భికాజీ రుస్తుం కామా
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
భికాజీ రుస్తుం కామా | |
---|---|
{{{lived}}} | |
Madame Bhikaiji Cama | |
పుట్టిన తేదీ: | 24 September 1861 |
జన్మస్థలం: | Bombay, British India |
మరణించిన తేదీ: | 13 August 1936 |
నిర్యాణ స్థలం: | Bombay, British India |
ఉద్యమం: | Indian independence movement |
ప్రధాన సంస్థలు: | India House, Paris Indian Society, Indian National Congress |
భికాజీ రుస్తుం కామా' (Bhikaiji Rustom Cama) (1861 - 1936) భారతదేశ స్వాతంత్ర్యం కోసం ��ోరాడిన పార్సీ వనిత. 1896లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. రోగగ్రస్తులకు సేవలు చేస్తున్న ఆమెకు కూడా ప్లేగు వ్యాధి సోకింది. 1901 చికిత్స కోసం ఇంగ్లండ్ కు పంపబడినది. అక్కడున్న భారత స్వాతంత్ర్యోద్యమ కర్త శాంయజీ కృష్ణవర్మ చేత ప్రభావితమై, 1905 లో దాదాభాయ్ నౌరోజీ కి సహాయకురాలిగా ఇండియన్ హోం రూల్ సొసైటీని స్థాపించింది. బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తే గాని, ఇండియాకు వెళ్ళనీయనందా ప్రభుత్వం. భికాజీ ఇంగ్లండ్ వదలి పారిస్ నగరంలో నివాసం ఏర్పరచుకుంది. 1907 ఆగష్టులో జర్మనీలోని స్టుట్ గార్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ కు వెళ్ళి మనదేశ స్వాతంత్ర్యం కోసం వారి మద్దతు కోరింది. మనదేశానికొక పతాకం ఉండాలని, దామోదర్ వినాయక్ సావర్కర్ తో కలసి ఒక త్రివర్ణ పతాకాన్ని తయారుచేసి ఆ సమావేశంలో ప్రదర్శించింది. ప్రస్తుత మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం భికాజీ కృషే. మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రులైన బ్రిటిష్ ప్రభుత్వం యొక్క బలవంతాన, భికాజీ ఫ్రాన్స్ లో నిర్భంధించబడింది. యుద్ధానంతరం ఫ్రాన్స్ లోనే యుండి, మన స్వాతంత్ర్యం కోసం వ్యాసాలు వ్రాస్తూ, ప్రసంగాలు చేస్తుండేది. 1935 తీవ్రమైన అస్వస్థతకు గురై, భారతదేశం తిరిగివచ్చి 1936లో మరణించింది. తన యావదాస్తిని ఆవాబాయి పెటిట్ అనాథ శరణాలయం కి దానం చేసింది.
ఇంతటి గొప్ప దేశ భక్తురాలి స్మృత్యర్థం ఆమె జన్మ శతాబ్ది సందర్భంగా 1962 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 1997 సంవత్సరంలో మన కోస్ట్ గార్డ్ లోని అతివేగపు గస్తీ నౌకను ఆమె పేరు పెట్టారు.[1]
జీవితం
[మార్చు]భికాజీ కామా సెప్టెంబరు 24 1861న ధనవంతుడైన పార్సీ కుటుంబంలో జన్మించింది. తండ్రి, సొరాబ్జీ ఫ్రాంజీ పటేల్, బొంబాయి ( ముంబై ) నగరంలో వ్యాపారస్తుడు. దానం చేయడం లో, సహాయ పడడంలో అగ్రగామిగా ఉన్న ప్రముఖ వ్యాపారి. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రభావితమైన భికాజీ బాల్యం నుండే రాజకీయ సమస్యల వైపు ఆకర్షితురాలైనది . ఆమెకు భాషల పట్ల ఉన్న తేలితేటలతో దేశంలో ఉన్న ఇతర వర్గాలతో వాదించడంలో ప్రావీణ్యం పొందింది.
ఆమె భికాజీ 1885లో రుస్తుం కామా అనే ప్రసిద్ధ న్యాయవాదిని వివాహం చేసుకుంది, కానీ సామాజిక రాజకీయ సమస్యలతో ఆమెకు విభేదాలకు దారితీసింది. రుస్తుం కామా బ్రిటిష్ వారి వ్యామోహం, సంస్కృతి పట్ల మోజుతో, బ్రిటిష్ పాలకులు భారతదేశానికి ఎంతో మేలు చేసారనే భావనతో ఉన్నవాడు. జాతీయవాది, దేశ భక్తి ఉన్న భికాజీ బ్రిటిష్ వారు తమ సొంత లాభం కోసం భారతదేశాన్ని నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేశారని నమ్మిన వ్యక్తి. భికాజీ తన సమయాన్నిని దాతృత్వ కార్యకలాపాలు చేయడం, సామాజిక సేవలో ఉండేది. 1896లో బాంబే ప్రెసిడెన్సీలో బుబోనిక్ ప్లేగు వ్యాధి రావడం, ఎంతో మంది చని పోవడం, దానితో ప్లేగు బాధితులను కాపాడటానికి పనిచేస్తున్న బృందానికి సహాయం చేయడానికి భికాజీ స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. భికాజీ కూడా ఈ ప్రాణాంతక వ్యాధిరావడం, ఆమె కోలుకున్నప్పటికీ, విశ్రాంతి కోసం యూరప్ వెళ్ళమని ఆమెకు సలహా ఇవ్వడం జరిగింది. 1902 లో, భికాజీ భారతదేశం నుండి లండన్ కు వెళ్ళింది. ఆమె ఆరోగ్యం మెరుగుపడినతర్వాత , భికాజీ భారతదేశం బ్రిటిష్ వారు ఆమెకు ఒక సందేశం పంపుతూ," ఒక వేళ భారతదేశం వెళ్లాలంటే స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొనకూడదు" అనే షరతు విధించడం జరిగింది. దీనితో భికాజీ లండన్ లోనే ఉండవలసి వచ్చింది.[2]
మూలాలు
[మార్చు]మూలాలు
- ↑ 10TV (14 August 2020). "భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు" (in telugu). Archived from the original on 2 సెప్టెంబరు 2021. Retrieved 2 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "Remembering Madam Bhikaji Cama, the Brave Lady to First Hoist India's Flag on Foreign Soil". The Better India (in ఇంగ్లీష్). 2016-09-24. Retrieved 2022-03-02.