రమాప్రభ
రమాప్రభ (జ: మే 5[2], 1946) తెలుగు సినిమా నటి. ఈమె దాదాపు 1400కు పైగా దక్షిణ భారతదేశపు సినిమాలలో నటించింది.
రమాప్రభ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | శరత్ బాబు (విడాకులు) |
చిత్తూరు జిల్లా, వాల్మీకిపురానికి (దీని పాతపేరు వాయల్పాడు) చెందిన ఈ నటి చిన్నతనం నుంచే నటన మీద మక్కువతో ఆ వైపు మరలింది. తండ్రి కృష్ణదాస్ ముఖర్జీ గూడూరులో మైకా వ్యాపారం చేశారు. హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన, ముఖ్యంగా అల్లు రామలింగయ్య, రాజబాబు వంటి నటుల జోడీగా నటించింది. ప్రముఖ నటుడు శరత్ బాబును పెళ్ళాడి 14 సంవత్సరాల తరువాత విడాకులు తీసుకుంది. సినిమాల్లోకి రాకముందు తమిళ నాటకరంగంలో నాలుగువేలకు పైగా రంగస్థల ప్రదర్శనలిచ్చారు.
బాల్యం
మార్చురమాప్రభ 1946, మే 5 [2] న అనంతపురం జిల్లాలోని కదిరిలో జన్మించింది. రమాప్రభ కొట్టి చిన్నమ్మ, గంగిశెట్టి దంపతులకు నాలుగో సంతానంగా పుట్టింది. ఆమె పుట్టే నాటికి ఆమె మేనత్త, మేనమామలకు పిల్లలు లేరు. రమాప్రభ నెలరోజుల పసికందుగా ఉన్నప్పుడు మాకిచ్చేయరాదా పెంచుకుంటాము అని మేనత్త మేనమామ అడగగా, తల్లిదండ్రులు దత్తత ఇచ్చేశారు. మేనమామ కృష్ణదాస్ ముఖర్జీ అబ్రకం గనుల్లో పని చేసేవాడు. రమాప్రభ బాల్యం కదిరిలో కొంతకాలం ఆ తర్వాత ఊటి సమీపంలోని లోయలో సాగింది. ఒక్కగానొక్క పెంపుడు కూతురు కాబట్టి తనను గారాభంగా పెంచారు. కానీ రమాప్రభకు పన్నెండేళ్లు వచ్చేసరికి పెంపుడుతండ్రి చనిపోయాడు. వ్యవసాయ కూలీ అయిన సొంత తండ్రి పదమూడు మంది సంతానంతో వారిని సాకలేక సతమతమవుతూ, కూలీ పని లేనప్పుడు ఇంట్లో గాజుల మలారం పెట్టుకొని గాజులు అమ్మేవాడు. అలాంటి పరిస్థితుల్లో రమాప్రభ, పన్నెండేళ్ల వయసులో మేనత్త రాజమ్మతో కలిసి మద్రాసు చేరుకుంది. చదువు లేక, డబ్బు లేక, తినటానికి తిండి లేక వీధుల వెంట పనికోసం తిరిగారు.
హాస్య భావాలు
మార్చు- పుస్తకం పట్టకుండానే సినీనటినయ్యాను. ఒకటో తరగతి చదివ���ందుకు కూడా పాఠశాలకు వెళ్లలేదు. చదవకుండా ఉంటే సినీ నటులవుతారు.
నటించిన సినిమాల పాక్షిక జాబితా
మార్చు- గుడ్ లక్ సఖీ (2021)
- రొమాంటిక్ (2021)
- హైదరాబాద్ లవ్ స్టోరి (2018)
- ఆరడుగుల బుల్లెట్ (2017)
- వైశాఖం (2017)
- ఆటాడుకుందాం రా (2016)
- బెంగాల్ టైగర్ (సినిమా) (2015)
- మేం వయసుకు వచ్చాం (2012)
- నేరము - శిక్ష (2009)
- జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా (2009)
- నా గర్ల్‌ఫ్రెండ్ బాగా రిచ్ (2009)
- దేశముదురు (2007)
- ఏవండోయ్ శ్రీవారు (2006)
- కోకిల (2006)
- హ్యాపి (2006)
- దేవదాసు (2006)
- వీరభద్ర (2005)
- ఔనన్నా కాదన్నా (2005)
- అంజలి ఐ లవ్యూ (2004)
- ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (2004)
- మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి (2004)
- నేను పెళ్ళికి రెడీ (2013)
- ఆంధ్రావాలా (2004)[3]
- ఠాగూర్ (2003)
- లాహిరి లాహిరి లాహిరిలో (2002)
- అమ్మాయే నవ్వితే (2001)
- ఫ్యామిలీ సర్కస్ (2001)
- అప్పారావుకి ఒక నెల తప్పింది (2001)
- కలిసి నడుద్దాం (2001)
- ప్రేమంటే ఇదేరా (1998)
- ఆవిడా మా ఆవిడే (1998)
- తొలిపొద్దు (1991)
- అప్పుల అప్పారావు (1991)
- వివాహ భోజనంబు (1988)
- రొటేషన్ చక్రవర్తి (1987)
- కారు దిద్దిన కాపురం (1986)
- శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986)
- అనసూయమ్మ గారి అల్లుడు (1986)
- ముచ్చటగా ముగ్గురు (1985)
- స్వాతి (1985)
- జనని జన్మభూమి (1984)
- రుద్రకాళి (1983)
- కోరుకున్న మొగుడు (1982)
- పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
- 47 రోజులు (1981)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- మూగకు మాటొస్తే (1980)
- ఇది కథకాదు (1979)
- ఇంటింటి రామాయణం (1979)
- నా ఇల్లు నా వాళ్ళు (1979)
- ప్రాణం ఖరీదు (1978)
- దొంగల దోపిడి (1978)
- సిరి సిరి మువ్వ (1978)
- సొమ్మొకడిది సోకొకడిది (1978)
- మనుషులంతా ఒక్కటే (1976)
- శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976)
- ఉత్తమురాలు (1976)
- జేబు దొంగ (1975)
- జీవనజ్యోతి (1975)
- దో ఫూల్ (1974)
- రాణీ ఔర్ జానీ (1973)
- బడిపంతులు (1972)
- ఇద్దరు అమ్మాయిలు (1972)
- తాత మనవడు (1972)
- విచిత్ర బంధం (1972)
- బొమ్మా బొరుసా (1971)
- అల్లుడే మేనల్లుడు (1970)
- ప్రేమకానుక (1969)
- బస్తీలో భూతం (1968)
- వింత కాపురం (1968)
- చిలక గోరింక (1966)
మూలాలు
మార్చు- ↑ వాశిరాజు, ప్రకాశం. "రమాప్రభను సినీరంగం మరిచిపోయిందా?". వార్త. Archived from the original on 17 ఏప్రిల్ 2018. Retrieved 15 April 2018.
- ↑ 2.0 2.1 పుట్టినరోజు వివరాలు ఐఎండీబీ నుండి
- ↑ FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2020. Retrieved 6 June 2020.
బయటి లింకులు
మార్చు