్ళమంటాడు. అది విన్న విశ్వామిత్రుడి కుమారులు "నాన్న నువ్వు చెప్పినది కుక్క మాంసం తిన మన్నట్లుంది, ఏవరినో రక్షించడం కొసం కుమారులను బలి ఇస్తావా" అంటారు. విశ్వామిత్రుడు కోపోగిత్రితుడై కుమారులను వెయ్యి సంవత్సరాలు వశిష్ఠల కుమారులకు పట్టిన గతే పట్టు గాకా అని శపిస్తాడు(కుక్క మాంసం తినేవాళ్ళు అవ్వు గాక). అది చూసిన శునశేపుడు ( వరససకు విశ్వామిత్రుడు శునశేపుడికి మేనమామ అవుతాడు పరశురాముడు జన్మవృత్తాంతం చూడండి)అలా కుమరులను శపించాక విశ్వామిత్రుడు శునశేపుడి వైపు తిరిగి "శునశేపా నీకు నేను అభయం ఇస్తునాను, నిన్ను తీసుకొని పోయి యూప స్తంభానికి కట్టేస్టారు, ఎర్రటి బట్ట కడతారు,రక్త చందనం పూస్తారు, నీవు కలత చెందకు, అశ్వమేధ యాగం వైష్ణవ యాగం కాబట్టి ఇంద్రుడు ప్రీతి చెందేటట్లు నేను నీకు రెండు మంత్రాలు ఉపదేశిస్తున్నాను, వేరే చింతన లేకుండా ఈ రెండు మంత్రాలను మనస్సులో మననం చేసుకో, యాగం సమాప్తి మునుపే ఇంద్రుడు వచ్చి యాగం సంతృప్తి చెందాను ,యాగానికి కోటి రెట్ల ఫలాన్ని ఇస్తున్నాను అని చెబుతాడు." అని అంటాడు. ఇది విన్న శునశేపుడు ఏంతో ఆనందంతొ అంబరీష మహారాజు రథం ఎక్కి యాగాని చేరు కొంటాడు.యాగం లో శునశేపుడిని యూపస్తంభానికి కట్టేస్తారు. అయినా శునశేపుడు కలత చెందక విశ్వామిత్రుడు ఉపదేశించిన రెండు మంత్రాలు బాగా మననం చేసు కొంటాడు. దీనితో ప్రీతి చెందిన ఇంద్రుడు యాగం సమాప్తికి మునుపే వచ్చి యాగం తొ సంతృప్తి పొందాను అని చెబుతాడు. అంతే కాకుండా శునశేపుడికి దీర్ఘాష్షువు ఇవ్వడంతో శునశేపుడు యూప స్తంభం నుండి విడుదలై స్వేచ్చగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళి పోతాడు.

మేనకా విశ్వామిత్రుల క్రీడలు

మేనకతో విశ్వామిత్రుడు (రాజా రవివర్మ చిత్రం)

ఆవిధంగా శునశేపుడిని పంపించేశాక మళ్ళి పశ్చిమ తీరంలోని పుష్కర క్షేత్రం లొ తపస్సు మెదలు పెట్టబోతాడు. ఆసమయంలొ మేనక పుష్కరక్షేత్రం లొ స్నానం చేయడానికి వస్తుంది. మేనకని చూసి కాముకుడై మేనక తో రమించడం ప్రారంభిస్తాడు. ఒకటి రెండు రోజులులలో రతి క్రీడ ముగించి తపస్సు ప్రారంభిద్దాం అనుకొంటాడు కాని అది పది సంవత్సరాలకు చేరుకొంటుండి. ఇలా ఉండగా ఒకరోజు విశ్వామిత్రుడి పది సంవత్సరాలు అయిపోయాయి స్పురణలొకి వస్తుంది. ఇది దేవతల పని అని గ్రహించి కామక్రోదాలకు వశుడునైయ్యాను అని భావించి పశ్చిమ తీరం నుండి మరల బయలు దేరి ఉత్తరాన హిమాలయాలకు చేరుకొంటాడు. వాల్మీకి రామాయణం లో మాత్రం మేనకకు విశ్వామిత్రుడికి భరతుడు జన్మించడం అనే ప్రస్తావన లేదు. ఇది వేరే ఇతిహాసం లొ ఉండి ఉండవచ్చు.

