బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం

ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ ( శాసనసభ) నియోజకవర్గాలలో బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం ఒకటి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఇది నూతనంగా ఏర్పడింది. అదిలాబాదు తూర్పువైపున ఉన్న ఈ నియోజకవర్గం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

బెల్లంపల్లి
—  శాసనసభ నియోజకవర్గం  —
బెల్లంపల్లి is located in Telangana
బెల్లంపల్లి
బెల్లంపల్లి
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాదు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

నియోజకవర్గపు భౌగోళిక సరిహద్దులు

మార్చు

అదిలాబాదు జిల్లాలో తూర్పు వైపున కల ఈ నియోజకవర్గానికి ఉత్తరాన సిర్పూర్, ఆసిఫాబాదు నియోజకవర్గాలు ఉండగా, దక్షిణాన చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున కొద్ది భాగం మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది.

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 గుండా మల్లేష్ సి.పి.ఐ. శంకర్ కాంగ్రెస్ పార్టీ
2014 దుర్గం చిన్నయ్య తె.రా.స గుండా మల్లేష్ సి.పి.ఐ.
2018 దుర్గం చిన్నయ్య తె.రా.స జి.వినోద్ బహుజన్ సమాజ్ పార్టీ
2023[1] జి.వినోద్ భారత రాష్ట్ర సమితి దుర్గం చిన్నయ్య కాంగ్రెస్ పార్టీ

ఎన్నికలు

మార్చు

2009లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో (ఈ నియోజ‌క‌వ‌ర్గ తొలి ఎన్నిక‌లు) సిపిఐ త‌ర‌పున పోటీ చేసిన గుండా మ‌ల్లేష్ (41,957 ఓట్లు), కాంగ్రెస్ అభ్య‌ర్థి చిలుమ‌ల శంక‌ర్ (33,065 కోట్లు)పై 8,892 ఓట్ల‌తో ఘ‌న విజ‌యం సాధించారు. మ‌హాకుట‌మి (టిడిపి, టిఆర్ఎస్‌, సిపిఐ, సిపిఎం) త‌ర‌పున పొత్తులో భాగంగా సిపిఐకు కేటాయించారు. దీంతో సిపిఐ త‌ర‌పున గుండా మల్లేష్, కాంగ్రెస్ త‌ర‌పున చిలుమ‌ల శంక‌ర్‌, ప్ర‌జారాజ్యం త‌ర‌పున అమరాజుల శ్రీదేవి, బిఎస్‌పి త‌ర‌పున బ‌త్తుల మ‌ధు పోటీ చేశారు.

2014 ఎన్నిక‌ల్లో సిపిఐ అభ్య‌ర్థి గుండా మల్లేష్ (21,251 ఓట్లు)పై టిఆర్ఎస్ (టిఆర్ఎస్‌) అభ్య‌ర్థి దుర్గం చిన్నయ్య (73,779 ఓట్లు) 52,528 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపొందారు.

2018లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టిఆర్ఎస్ అభ్య‌ర్థి దుర్గం చిన్నయ్య రెండో సారి గెలిశారు. ఆ ఎన్నిక‌ల్లో బిఎస్‌పి అభ్య‌ర్థి జి.వినోద్ (43,750 ఓట్లు)పై దుర్గం చిన్నయ్య (55,026 ఓట్లు) 11,276 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ త‌ర‌పున దుర్గం చిన్నయ్య బిఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది.


2023 ఎన్నికలు

మార్చు

2023 లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజక వర్గం లో అసెంబ్లీ ఎన్నికలు 30 నవంబర్ 2023 లో జరిగినాయి.ఫలితము 3 డిసెంబర్ 2023 న ఫలితాలు వెలువడినాయి[2].ఈ నియోజక వర్గంలో ప్రధనంగా మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ , భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి ఈ మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరి సాగింది. చివరికు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ 82,217 ఓట్ల మెజారిటీతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి దుర్గం చిన్నయ్య పై విజయం సాధించారు. బెల్లంపల్లి నియోజక వర్గంలో మొత్తం రౌండ్లో వారీగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కౌంటింగ్ నిర్వహించారు.మొత్తం 14 మంది అభ్యర్థులు పోటిలో ఉండగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ కు 82,217 ఓట్లు 57.96% , భారత రాష్ట్ర సమితి దుర్గం చిన్నయ్య కు 45,399 ���ట్లు 31,96%, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరాజులు శ్రీదేవి కు 3,812 ఓట్లు 2.69 ,నోటాకు 2,179 ఓట్లు 1,54% వచ్చాయి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ 36,878 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించాడు. బెల్లంపల్లి నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా గెలుపు పత్రం అందుకున్నాడు.[3]

క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు శాతం
1 గడ్డం వినోద్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 82,217 57,96%
2 దుర్గం చిన్నయ్య భారత రాష్ట్ర సమితి పార్టీ 45,339 31,96%
3 అమరాజుల శ్రీదేవి భారతీయ జనతా పార్టీ 3,812 2,69%
4 నోటా నోటా 2,179 1.54%
5 దుర్గే ఈశ్వర్ ఇండిపెండింట్ పార్టీ 1,512 1.07%
6 శ్రీనివాస్ రాంటెంకి ఇండిపెండెంట్ 1,289 0.91%
7 నర్సయ్య జాడి ఇండిపెండెంట్ 1,183 0.85%

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. "Bellampalli Constituency Election Results 2023: Bellampalli Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-06-12.
  3. "https://telugu.samayam.com/elections/telangana-assembly-elections/bellampalli-constituency-3". Samayam Telugu. Retrieved 2024-06-12. {{cite web}}: External link in |title= (help)