Jump to content

చర్చ:ఆది శంకరాచార్యులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఆది శంకరాచార్యులు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2008 సంవత్సరం, 27 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషంఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


విస్తరణ

[మార్చు]

నాకు అద్వైతం గురించి అంతగా తెలియదు. నాకు అర్థం అయ్యినంతవరకు అదిశంకరులు గురించి రాస్తున్నను . అద్వైతసారం నేను నేర్చుకోవలసిన అవసరం చాలా ఉంది. నేను తప్పులు రాసినట్లైతే , సభ్యులు నేను రాసినదానిని సరిదిద్దగలరు. --మాటలబాబు 22:04, 13 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాస మహర్షి విభాగం

[మార్చు]

వ్యాసపు వ్యాసమహర్షి విభాగాన్ని ఒకసారి చూడాలి. సరిగా ఉన్నట్టు లేదు. వ్యాసాన్ని రాసిన వారు చూడాలనుకుంట��. ప్రణిపాకం (?), ఆయుర్దాయం మొదలైన చోట్ల మార్పులు చెయ్యలేమోనని అనిపిస్తూంది. __చదువరి (చర్చరచనలు) 19:13, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మరికొన్ని మార్పుల సూచనలు

[మార్చు]

వ్యాసాన్ని అనువదించే క్రమంలో ఇంగ్లీషు మూలంలోని కొన్ని వాక్యాలను విస్మరించినట్టున్నారు. ఉదాహరణకు, సన్యాసానికి తల్లి ఒప్పుకునే సంఘటనలో, మొసలి మాటుకు గురైన శంకరుడు అప్పటికప్పుడు సన్యాసానికి అంగీకరించమని తల్లిని ఎందుక్కోరాడో తెలుగు వ్యాసం చదివితే నాకు అర్థం కాలేదు. కానీ ఇంగ్లీషు వ్యాసంలో అది ఉంది. ఆ రెండు మూడు వాక్యాలు కూడా ఇక్కడ ఉండి ఉంటే ఆ భాగం మరింత అర్థవంతంగా ఉండేది. అలాంటివి మరి కొన్ని కూడా ఉన్నట్టున్నాయి. వ్యాసాన్ని అన్ని విధాలా పరిశీలించి, అవసరమైన సవరణలు చేసాక "ఈ వారం వ్యాసం"గా పెడితే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 19:23, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం ఇంకా పూర్తి అవ్వలేదు కదా..."ఈ వారం వ్యాసం" గా రావడానికి చాలా సమయం పడుతుంది.--మాటలబాబు 19:34, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఆంగ్ల వికీ లో శంకరాచార్యుల వ్యాసం విశేషవ్యాసం గా ప్రదర్శించారు. అందువలన సత్యాగారిని ఈ వారం శీర్షిక క్రింద ప్రదర్శించవలెనన కోరిక ఉన్నదని ఆ ప్రయత్నం గా వ్యాసాన్ని విస్తరిస్తున్నాను అని రాశాను అందుకే కాబోలు వారు(సత్యా గారు) ఈ వారం వ్యాసం అనే టాగ్ అంటించారు. --మాటలబాబు 13:07, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది పరిశిలించండి

[మార్చు]

నేనే నండి మాటలబాబు ని ఈ ఆదిశంకరుల గురించి వ్రాయాని పించింది. ఏదో మిడి మిడి జ్ఞానం వ్రాశాను. ఒకసారి ఈ లింకు [1] పరిశీలించండి .ప్రణిపాకం అంటే కాళ్ళకు సాక్షాంగ నమస్కారం చెయ్యడం. ఆంగ్లవికీ నుండి చూచి కాపీ రాయడం ఇష్టంలేక శృంగేరి వెబ్ సైటు నుండి చూచి కాపి వ్రాశాను. శంకరులు అని వ్రాయలేకుండా ఉండి పోయాను. శంకరుడు అని వ్రాయడం కష్టంగా తోచింది.--మాటలబాబు 19:29, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

మాటలబాబు గారూ, మంచి వ్యాసం రాసారు, సందేహం లేదు. ఈ వ్యాసం చదివి చాలా విషయాలు తెలుసుకున్నాను. అయితే కొన్ని చోట్ల (నేనుదహరించినవి, మరి కొన్ని) అర్థం కాక ఎన్వికీకి వెళ్ళాల్సి వచ్చింది. విజ్ఞాన సర్వస్వ వ్యాసం నాబోటి తెలియని వాళ్ళకు తెలియజెప్పేలా ఉండాలి గానీ, అనవసరమైన సందేహాలు కలగజేయకూడదు గదా అని నా ఉద్దేశ్యం అంతే! ప్రణిపాకం గురించి రాసినందుకు థాంక్స్. __చదువరి (చర్చరచనలు) 19:41, 15 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

