సన్యాసి
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సన్యాసి లేదా బైరాగి బ్రహ్మచర్యాన్ని లేదా సంసార సాగరాన్ని వీడి సత్యాన్వేషణకై దైవ మార్గాన్ని అవలంభించే వ్యక్తి. దీనికి లింగ భేదం లేదు. ఆడవారైనా, మగవారైనా సన్యాసం పుచ్చుకోవచ్చు. వీరు ఎక్కువగా కాషాయ వస్త్త్రాలు ధరించి దేశసంచారము చేస్తుంటారు. ప్రజలకు ధర్మోపదేశం చేస్తూ సాగిపోతుంటారు. వీరిలో కొందరికి మూలికా వైద్యము కూడా తెలిసి ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను తమకు తామే నయం చేసుకొంటారు.మనకి తెలిసి గొప్ప సన్యాసులు శంకర భగవత్పాదులు, రామకృష్ణ పరమహంస, చంద్రశేఖర సరస్వతి, స్వామి వివేకానంద, దత్తాత్రేయులు, శ్రీ గురుడు, మౌన స్వామి, సిద్దేశ్వరానంద భారతి, రమణ మహర్షి ఇలా ఎంతో మంది ఇంకా గొప్ప తపస్వులు తపస్సు కోసం పరితపిస్తూ సన్యా ఆశ్రమ స్వీకారం చేస్తూ దేశాన్ని ఇంకా నడిపిస్తూ ఉన్నారు.