మోటూరు హనుమంతరావు
మోటూరు హనుమంతరావు (1917 - 2001) ఆంధ్ర దేశములో పేరు గాంచిన కమ్యూనిస్టు నాయకుడు, రాజ్యసభ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ శాసన సభలోనూ, శాసన మండలిలోనూ సభ్యునిగా పనిచేసారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి తెలుగు దినపత్రికలకు సంపాదుకుడిగా పనిచేసారు. రచయిత
మోటూరు హనుమంతరావు | |
---|---|
దస్త్రం:Moturi Hanumantharao.jpg | |
జననం | 1917 గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామము |
మరణం | 2001 జూన్ 18 |
ప్రసిద్ధి | ప్రజాశక్తి సంపాదకుడు |
పదవి పేరు | రాజ్య సభ సభ్యులు |
పదవీ కాలం | 1988 - 1994 |
రాజకీయ పార్టీ | సి,పి,ఐ,(యం) |
భార్య / భర్త | శ్రీమతి మోటూరి ఉదయం |
పిల్లలు | ముగ్గురు కుమార్తెలు |
తల్లిదండ్రులు | లక్ష్మీ నారాయణ |
జననం
మార్చుమోటూరు హనుమంతరావు గారు గుంటూరు జిల్లా, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామములో ఒక పేద రైతు కుటుంబములో లక్ష్మీ నారాయణ దంపతులకు 1917లో జన్మించాడు. 1938 లో వీరికి ఉదయం గారితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు[1].
రాజకీయ జీవితం
మార్చు1948లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1952లో రేపల్లె నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనభకు పోటీచేసి, అప్పటి మంత్రి కల్లూరి చంద్రమౌళి పై విజయం సాధించారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక శాసనసభలో ఉపనాయకుడిగా వ్యవహరించారు. 1955లో జరిగిన ఏన్నికలో పరాజయం చెందారు. 1978 లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా ఏన్నికై 1984 వరకు పనిచేసారు. 1988 లో ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ్యునిగా ఏన్నికై 1994 వరకు పనిచేసారు.[1]
సంపాదకుడు
మార్చుమోటూరు హనుమంతరావు గారు ఎడిటర్ గా పనిచేసారు. ఆయన విశాలాంధ్ర దిన పత్రికకు 10 ఏళ్ళు ఎడిటర్ గా పనిచేసారు. అలాగే ప్రజాశక్తి దినపత్రిక ఎడిటర్ గానూ 15 ఎళ్ళుగా పనిచేసారు. మోటూరు కలం రాజకీయ వర్గ చైతన్యభరితమైన భావజాలానికి పదసంపద సమకూర్చింది.
రచనలు
మార్చు- నక్సలిజం - పుట్టుక, పరిణామం, పతనం
- అమెరెకన్ సామరాజ్యవాది వైదొలుగు
- రోజెన్ బర్గ్ లు
- నా గమ్యం
మరణం
మార్చుమార్క్సిజం లెనినిజం తీర్చిదిద��దిన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని కష్టజీవుల రాజ్యాన్ని సాధించడానికి సోషలిజం తీసుకురావడానికి ఆజన్మాంతం కృషిచేశారు కామ్రేడ్ మోటూరు హనుమంతరావు. ఒక చేత్తో పార్టీని ప్రజా ఉద్యమాలను మరో చేత్తో పత్రికా వ్యాసంగాన్ని అద్భుతంగా నడిపిన నవ్యసాచి అయన. బహిరంగ సభల్లో అయన గళం రాజకీయ అవకాశవాదాన్ని దుసుమాడేది. పత్రికా రంగంలో అయన కలం ప్రజావ్యతిరేకులను చీల్చి చెండాడేది. ఆయనతో మాట్లాడ్డం ఒక ఎడ్యుకేషన్. అయన ఆప్యాయత వారికీ ఎన్నటికీ మరిచిపోలేని జ్ఞాపకం. 'నా గమ్యం' పేరుతో వారు రాసిన ఈ పుస్తకం అయన విప్లవ పోరాట అనుభవాల సారం. కామ్రేడ్ హనుమంతరావు 2001 జూన్ 18న మరణించారు[1].
వెల్లటూరులో పదవ వర్ధంతి నాడు (18.6.2011) కామ్రేడ్ మోటూరి హనుమంతరావు గారి కాంస్య విగ్రహాన్ని సీతారాం ఏచూరి ఆవిష్కరించారు.