గుణింతం

[మార్చు]

మీరు ఒకసారి సభ్యులు వార్తిక గుణింతం కోసం ఇక్కడ[2] గమనించండి. వ్యాసంలో వార్తిక గుణింతం(స్పెల్లింగ్) వృత్తిక గా మార్చేద్దామా!!--మాటలబాబు 12:58, 16 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వృత్తిక అని ఎందుకనాలో అర్థం కాలేదు. మీరు చూపిన లింకులో వార్తిక గుణింతం కనబడలేదు గానీ ఇక్కడ మాత్రం వార్తిక అనే ఉన్నది చూడండి. కాకపోతే vaartika అని ఉన్నది గానీ vaarttika అని కాదు. __చదువరి (చర్చరచనలు) 14:43, 17 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకసారి నేను అప్ లోడ్ చేసిన ఫైలు గమనించగలరు. బొమ్మ:Vrittika.JPG‎ --మాటలబాబు 15:15, 17 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం పూర్తి

[మార్చు]

వ్యాసాన్ని వచ్చే వారం వచ్చే సోమ-మంగళ వారం కి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తా.ఈ వారం పని వత్తిడి ఎక్కువ గా ఉంటుంది, కొద్దిగా ఏకాగ్రత అవసరం అందుకు వచ్చే వారానికి వాయిదా వేశాను. --మాటలబాబు 20:44, 18 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

శంకరుని రచన

[మార్చు]

మహాభారతానికి ఆదిశంకరుడు భాష్యం వ్రాశాడా? ----కంపశాస్త్రి 23:29, 17 ఆగష్టు 2007 (UTC)

శంకరులు మహాభారతఅనికి భాష్యం వ్రాశాడు. అనే వాక్యాన్ని వ్రాసింది నేను కాని నాజ్ఞానం అతంత మాత్రం, తప్పు అయితే సరిచేయగలరు,నేను సుందర చైతన్య స్వామిజి వ్రాసిన భారతం చదివినప్పుడు శంకరులు మహాభారతానికి భాష్యం వ్రాశాడు, మహాభారతంలొ వచ్చే విష్ణు సహస్రమునకు భాష్యం వ్రాశాడు కాని , ఆ తరువాత కృష్ణుడు విరచించిన శివ స్తోత్రాన్ని కి భాష్యం వ్రాయలేదు (శివకేశవ) అభేధం వల్ల అని చదివి నట్లు గుర్తు.(నేను తప్పు అర్థం చేసుకొని ఉండవచ్చు). ఇప్పుడే ఆంగ్ల్ వికీ మరియు ఇతర చెబ్ సైటు చూశాను ఎక్కడ మహాభారతం మీద శంకరులు భాష్యం వ్రాశారు అని చెప్పడానికి దాఖలాలు లేవు, ఆ వాక్యాన్ని సరిచేయండి తప్పుగా ఉంటేమాటలబాబు 23:46, 17 ఆగష్టు 2007 (UTC)

శైలి గురించి

[మార్చు]

నేను వ్యాసాన్ని విస్తరిస్తూనే పనిలో పనిగా కొన్ని మార్పులు చేశాను - (1) బహు వచనాన్ని ఏక వచనంగా మార్చడం (మాటల బాబుకు కలిగిన తటపటాయింపే నాకూ కలిగింది. కాని ముదురుగా మార్చేశాను) (2) "వస్తాడు", "చేస్తాడు" అని జానపద కధా రూపంలో వ్రాసిన క్రియా పదాలను "వచ్చాడు", "చేశాడు" అని మార్చాను. --కాసుబాబు 12:33, 18 ఆగష్టు 2007 (UTC)


వ్యాసం వ్రాయడంలో "కామా" లేదా "ఫుల్‌స్టాప్" తరువాత "ఖాళీ" ఉంచడం మరచిపోతున్నారు. (Space after comma and full stop) గమనించవలెను. --కాసుబాబు 12:44, 25 ఆగష్టు 2007 (UTC)

మఠాలు

[మార్చు]

కంచి మఠం మూలామ్నాయ మఠంగా చెప్పుకొంటారు. సర్వజ్ఞ మఠంగా చెప్పరని అని అనుకొంటున్నాను. చతుర్మఠ ఆమ్నాయ స్తొత్రము ఇదివరలొ చదివాను. ఆ పొత్తము నావద్ద లేదు. దానిలొ మఠాలగురించి వివరముగా చెప్పబడినది. శాస్త్రిగారు మీ వద్ద ఆమ్నాయ స్తోత్రము ఉంటే చేర్చగలరు --మాటలబాబు 04:55, 25 ఆగష్టు 2007 (UTC)

