హొరనాడు (Horanadu) (కన్నడ : ಹೊರನಾಡು) కర్ణాటక రాష్ట్రములోని చిక్కమగళూరు జిల్లాలో చికమగళూరుకు నైరృతి దిశగా 100 కి.మీల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రము. ప్రకృతి రమణీయ సౌందర్యాలు వెల్లిలువిరిసే పశ్చిమ కనుమల లోఉన్న ఈ గ్రామంలో ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరీ దేవి ఆలయం ఉన్నది. ప్రధాన దేవతా విగ్రహాన్ని ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించారు. ప్రస్తుతం గల అన్నపూర్ణేశ్వరీ దేవి విగ్రహాన్ని 1973 లో ప్రతిష్ఠించారు.[1]

  ?హొరనాడు
కర్ణాటక • భారతదేశం
హోరనాడు అన్నపూర్ణేశ్వరీ దేవి మందిరం మహాద్వారం locator_position=right
హోరనాడు అన్నపూర్ణేశ్వరీ దేవి మందిరం మహాద్వారం locator_position=right
హోరనాడు అన్నపూర్ణేశ్వరీ దేవి మందిరం మహాద్వారం locator_position=right
అక్షాంశరేఖాంశాలు: 13°16′14″N 75°20′29″E / 13.2705°N 75.3414°E / 13.2705; 75.3414
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
జిల్లా (లు) చిక్‌మగళూరు జిల్లా
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 577 181
• +08269

ఎలా వెళ్ళాలి ?

మార్చు

హొరనాడు అనే ప్రాంతం బెంగళూరు నుండి 330 కి.మీ. దూరంలో గల అందమైన ప్రాంతం. ఇది శృంగేరి" క్షేత్రం నుండి 75 కి.మీ. దూరంలో గలదు. బెం��ళూరునుండి ఈ ప్రాంతానికి ప్రతిరోజూ బస్సులు ఉంటాయి. ఈ క్షేత్రానికి వెళ్ళుటకు అవసరమైన బస్సులను కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుపుతోంది. కొన్ని ప్రైవేటు బస్సులు కూడా లభిస్తాయి. ఈ ప్రాంతమునకు సమీప విమానాశ్రయం మంగళూరు విమానాశ్రయం. ఈ విమానాశ్రయం యిదివరకు బాజ్‌పే విమానాశ్రయంగా పిలువబడేది.[2] మంగళూరు హొరనాడుకు 136 కి.మీ. దూరంలో ఉంది. హొరనాడు నుండి మంగళూరుకు రోడ్డు మార్గంలో పోవుటకు మధ్యలో కార్కళ, కళస అనే ప్రాంతాల మీదుగా పోవాలి.

విశిష్టతలు

మార్చు

హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవాలయం సందర్శనకు విచ్చేసిన భక్తులకు జాతి, మత, ప్రాంత, భాషా విభేదాలేవీ లేకుండా పప్పుతో చేసిన ప్రసాదముతో పాటు ముప్పూటలా శాకాహార భోజనము పెడతారు. ఆలయాన్ని సందర్శించే మగ భక్తులు తమ భక్తికి, వినమ్రతకు నిదర్శనముగా చొక్కాలు విడిచి పైభాగాన్ని కండువా లేదా శాలువాను కప్పుకొంటారు.

అమ్మవారి మూలవిరాట్టు బంగారంతో చేయబడిన విగ్రహం. ఈ అమ్మవారిని దర్శిస్తే జీవితంలో అన్నపానాలకు లోటుండదని భక్తుల విశ్వాసం. ఒకసారి శివుడు ఒక శాపానికి గురై శాపవిమోచనార్థం ఈ క్షేత్రాన్ని దర్శించి, అన్నపూర్ణాదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల ఫలితంగా తన శాప విమోచనం పొందినాడని భక్తుల విశ్వాసం. ఈ ప్రాంతమునకు వెళ్ళుటకు కొన్ని ఘాట్లు, దట్టమైన అడవులు గుండా వెళ్లాలి. ఈ ప్రాంతం దర్శించుటకు వెళ్ళేవారికి, ఆదిశక్త్యాత్మక అన్నపూర్ణాదేవి ఆలయం యాత్రికులకు, తమ యాత్రకు ఏర్పాట్లు చేసుకోవటంలో ఇది ముఖ్యమైనది. ఈ క్షేత్ర సందర్శనకు పోవు యాత్రికులకు వరుసగా కుక్కె సుబ్రహ్మణ్య, ధర్మస్థళ, శృంగేరి, ఉడుపి కృష్ణ దేవాలయం, కొల్లూరు మూకాంబిక, కళసలో ఉన్న కాళేశ్వరి ఆలయం వరుసగా వస్తాయి. చివరి యాత్రాస్థలంగా హొరనాడు అన్నపూర్ణాదేవి ఆలయం వస్తుంది.

చిత్రమాలిక

మార్చు

సూచికలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-03-28. Retrieved 2013-04-04.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-30. Retrieved 2013-04-04.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హొరనాడు&oldid=3892999" నుండి వెలికితీశారు