Jump to content

కర్కాటకరాశి

వికీపీడియా నుండి
(కర్కాట రాశి నుండి దారిమార్పు చెందింది)

కర్కాటకరాశి వారి గుణగణాలు

[మార్చు]

కర్కాటకరాశి వారు మనోధైర్యము కలిగిన ఉంటారు. జల సంబంధిత విషయాఒలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితములో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు మార్లు కష్టపడ వలసి వస్తుంది. సన్నిహిత వర్గములో నిజాయితీపరులు ఉన్నంత వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. రాజకీయరంగములో చక్కగా రాణిస్తారు. మహాలక్ష్మీ పుజ వలన ఆటంకాలను అధిగమించగలరు. లలితకళలలో ప్రవేశము ఉంటుంది. కళా సమ్బంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలరు. సంతానము పురోగతి సాధిస్తారు. ప్రారమ్భములో సమస్యలు ఉన్నా నిదానముగా వాతిని అధిగమిస్తారు. రాణించలేమని భావిమ్చిన రంగాలలో రాణిస్తారు. హాస్యము పత్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది. కార్యనిర్వహనకు చక్కని పధకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు. నిష్కారణ శతృ వర్గము ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఊపిరి తిత్తుల మీద ప్రత్యేక శ్రద్ధ అవసరము. ఇతరుల పేరు మీద చెసే వ్యాపారాలలో ద్రోహము ఎదురౌతుంది. టెండర్లు, ముద్రణా పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి. ధనము నిలువ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికముగా శ్రమపడవలసి వస్తుంది. నిందలు పుకార్లను ఎదుర్కొంటారు. అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది. పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు. పట్టువిడుపు లౌక్యము ప్రదర్శించుట వలన ప్రయోజనము ఉంటుంది. వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము. సన్నిహిత వర్గాన్ని మితి మీరి ప్రోత్సహించడము వలన వారి వలన పోటీ ఏర్పడుతుంది. చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాట్ల వలన అధికముగా నష్టపోతారు. అనుకున్న వివాహము ఒకటి చెసుకున్నది మరొకతి ఔతుంది. శని గ్రహ అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగినా వివ్వహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. సంబమ్ధబాంధవ్యాలు లెని వారు ప్రోత్సహిమ్చి ఆశ్రయము ఇవ్వదము జీవితములో మలుపుకు దారి తీస్తుంది. విదేశీ, విద్య, ఉద్యోగము, విదేశీ యానము కలసి వస్తాయి.భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. అనువంశికముగా వచ్చిన ఆస్తి నిలవదము కష్తము. స్వార్జితము నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు. ఏమాత్రము సంబంధము లెని విషయాలలో ఎదురైయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి. దైవానుగ్రహము అప్రతిష్ఠ రాకుండా కాపాడుతుంది. అహంభావము లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది. భొగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని మరచి పోరు. రవి, చంద్ర గ్రహణాల ప్రభావము ఈ రాశి వారి మీద ఉంటుంది.

కర్కాటకరాశి జ్యోతిష విషయాలు

[మార్చు]

కర్కాటక రాశి అన్నది రాశి చక్రంలో నాలుగవది. రాశి అధిపతి చంద్రుడు. ఈ రాశి అందు ఉచ్ఛ స్థితిని, కుజుడు నీచ స్థితిని పొందుతాడు. దీనిని సమ రాశి, జలరాశి, శుభ రాశి, స్త్రీ రాశి, సౌమ్య రాసి, చర రాశి, కీటక రాశిగా వ్యవహరిస్తారు. ప్రకృతి కఫము, సమయము రాత్రి, సంతానము అధికం, శభదం నిశ్శబ్ధం, దిశ ఉత్తరం, ఉదయం పృష్టోదయ రాశి, వర్ణం పాటల వర్ణం (లే గులాబి), జాతి శూద్ర, జీవులు జల జీవులు, కాల పురుషుని అంగములు వక్షస్థలం, తత్వం పూర్ణ జల తత్వం.రస తత్వము కలిగిన బత్తాయి, నిమ్మ, నారంజ, కమలా, చెరకు, కొబ్బరి ఫలాలకు ఈ రాశి కారకత్వము వహిస్తుంది. బావులు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రములు, ఇతర జలాశయములకు ఈ రాశి కారకత్వము వహిస్తుంది. ఈ రాశి కఫ సంధిత రోగములు, అజీర్ణము, పిత్తాశయంలో రాళ్ళు, కామెర్లు వంటి వ్యాధులకు కాvvvvరకత్వము వహిస్తుంది.

చిత్రాలు

[మార్చు]
కర్కాటకం సాంస్కృతిక , చారిత్రక వర్ణనలు
టర్కిష్ సప్లిమెంట్. 242, ఫోల్. 14v - ఒస్మాన్, క్యాన్సర్ ca. 1582
టర్కిష్ సప్లిమెంట్. 242, ఫోల్. 14v - ఒస్మాన్, క్యాన్సర్ ca. 1582 
14వ శతాబ్దంలో. అరబిక్ మాన్యుస్క్రిప్ట్, బుక్ ఆఫ్ వండర్స్
14వ శతాబ్దంలో. అరబిక్ మాన్యుస్క్రిప్ట్, బుక్ ఆఫ్ వండర్స్ 
డి గ్రే అవర్స్ బుక్ (డి గ్రే అవర్స్)లో, ca. 1390
డి గ్రే అవర్స్ బుక్ (డి గ్రే అవర్స్)లో, ca. 1390 
జాకబ్ జోర్డెన్స్ ది సైన్స్ ఆఫ్ ది రాశిచక్రంలో, ca. 1640
జాకబ్ జోర్డెన్స్ ది సైన్స్ ఆఫ్ ది రాశిచక్రంలో, ca. 1640 
��ెయింట్-ఫిలిబర్ట్ డి టోర్నస్, సాన్-ఎట్-లోయిర్, ఫ్రాన్స్‌లోని మొజాయిక్
సెయింట్-ఫిలిబర్ట్ డి టోర్నస్, సాన్-ఎట్-లోయిర్, ఫ్రాన్స్‌లోని మొజాయిక్ 
కుపా సినాగోగ్, క్రాకో, పోలాండ్‌లోని కుడ్యచిత్రం
కుపా సినాగోగ్, క్రాకో, పోలాండ్‌లోని కుడ్యచిత్రం 

వనరులు

[మార్చు]