శ్రీశైలం వ్యాసంలో

[మార్చు]

ఇక్కడ వ్రాయబడిన వ్యాసభాగము ఇప్పటికే శంకరాచార్య వ్యాసంలోనూ మరియూ శ్రీశైల వ్యాసంలోనూ రెండిట్లో ఉన్నాయి.తెలియక ఈ పేజీ సృష్టించబడినదనుకొంటున్నాను.పరిశీలించి ఈపేజీ తొలగించవచ్చును.విశ్వనాధ్. 11:48, 23 ఆగష్టు 2007 (UTC)

శ్రీశైలం వ్యాసం లో ఈ వ్యాస సారాంశం ఉంది.కనుక ఈ పేజీని తొలగించవచ్చు.----కంపశాస్త్రి 14:00, 23 ఆగష్టు 2007 (UTC)

చర్చా పేజీ ఎక్కడికెళ్ళింది

[మార్చు]
అన్యాయం! అన్యాయం! ఆదిశంకరులు పేజిలొ చాలా దీర్ఘ చర్చలు జరిగాయి అవి అన్ని ఇప్పుడు తప్పి పోయి కనిపించడం లేదు.--బ్లాగేశ్వరుడు 00:10, 7 అక్టోబర్ 2007 (UTC)
తరలించటంలో ఎక్కడో చర్చాపేజీని తరలించటం మరచిపోయినట్టున్నారు. తిరిగి తెచ్చాను. --వైజాసత్య 00:19, 7 అక్టోబర్ 2007 (UTC)
ధన్యవాదాలు --బ్లాగేశ్వరుడు 00:21, 7 అక్టోబర్ 2007 (UTC)

ఈ వారం వ్యాసం

[మార్చు]

ఈ వ్యాసం 27వ వారానికి "ఈ వారం వ్యాసం"గా ఉన్నది. అయితే వ్యాసం విస్తరణ కూడా జరుగుతున్నది.

చాలా చక్కనైన వ్యాసం!

[మార్చు]

చాలా చక్కగా ఉందీ వ్యాసం. దీనిని ఇంకా ముఖ్యవ్యాసంగా ఎందుకు గుర్తించలేదో అర్థం కావడం లేదు. రెఫరెన్సులు, సైటేషన్లు అన్నీ సరిగానే ఉన్నాయి.

ముఖ్యవ్యాసమంటే మొదటి పేజీలో పెట్టమని అయితే. చాలా వారాల క్రితమే ఈ వ్యాసాన్ని మొదటి పేజీలో ఉంచాం. విశిష్టవ్యాసంగా గుర్తించాలంటే కొంతమంది సభ్యులు రివ్యూ చేసి. ప్రతి వాక్యాన్ని ఆచితూచి నిర్ణయించాలి --వైజాసత్య 05:25, 10 డిసెంబర్ 2008 (UTC)


విశేష వ్యాసం - కొన్ని సందేహాలు!

[మార్చు]

విశిష్టవ్యాసంగా గుర్తించబడాలంటే ఎంతమంది సభ్యులు రివ్యూ చేయాలి?
ఎవరు రివ్యూ చేయాలి అనే విషయం పై నిబంధనలేమైనా ఉన్నాయా?
రివ్యూ ఎలా చేయాలి?
విశిష్టవ్యాసంగా గుర్తించబడిన వ్యాసాల జాబితాను ఎలా చూడవచ్చు?

నేను చదివినంతవరకూ, నాకు తెలిసినంతలో ఈ వ్యాసంలోని ప్రతి అక్షరమూ సత్యమైనదే. దీనిని విశిష్టవ్యాసంగా గుర్తించటంలో తప్పులేదు.
Cnbrajesh 10:13, 10 డిసెంబర్ 2008 (UTC)

