సతేజ్ పాటిల్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచి ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో 2019 డిసెంబరు 30 నుండి 2022 జూన్ 29 వరకు రాష్ట్ర హోం (పట్టణ), గృహ నిర్మాణ, రవాణా శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[1]

సతేజ్ అలియాస్ బంటీ పాటిల్
సతేజ్ పాటిల్


రాష్ట్ర హోం (పట్టణ), గృహ నిర్మాణ, రవాణా శాఖల సహాయ మంత్రి
పదవీ కాలం
30 డిసెంబర్ 2019 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి

ఎమ్మెల్సీ (కొల్హాపూర్ స్థానిక సంస్థ కోటా)
పదవీ కాలం
9 జనవరి 2020 – 29 జూన్ 2022
గవర్నరు భగత్ సింగ్ కొష్యారి
నియోజకవర్గం కొల్హాపూర్ స్థానిక సంస్థ కోటా

హోమ్ అఫైర్స్, గ్రామీణాభివృద్ధి, ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
11 నవంబర్ 2010 – 26 సెప్టెంబర్ 2014
గవర్నరు కె. శంకరనారాయణన్

సి.హెచ్.విద్యాసాగర్ రావు


ఎమ్మెల్సీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జనవరి 2016
గవర్నరు *సి.హెచ్.విద్యాసాగర్ రావు
నియోజకవర్గం కొల్హాపూర్ స్థానిక సంస్థ కోటా

వ్యక్తిగత వివరాలు

జననం (1972-04-12) 1972 ఏప్రిల్ 12 (వయసు 52)
కొల్హాపూర్, కొల్హాపూర్ జిల్లా,మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ప్రతిమ పాటిల్
బంధువులు డా.డి. వై. పాటిల్(తండ్రి), రుతురాజ్ పాటిల్ (మేనల్లుడు)
సంతానం తేజస్, దేవిశ్రీ
పూర్వ విద్యార్థి శివాజీ యూనివర్సిటీ, కొల్హాపూర్
వెబ్‌సైటు సతేజ్ పటేల్

రాజకీయ జీవితం

మార్చు

సతేజ్ పాటిల్ 2004లో రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కార్వీర్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్సీపీ అభ్యర్థి ఖన్విల్కర్ దిగ్విజయ్ భావుసాహెబ్ పై 42604 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ కొల్హాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పై 5767 ఓట్లు మెజారిటీతో గెలిచి 2వ ఎమ్మెల్యేగా ఎన్నికై హోమ్ అఫైర్స్, గ్రామీణాభివృద్ధి, ఫుడ్ & డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.

సతేజ్ పాటిల్ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ కొల్హాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అమల్ మహాదిక్ చేతిలో ఓడిపోయి[3] 2015లో జరిగిన మహారాష్ట్ర శాసనమండలి ఎన్నికల్లో కొల్హాపూర్ స్థానిక సంస్థ కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 డిసెంబరు 30 నుండి 2022 జూన్ 29 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో రాష్ట్ర హోం (పట్టణ), గృహ నిర్మాణ, రవాణా శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.

మూలాలు

మార్చు
  1. DNA India (5 January 2020). "Maharashtra government portfolios allocated: Full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2022. Retrieved 2 July 2022.
  2. Elections (2004). "Madhya Pradesh Assembly Election Results in 2004". Archived from the original on 2 July 2022. Retrieved 2 July 2022.
  3. Hindustan Times (16 April 2022). "Meet Satej Patil: The man behind Congress' victory in Kolhapur" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2022. Retrieved 2 July 2022.