మొజాంజాహి మార్కెట్
మొజాంజాహి మార్కెట్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని నాంపల్లికి సమీపంలో ఉన్న మార్కెట్.[1][2][3] వివిధ రకాల వస్తువులతో కూడిన నాలుగు వందల దుకాణాలు ఈ మార్కెట్ లో ఉన్నాయి. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
మార్కెట్ | |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ |
---|---|
రూపకర్త | నిజాం |
రకం | విక్టరి కాలమ్ |
చరిత్ర
మార్చునిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో తన రెండవ కుమారుడు మొజాం జా బహదూర్ పేరుమీద 1935, జనవరిలో ఈ మార్కెట్ నిర్మించబడింది. దీనిని తెలంగాణ హైకోర్టు నిర్మాణ శైలీ నమూనాలో బూడిద రంగు గ్రానైట్ రాళ్ళతో నిర్మించారు. దీనిపై 7వేల రూపాయలతో గడియారాన్ని కూడా ఏర్పాటుచేశారు.[4]
దుకాణాలు
మార్చుఇందులో జాంబాగ్ పూల మార్కెట్ ఒక భాగంగా ఉండేది. 1980లో ఇక్కడి పళ్ళ మార్కెట్ కొత్తపేట పళ్ళ మార్కెట్ కు మార్చబడింది.[5] ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ఫేమస్ ఐస్ క్రీం షాప్ కూడా ఈ మార్కెట్ లో ఉంది.[6][7] ఇక్కడికి సమీపంలో కరాచీ బేకరి ఉంది.
పునరుద్దరణ
మార్చుతెలంగాణ ప్రభుత్వం 15 కోట్లతో మొజాంజాహి మార్కెట్ కాంప్లెక్స్ పునరుద్ధరణ చేసింది. ఆహ్లాదకర వాతావరణంలో సందర్శకులను ఆకర్షించేలా క్లాక్‌టవర్‌ను తీర్చిదిద్దడంతోపాటు, స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎగురవేసేలా వంద ఫీట్ల భారత జాతీయ జెండాను ఏర్పాటుచేశారు. దీనిని 2020, ఆగస్టు 14న రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించి, మొజాంజాహి మార్కెట్ చరిత్ర పుస్తకం ఆవిష్కరణ చేశాడు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.[8][9]
మూలాలు
మార్చు- ↑ Ifthekhar, J. S. (2012-12-09). "Moazzam Jahi Market cries for attention". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 11 June 2019.
- ↑ Jain, Rupam (2011-12-15). "Moazzam Jahi market is not just a bazaar - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 11 June 2019.
- ↑ Kumar, S. Sandeep (2018-08-10). "Moazzam Jahi market to get facelift by Diwali". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 11 June 2019.
- ↑ మొజాంజాహి మార్కెట్, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 71
- ↑ "Worldwide Travel Guide, Hotels, Restaurant Reviews and Top Travel Destinations - Times of India Travel". Archived from the original on 2013-12-03. Retrieved 2019-06-11.
- ↑ "The 'real' Hyderabadi ice creams from Moazzam Jahi market".
- ↑ "The Moazzam Jahi Market". Archived from the original on 2018-11-16. Retrieved 2020-01-14.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (15 August 2020). "మోజంజాహి.. కొత్తగా!". ntnews. Archived from the original on 15 August 2020. Retrieved 15 August 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (15 August 2020). "చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తాం". www.andhrajyothy.com. Archived from the original on 15 August 2020. Retrieved 15 August 2020.