3-4 తెవికీ క్రియాశీలక సభ్యులు రివ్యూ చెయ్యాలి. ఇప్పటిదాకా ఇలాంటి రివ్యూలో తెలుగు వికీలో జరగలేదు కాబట్టి ఇంకా నియమాలంటూ ఏవీలేవు. సాధరణంగా ఆంగ్లవికీలో పద్ధతి ఈ విధంగా సాగుతుంది. ఒక వ్యాసంపై బాగా కృషి చేసిన వ్యక్తి (ప్రధాన వ్యాసకర్త అనుకోవచ్చు) గానీ, ఈ వ్యాసం విశిష్టవ్యాసం కావాలి అన్న వ్యక్తి (ఈ వ్యాసం విషయంలో మీలాగా) రివ్యూని కోరతారు. రివ్యూకు 3-4 సభ్యులను నియమిస్తారు. రివ్యూ ప్రక్రియ ప్రధానంగా వీరు నిర్వహించినా మిగిలినసభ్యులంతా పాల్గొనవచ్చు అనుకుంటా. ఒక నిర్ణీత గడువులో 7-10 రోజులు రివ్యూ ప్రక్రియను పూర్తిచేసి ఒక నివేదిక సమర్పిస్తారు. వాటిలో చెప్పిన విధంగా మార్పులు చేర్పులు చేసిన తర్వాత విశేషవ్యాసంగా ప్రకటిస్తారు. మరింత సమాచారం కోసం en:Wikipedia:Peer_review చూడండి --వైజాసత్య 16:00, 10 డిసెంబర్ 2008 (UTC)
ఇప్పుడు వికీపీడియా:విశేష వ్యాసాలు అన్న జాబితా ఉంది కాని అది తూతూమంత్రం జాబితా. సాధారణంగా విశేష/విశిష్టవ్యాసాలనే మొదటిపేజీలో ప్రదర్శిస్తారు. కానీ తెవికీలో మొదట్లో మొదటి పేజీలో ప్రదర్శించిన వాటన్నింటినీ విశిష్టవ్యాసాలు జాబితాలో చేర్చాము. ఆ తర్వాత ఆ పద్ధతిని నిలిపివేశాం. ప్రస్తుతానికి తెవికీలో విశేషవ్యాసాలేవీ లేనట్లే --వైజాసత్య 16:05, 10 డిసెంబర్ 2008 (UTC)

విశేష వ్యాసం ప్రతిపాదన

[మార్చు]

ఈ వ్యాసం చాలా చక్కగా వ్రాయబడినది. వ్రాసిన విషయాల్లొ తప్పులుకానీ, వివాదాస్పద విషయాలు కానీ లేవని నేను అనుకుంటున్నాను. సభ్యులను పరిశీలించి స్పందించవలసినదిగా కోరుతున్నాను.
Cnbrajesh 13:05, 17 డిసెంబర్ 2008 (UTC)

రాజేష్ గారూ! మీరు చొరవ తీసుకొని ప్రతిపాదన చేసినందుకు కృతజ్ఞతలు. "విశేష వ్యాసం" గుర్తించే విధానం మీద కొంతకాలంగా పెద్ద కృషి జరుగలేదు గనుక ఇతర సభ్యులు వెంటనే స్పందించ లేదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:26, 18 డిసెంబర్ 2008 (UTC)
రాజేష్ గారి ప్రతిపాదనకు చాలా సంతోషం. "విశేష వ్యాసాలు" ఎన్నుకొనే, నిర్ణయించే విధానం ఇంకా స్థిరపడలేదు. అలాంటి ప్రయత్నాన్ని ఈ వ్యాసంతోనే పునఃప్రారంభిస్తున్నాము. సభ్యులందరికీ ఆహ్వానం. ఈ వ్యాసం "విశేష వ్యాసం" గా పరిగణింప బడడానికి ఇంకా ఏమైనా చేయవలసిన పనులుంటే తెలియజేయ గలరు. సాధ్యమైనవారు ఆ పనులు చేసి వ్యాసం మెరుగు పరచడానికి కూడా సహాయపడండి. ప్రస్తుతానికి ఈ వ్యాసం "నాణ్యతా కొలబద్ద"పై తరగతి=విశేషంఅయ్యేది అని ఉంచాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:26, 18 డిసెంబర్ 2008 (UTC)
కాసుబాబుగారూ! మీ సహకారానికి, ప్రతిచర్యకు, కృతఙౌడను. క్రింద చెప్పిన చేయవలసిన పనుల జాబితాలో కొన్నిపనులను చేపట్టగలను -- Cnbrajesh 11:50, 19 డిసెంబర్ 2008 (UTC)
ఈ వ్యాసం విశేషవ్యాసంగా పరిగణించడం చాలా సంతోషకరమైనది. అభినందనలు నిసార్ అహ్మద్ 13:44, 18 డిసెంబర్ 2008 (UTC)

