మంథని శాసనసభ నియోజకవర్గం

మంథని శాసనసభ నియోజకవర్గం, పెద్దపెల్లి జిల్లాలోని 2 శాసనసభ స్థానాలలో ఒకటి.

మంథని శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°39′0″N 79°40′12″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

మార్చు
సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2023[1] 24 మంథని జనరల్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పు కాంగ్రెస్ పార్టీ 103822 పుట్ట మధు పు భారత్ రాష్ట్ర సమితి 72442
2018 24 మంథని జనరల్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పు కాంగ్రెస్ పార్టీ 89045 పుట్ట మధు పు టీఆర్ఎస్ 89045
2014 24 మంథని జనరల్ పుట్ట మధు పు టీఆర్ఎస్ 84037 దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పు కాంగ్రెస్ పార్టీ 64677
2009 24 మంథని జనరల్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పు కాంగ్రెస్ పార్టీ 63770 పుట్ట మధు పు ప్రజారాజ్యం 50561
2004 248 మంథని జనరల్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పు కాంగ్రెస్ పార్టీ 79318 సోమారపు సత్యనారాయణ పు టీడీపీ 36758
1999 248 మంథని జనరల్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పు కాంగ్రెస్ పార్టీ 65884 చంద్రుపట్ల రాంరెడ్డి పు టీడీపీ 50613
1994 248 మంథని జనరల్ చంద్రుపట్ల రాంరెడ్డి పు టీడీపీ 61504 దుద్దిల్ల శ్రీపాద రావు పు కాంగ్రెస్ పార్టీ 40349
1989 248 మంథని జనరల్ దుద్దిల్ల శ్రీపాద రావు పు కాంగ్రెస్ పార్టీ 50658 బెల్లంకొండ సక్కు బాయి పు టీడీపీ 43880
1985 248 మంథని జనరల్ దుద్దిల్ల శ్రీపాద రావు పు కాంగ్రెస్ పార్టీ 34448 బెల్లంకొండ నర్సింగ రావు పు టీడీపీ 27046
1983 248 మంథని జనరల్ దుద్దిల్ల శ్రీపాద రావు పు కాంగ్రెస్ పార్టీ 28470 చందుపట్ల రాజి రెడ్డి పు స్వతంత్ర 27107
1978 248 మంథని జనరల్ సి. నారాయణ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 20482 ఊర శ్రీనివాస రావు పు కాంగ్రెస్ 11890
1972 243 మంథని జనరల్ పాములపర్తి వెంకట నరసింహారావు పు కాంగ్రెస్ పార్టీ 35532 ఈ. వీ. పద్మనాభం పు ఎస్.టీ.ఎస్ 3151
1967 243 మంథని జనరల్ పాములపర్తి వెంకట నరసింహారావు పు కాంగ్రెస్ పార్టీ 25810 యూర పు స్వతంత్ర 16440
1962 254 మంథని జనరల్ పాములపర్తి వెంకట నరసింహారావు పు కాంగ్రెస్ పార్టీ 16844 గులుకోట శ్రీరాములు పు స్వతంత్ర 3740
1957 49 మంథని జనరల్ పాములపర్తి వెంకట నరసింహారావు పు కాంగ్రెస్ పార్టీ 19270 నంబయ్య పు పిడిఎఫ్ 9603

1999 ఎన్నికలు

మార్చు

1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు గెలుపొందారు. దుద్దిళ్ళ శ్రీపాదరావును మావోయిస్టు (పీపుల్స్‌వార్) నక్సలైట్లు 1999 ఏప్రిల్ 13న కాల్చిచంపారు. శ్రీపాదరావు మరణానంతరం ఏర్పడిన సానుభూతి పవనాల్లో రాజకీయవారసునిగా రంగప్రవేశం చేసిన ఆయన కుమారుడు శ్రీధర్‌బాబు ఘనవిజయం సాధించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కాలంలో శ్రీధర్‌బాబు కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు.[2]

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మంథని శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీధర్ బాబు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కల్వసోమాపుర సత్యనారాయణపై 42560 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. శ్రీధర్ బాబుకు 79318 ఓట్లు రాగా, సత్యనారాయణకు 36758 ఓట్లు లభించాయి. రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. 2004 నుంచి 2009 వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యునిగా, ప్యానెల్ స్పీకర్‌గా, ప్రభుత్వ విప్‌గా వివిధ పదవులను చేపట్టారు.[2]

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రౌతు కనకయ్య పోటీచేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పోటీచేశారు. భారతీయ జనతా పార్టీ నుండి శశిభూషన్ కాచే, ప్రజారాజ్యం పార్టీ తరఫున పుట్ట మధు, లోక్‌సత్తా నుండి ఓ.సంపత్ పోటీచేశారు.[3] శాసనసభ్యునిగా మంథని తరఫున మూడోసారి గెలుపొందిన శ్రీధర్‌బాబుకు 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ (ఆంధ్రప్రదేశ్), ప్రవాసాంధ్రుల శాఖలల మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం రోశయ్య ఏర్పాటుచేసిన ప్రభుత్వంలోనూ ఉన్నత విద్యాశాఖ, ప్రవాసాంధ్రుల శాఖలకు మంత్రిగానే కొనసాగారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో శాసనసభ వ్యవహారాలశాఖ, పౌరసరఫరాల శాఖలను చేపట్టారు.[2] 2014లో శ్రీధర్‌బాబును శాసనసభ వ్యవహారాలశాఖ నుంచి తప్పించి వాణిజ్యపన్నుల శాఖను అప్పగించారు.[4] తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చకు వచ్చే తరుణంలో తనను కీలకమైన శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి తప్పించడం అవమానకరమని పేర్కొంటూ శ్రీధర్‌బాబు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.[5][6] ఆయన రాజీనామా ఆమోదానికి కాకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి పాలనలోకి, శాసన సభ సుప్తచేతనావస్థలోకి వెళ్లడంతో సాంకేతికంగా మంత్రిగానే తదుపరి ఎన్నికలు ఎదుర్కొన్నట్టు భావించాలి.

2014 ఎన్నికలు

మార్చు

2014 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి పుట్ట మధుకర్ గెలుపొందారు.

2018 ఎన్నికలు

మార్చు

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీధర్‌బా బుకు 89,045 ఓట్లు పోలు కాగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్ట మధుకు 72,815 ఓట్లు వచ్చాయి. ద���ంతో శ్రీధర్‌బాబు 16,230 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించాడు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. 2.0 2.1 2.2 జననేతగా ఎదిగిన శ్రీధర్‌బాబు:ఆంధ్రజ్యోతి:మార్చి 30, 2014
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  4. శ్రీధర్‌బాబు శాఖ మారింది:సాక్షి దినపత్రిక:జనవరి 1, 2014
  5. మంత్రి పదవికి శ్రీధర్‌బాబు రాజీనామా:సాక్షి దినపత్రిక:జనవరి 2, 2014
  6. శ్రీధర్‌బాబు రాజీనామా:సాక్షి దినపత్రిక:జనవరి 3, 2014

వెలుపలి లంకెలు

మార్చు