మేనకతో విశ్వామిత్రుడు (రాజా రవివర్మ చిత్రం)

ఉత్తర తీరంలొ తపస్సు - మహర్షి అవడం

ఉత్తర తీరానికి వెళ్ళి అత్తగారైన సత్యవతి కౌశికి నది గా ఉండగా అక్కడ ఘొరాతి ఘొర తపస్సు చేయనారంభించాడు.( పరశురాముడి జన్మ వృత్తాంతం చూడండి). వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికి ఆ తపస్సుకి ప్రీతి చెంది చతుర్ముఖ బ్రహ్మ వచ్చి "విశ్వామిత్రా నీ తపాస్సుకి మెచ్చాను నువ్వు మహర్షి వి అయ్యావు" అని అంటాడు. విశ్వామిత్రుడు భాద పడక ఆనందించక బ్రహ్మతో తాను జితేంద్రియుడిని అయ్యానా అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం గా బ్రహ్మ ఇంకా జితేంద్రుడివి కాలేదు ఇంకా తపస్సు చేయ వలసి ఉంది అని చెప్పి అంతనార్థం అవుతాడు.బ్రహ్మ అదృశ్యమై పోయాక మళ్ళీ ఘొరాఘొరాతి తపస్సు చేయడం ఆరంభిస్తాడు. గ్రీష్మ ౠవులో పంచాగ్ని హోత్రం మధ్య్లొ నిలబడి, శశిర ఋతువు లొ నీళ్ళలో నిలబడి చేస్తున్న తపస్సుకు ఇంద్రుడు కంగారు పడి పరీక్ష కోసంరంభ ను విశ్వామిత్రుడి వద్దకు పంపిస్తాడు.రంభ సంకోచిస్తుంటే ఇంద్రుడు తాను వసంతుడు (మన్మధుడు) ఆమె వెంట వస్తామని చెబుతారు. రంభ విశ్వమిత్రుడి ఆశ్రమానికి చేరుకోగా ఆశ్రమమంతావసంత ఋతువు ల మారిపోయింది. ఆశ్రమం అంతా వసంత ఋతువు లా మారిపోవడం తో విశ్వామిత్రుడికి సందేహం వచ్చి ఇది అంతా ఇంద్రుడి మాయా అని గ్రహించి రంభ తనను ప్రలోభ పెట్టడానికి వచ్చి నట్లు గ్రహించి ఆమె ను దశవర్ష సహస్రాణి(పదివేల సంవత్సరాలు) పాషాణ రూపంగా మారిపోయేటట్లు శపిస్తాడు. ఆ తరువాత క్రోధ వశుడైనాను అని భావించి రంభ తో బ్రాహ్మణోత్తముడు ఆవిడను ఉద్ధరించగలడు అని శాపవిమౌచనం చెప్పి తూర్పు తీరానికి తపస్సు చేసు కోవడానికి వెళ్ళి పోతాడు.

బ్రహ్మర్షి అవడం

తూర్పు దిక్కుకు వెళ్ళి మౌనంతో కామాక్రోధాలను నిగ్రహిస్తు బ్రహ్మాండమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ మారు తపస్సులో కుంభకం అనే ప్రక్రియను ఉపయౌగించి శ్వాస తీసుకోవడం విడిచి పెట్టడం మానేస్తాడు. ఆవిధంగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే శరీరం కాష్ఠం క్రింద ఒక పుల్ల లా మారిపోయింది. ఆ కాష్ఠాన్ని నిలబెట్టు కోవడం కోసం ఒకరోజు ఇంత అన్నం తినడం కోసం కూర్చొండగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలొ వచ్చి భిక్ష అడుగు తాడు. విశ్వామిత్రుడు అది గ్రహించి ఇంద్రుడుకి తాను తిన బోయే అన్నాన్ని (కబలం)ఇచ్చేస్తాడు.మళ్ళి కుంభకం అనే తపస్సు చేయనారంభిస్తాడు. అప్పుడు అయాన బ్రహ్మ స్థానం నుంది పొగ వచ్చి లోకాలను కప్పేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి "కౌశికా బ్రహ్మర్షి" అని పిలిస్తే సంతోషించి, బ్రహ్మ ను ఒకకోరిక కోరుతాడు వశిష్ఠుడి ని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది అంటాడు. అప్పుడు దేవతలు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడి మనోగతాన్ని వ్యక్తం చేస్తారు. వశిష్ఠుడు విశ్వామిత్రుడి కోరిక మేరపు ���్రహ్మర్షి అని పిలిస్తే విశ్వామిత్రుడు సంతోషించి వశిష్ఠుని కి అర్ఘ్యపాద్యాలు ఇస్తాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడు.

బయటి లింకులు

  • సంస్కృత రామాయణం ఆంగ్ల తాత్పర్యం లింకు [1]