చేయవలసిన పనులు
  • "అనంతర పరిణామాలు" సెక్షన్ కనీసం నాలుగు వాక్యాలు వ్రాయాలి.
  • "వ్యతిరేక దృక్పధాలు" - శంకరాచార్యుని అద్వైతంతో విభేదించిన వారి గురించి కొంచెమైనా వ్రాయాలి - ఉదా: రామానుజాచార్యులు, భక్తివేదాంత ప్రభుపాద వంటివారి వాదనలు.
  • శంకరాచార్యునితో నేరుగా సంబంధం కలిగిన అద్వైతం వ్యాసం మరీ మొలకగా ఉంది. దాన్ని మరి కొంచెమైనా విస్తరించాలి. ద్వైతంతో అది ఎలా విభేదిస్తుంతో తెలపాలి.
  • శంకరాచార్యుని రచనల ముఖచిత్రం మంచిది ఒకటి ఉంచితే బాగుంటుంది. వీలుంటే ఎమ్మెస్ పాడినభజగోవిందం ఆడియో లింకు కూడా ఇస్తే బాగుంటుంది.
  • ముఖ్యమైన అంతర్గత వికీ లింకుల్ని కూడా సరిగా తెలియజేస్తే వ్యాసం సంపూర్ణంగా ఉంటుంది.Rajasekhar1961 13:50, 18 డిసెంబర్ 2008 (UTC)

ఒక వ్యాసం విశేషవ్యాసంగా పరిగణించబడాలంటే, రెఫరెన్సులను కూడా చూడాలని నా అభిప్రాయం. ఎవరైనా పేర్కొన్న మూలాలను సరిచూసి ధ్రువపరిస్తే వ్యాసం యొక్క నాణ్యతను ధ్రువపరచుకోవచ్చు - Cnbrajesh 11:45, 19 డిసెంబర్ 2008 (UTC) దస్త్రం:Adi Shankara Statue.jpg బొమ్మని కామన్స్ లోకి లోడ్ చేసి ఈ వ్యాసంలో ఉంచితే మంచిది.Rajasekhar1961 06:06, 26 అక్టోబర్ 2009 (UTC)

కుమరిల భట్టు, భట్టిపాదుడు

[మార్చు]

{{సహాయం కావాలి-విఫలం}} ఈ వ్యాసంలో కుమరిల భట్టు, భట్టిపాదుడి వృత్తాంతాలు ఒకేలా అనిపిస్తున్నాయి. కుమరిలభట్టు అనే విభాగంలో సమాచారం కొంచెం టూకీగా ఉంటే, భట్టిపాదుడు అనే విభాగంలో కొంచెం వివరంగా ఉంది. రెండింటికీ నేను గమనించిన పోలికలు.

కుమరిల భట్టు విభాగంలో ఇలా ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుల గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు.
భట్టి పాదుడు విభాగంలో ఇలా భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన ఙ్ఞాని. అతడు పుట్టేనాటికి బౌద్ధమతం వ్యాప్తి జరిగి ఉంది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు బౌద్ధం గురించి తెలుసుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని బౌద్ధ భిక్షువుగా వేషం ధరించి ఒక బౌద్ధ మతగురువు వద్ద బౌద్ధ శాస్త్రాల గురించి తెలుసుకోసాగాడు. ఒకనాడు ఒక బౌద్ధ బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోయింది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా బౌద్ధ సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం బోధించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపాటున ఉండగా జరిగింది. మీరు ఇపుడు పరీక్షించవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాదుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక ఖాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహా విష్ణువు ఉన్నాడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమాణముగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని బౌద్ధ బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు. దానితో అతని గురువుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, బౌద్ధంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా శంకరులు అక్కడకు వచ్చి వారిస్తారు. తన సూత్ర భాష్యానికి వార్తికము రచించమని అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యము నెరవేర్చమని, శంకరుల చేతిమీదగా మోక్షము ప్రసాదించమని వేడుకొనగా శంకరులు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్తి ప్రసాదిస్తారు.

వీరిరువరూ ఒకటేనే లేకా వేర్వారా రెండింటిలో ఏది ఉత్తమ ప్రమాణం. తెలిసిన వారెవరైనా చెప్పగలరు. రవిచంద్ర (చర్చ) 07:32, 24 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

{{సహాయం కావాలి}} మూస యర్రా రామారావు గారు 2021-05-21T09:04:02 నాడు చేర్చారు. --అర్జున (చర్చ) 06:01, 30 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వారంరోజులపైగా స్పందనలు లేనందున {{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను. --అర్జున (చర్చ) 06:02, 30 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కాలదోషం పట్టినందున, మూసను లింకుగా మార్చాను. --అర్జున (చర్చ) 15:59, 9 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

ఉపయోగకర మూలాలు

[మార్చు]