ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్

(రాష్ట్ర గ్రంథాలయ సంస్థ నుండి దారిమార్పు చెందింది)

రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అనునది 1967లో కర్నూలులో స్థాపించడం జరిగింది. రాష్ట్రాల ఎల్లలలో మార్పుల కారణంగా, ఇది తరువాత రద్దయింది. 1960లో ఆంధ్ర ప్రదేశ్ ప్రజా గ్రంథాలయాల చట్టం అమలులోకి వచ్చింది. దీనికి 1989లో సవరణ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ ఏర్పాటయింది. దీనికోసం విద్యాశాఖ (గ్రంథాలయాలు) జిఒ 236/1989 రూపొందించింది.[1]

A.P. Library Association, Vijayawada
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, విజయవాడ

సభ్యులు

మార్చు

దీనిలో మొత్తం 9 మంది సభ్యులు వుంటారు. విద్యా, గ్రంథాలయాలకొరకు విశేష సేవలందించినవారిలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్ గా నియమిస్తుంది. ప్రజా గ్రంథాలయాల శాఖ డైరెక్టర్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. 7 సభ్యులను ప్రభుత్వం నియమిస్తుంది. వారిలో గ్రంథాలయ విద్యలో నిష్ణాతుడైన వారు ఒకరు, గ్రంథాలయోద్యమానికి కృషిచేసినవారు ఇద్దరు, సహాయం పొందుతున్న గ్రంథాలయాల ప్రతినిధి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ లలో ఒకరు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లలో ఒకరు, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయము, ముఖ్య గ్రంథాలయాధికారి.

ఆశయాలు

మార్చు
  • గ్రంథాలయ సేవలను నిర్వహించు, ప్రోత్సహించుట
  • సమగ్ర, పరిపూర్ణ, సమర్థతగల గ్రంథాలయ సేవలను స్థాపన, పరిపుష్టి, అభివృద్ధి చేయుట
  • గ్రంథాలయానికి అందే పుస్తకాలు, పత్రికలు ఎక్కువచేయుట
  • ప్రజా గ్రంథాలయాలకు భవన, పీఠోపకరణాలు ఏర్పాటు
  • ఆర్థికవనరులు చేకూర్చుకొనుట మరియ వాటినిర్వహణను క్రమబద్దంచేయుట
  • సంబంధిత చర్యలు చేపట్టుట
  • అదనపు వనరుల సమీకరణకు సలహాలిచ్చుట
  • గ్రంథాలయ సేవలకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు తయారుచేయుట

పనులు

మార్చు
  • వివిధ దృక్కోణాలనుండి ప్రణాళికలను తయారుచేయుట.
  • ప్రభుత్వ, రాజారామమోహన్ రాయ్ ప్రతిష్ఠానం వారి సలహాలతో, సమగ్ర ప్రణాళికను తయారుచేయుట,, అమలుచేయుట
  • పరిషత్, జిల్లా గ్రంథాలయ సంస్థల ఆర్థిక అంచనాలు ఒప్పుదల చేయుట
  • ప్రభుత్వంతో సంప్రదించి, కొత్త గ్రంథాలయాల, పుస్తక జమ కేంద్రాల, పూర్తి స్థాయి ఉద్యోగాలకు అనుమతి,
  • భవననిర్మాణం, అదనపు ఉద్యోగులు, ప్రాంతీయ, చల గ్రంథాలయాల మార్పులకు నిర్వహణ, ఆర్థిక అనుమతి,
  • బహుమతి, విరాళాల స్వీకృతి
  • ఆడిట్ అయిన లెక్కపత్రాల సమర్పణ
  • గ్రంథాలయ సంస్థల ఆడిట్ అయిన లెక్కపత్రాల అనుమతి
  • ప్రజా గ్రంథాలయాల పనితీరుపై శాసనసభకు సమర్పించు సంవత్సర నివేదికకు అనుమతి.
  • పుస్తకాల ఎంపిక, కొనుగోలు విధానాల నిర్ణయం
  • గ్రంథాలయాల సభలు, సమావేశాల నిర్వహణ
  • గ్���ంథాలయ సేవల సమన్వయం
  • ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళిక తయారి.
  • ప్రజా గ్రంథాలయాల చట్టం గురించి ప్రభుత్వానికి సలహా
  • రెండునెలలలో కనీసం ఒక సారి సమావేశం జరపాలి.

సంస్థ పరిధి

మార్చు

 

అధ్యక్షుడు

మార్చు

రాష్ట్రం విడిపోయిన తరువాత, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ కె సంధ్యారాణి ఇన్ చార్జి ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.[2]

ప్రజా గ్రంథాలయాల శాఖ

మార్చు

ప్రజా గ్రంథాలయాల శాఖకు సంచాలకుడిగా పి పార్వతి విధులు నిర్వర్తిస్తున్నారు.[2] ఈ-గ్రంథాలయంలో భాగంగా రాష్ట్రంలో వున్న గ్రంథాలయాల లోని పుస్తకాల జాబితా మరియ వాటి స్థితిని అంతర్జాలంలో అందుబాటులోకి తెచ్చారు.[3]

ఇవీ చూడండి

మార్చు

వనరులు

మార్చు
  1. Functioning Of Regional Public Libraries In Andhra Pradesh: A Study By Rao, L V Chandra Sekhara, 2008, Google books partial preview
  2. 2.0 2.1 "'Human books' share inspiring tales". The Hindu. 2016-10-27. Retrieved 2018-09-10.
  3. "ప్రజా గ్రంథాలయాల శాఖ". Archived from the original on 2014-03-11. Retrieved 2014-03-18.