ఫెర్జాల్ జిల్లా
ఫెర్జాల్ జిల్లా | |
---|---|
మణిపూర్ రాష్ట్ర జిల్లా | |
Coordinates (ఫెర్జాల్): 93° 11' 16.0440 East and 24° 15' 43.0524 N | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
ఏర్పాటు | 2016 |
ముఖ్య పట్టణం | ఫెర్జాల్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,285 కి.మీ2 (882 చ. మై) |
జనాభా | |
• మొత్తం | 47,250 |
భాషలు | |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎంఎన్ |
ప్రధాన రహదారులు | జాతీయ రహదారి-150, జాతీయ రహదారి-2 |
ఫెర్జాల్ జిల్లా, భారతదేశంలోని మణిపూర్ రాష��ట్రంలోని ఒక జిల్లా. దీని ముఖ్య పట్టణం ఫెర్జాల్.[1]
భౌగోళికం
[మార్చు]ఫెర్జాల్ జిల్లా మణిపూర్ రాష్ట్ర దక్షిణ భాగంలో ఉంది. ఇది సముద్రమట్టానికి 1,037 మీటర్ల (3,402 అడుగుల) ఎత్తులో ఉంది. దీనికి తూర్పు వైపు చురచంద్‌పూర్ జిల్లా; ఉత్తరం వైపు తమెంగ్‌లాంగ్ జిల్లా, జిరిబం జిల్లాలు; పశ్చిమం వైపు అస్సాం రాష్ట్ర కచార్ జిల్లా; దక్షిణం వైపు సిన్లుంగ్ హిల్స్ (మిజోరాం) ఉన్నాయి. ఫెర్జాల్ జిల్లా 93°11'16.0440' తూర్పు రేఖాంశం, 24°15'43.0524' ఉత్తర అక్షాంశం మధ్య ఉంది. ప్రభుత్వ రికార్డు ప్రకారం, ఫెర్జాల్ జిల్లాలో సుమారు 200 గ్రామాలు ఉన్నాయి.
2016, డిసెంబరు 16న మణిపూర్ ముఖ్యమంత్రి ఓ. ఇబోబి సింగ్ ఫెర్జాల్ జిల్లా పరిపాలనా కేంద్రాన్ని ప్రారంభించాడు.[2]
వాతావరణం
[మార్చు]ఈ జిల్లాలో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు కనీష్టంగా 3.4°C (38.1°F), గరిష్టంగా 34.1°C (93.4°F) ఉంటాయి. వార్షిక వర్షపాతం 670 నుండి 1,450 మి.మీ. (26 నుండి 57 అంగుళాలు) ఉంటుంది.
విస్తీర్ణం, జనాభా
[మార్చు]ఇది 2,285 కి.మీ2 (882 చ.మై.) విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 47,250 జనాభా ఉంది.
పరిపాలనా విభాగాలు
[మార్చు]ఈ జిల్లాను 4 ఉప విభాగాలుగా విభజించారు.[1]
- ఫెర్జాల్ ఉప విభాగం
- పర్బంగ్ ఉప విభాగం
- థాన్లోన్ ఉప విభాగం
- వంగై రేంజ్ ఉప విభాగం
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]ఈ జిల్లాలో హమరు, గాంగ్టే, పైట్, సిమ్టే, తడౌ (కుకి), వైఫీ, జూ వంటి తెగలకు చెందినవారు నివసిస్తున్నారు. ఇక్కడ సుమారు 80% భూభాగం అటవీప్రాంతంలో ఉండగా, మిగిలిన 20% సాగు కోసం ఉపయోగించబడుతుంది. వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి కాగా, వరి, మొక్కజొన్న, అల్లం వంటివి ఇక్కడ ప్రధాన పంటలు.[1]
రవాణా
[మార్చు]ఫెర్జాల్ జిల్లా రోడ్డుమార్గం ద్వారా రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నగరంతో కలుపబడివుంది. 2017లో ఇంఫాల్, ఫెర్జాల్ మధ్య బస్సు సర్వీసు ప్రారంభమైంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Pherzawl District Profile". Pherzawl District Website. Retrieved 2021-01-10.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Pherzawl District Inauguration (Night Programme)". YouTube. 2016-12-20. Retrieved 2021-01-10.
- ↑ https://web.archive.org/web/20180802201744/https://www.zoramobserver.com/manipur/first-view-of-pherzawl-bus-from-imphal//