Jump to content

చింతల రామచంద్రా రెడ్డి (ఆంధ్రప్రదేశ్)

వికీపీడియా నుండి
(చింతల రామచంద్రా రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
చింతల రామచంద్రా రెడ్డి
చింతల రామచంద్రా రెడ్డి (ఆంధ్రప్రదేశ్)


ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2024
ముందు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
తరువాత నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి
నియోజకవర్గం పీలేరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 13 సెప్టెంబర్ 1962
వాయల్పాడు, వాల్మీకిపురం మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి నీరజమ్మ
సంతానం చింతల సాయికృష్ణారెడ్డి
పూర్వ విద్యార్థి బీఏ

చింతల రామచంద్రా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

చింతల రామచంద్రా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, వాల్మీకిపురం మండలం, వాయల్పాడు లో 13 సెప్టెంబర్ 1962లో జన్మించాడు. ఆయన బీఏ వరకు చదువుకున్నాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

చింతల రామచంద్రా రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1987లో వాయల్పాడు ఎమ్మెల్యేగా ఉన్న నల్లారి అమరనాథ రెడ్డి మరణించడంతో 1988లో వాయల్పాడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి నల్లారి సరోజమ్మ పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1989లో ఎన్నికల్లో ఓటమిపాలై, తిరిగి 1994లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. రామచంద్రా రెడ్డి 1999లో ఓటమిపాలై 2004 , 2009 ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వాయల్పాడు నియోజకవర్గం పీలేరు నియోజకవర్గం లో విలీనమైంది.

రామచంద్రా రెడ్డి 2014లో పీలేరు నియోజకవర్గం నుండి వైసీపీ తరుపున పోటీ చేసి జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పై ఎమ్మెల్యేగా గెలిచాడు.[3] ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో 7,874 ఓట్ల మెజారిటీతో నాల్గొవసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభ ప్యానల్ స్పీకర్‌గా పని చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  3. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  4. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.