బెలోనియా

త్రిపుర రాష్ట్రంలోని దక్షిణ త్రిపుర జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం.

బెలోనియా, త్రిపుర రాష్ట్రంలోని దక్షిణ త్రిపుర జిల్లా ముఖ్య పట్టణం, ప్రధాన కార్యాలయం. మున్సిపల్ కౌన్సిల్ గా కూడా ఏర్పడింది.

బెలోనియా
నగరం
బెలోనియా is located in Tripura
బెలోనియా
బెలోనియా
భారతదేశంలోని త్రిపురలో ప్రాంతం ఉనికి
బెలోనియా is located in India
బెలోనియా
బెలోనియా
బెలోనియా (India)
Coordinates: 23°15′N 91°27′E / 23.25°N 91.45°E / 23.25; 91.45
దేశం భారతదేశం
రాష్ట్రంత్రిపుర
జిల్లాదక్షిణ త్రిపుర
 • Rank2
Elevation
23 మీ (75 అ.)
జనాభా
 (2015)
 • Total21,176
భాషలు
 • అధికారికబెంగాళీ, కోక్బోరోక్, ఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
799155
టెలిఫోన్ కోడ్03823
Vehicle registrationటిఆర్ 08

భౌగోళికం

మార్చు

బెలోనియా పట్టణం 23°15′N 91°27′E / 23.25°N 91.45°E / 23.25; 91.45 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] సముద్ర మట్టానికి 23 మీటర్లు (75 అడుగులు) ఎత్తులో ఉంది.

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, [2] బెలోనియా మునిసిపల్ కౌన్సిల్ లో 19,996 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. బెలోనియా సగటు అక్షరాస్యత 95% కాగా, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఈ అక్షరాస్యతలో 54% మంది పురుషులు, 46% స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 9% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

పర్యాటక ప్రాంతాలు

మార్చు
  • పిలక్-పాథర్: 12 వ శతాబ్దపు హిందూ-బౌద్ధ పురావస్తు ప్రదేశం
  • కృష్ణ వన్యప్రాణుల అభయారణ్యం
  • యోగ్మయ ఆలయం, కాళిబారి
  • ఇండో-బంగ్లా కస్టమ్ చెక్‌పోస్ట్
  • రాజరాజేశ్వరి ఆలయం, ముహూరిపూర్
  • ముహూరిచార్ నది ద్వీపం
  • ముహూరిపూర్ ఫిషరీ
  • భారత్ - బంగ్లాదేశ్ మైత్రి ఉద్ద్యాన్ (సా.శ. 1971 లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ఇది ఒక చిరస్మరణీయ ప్రదేశం)
  • ఎకో పార్క్

బెలోనియా రైల్వే స్టేషను

మార్చు

2019, ఫిబ్రవరి నుండి బెలోనియా నుండి అగర్తలా వరకు రైల్వే సర్వీసు ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రతిరోజూ (ఆదివారం తప్ప) 4 రైళ్ళు బెలోనియా, అగర్తాలా మధ్య నడుస్తున్నాయి.[3] ఈశాన్య సరిహద్దు రైల్వే లమ్డింగ్ రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే అగర్తాలా - సబ్రూమ్ రైలు విభాగంలో ఈ స్టేషను ఉంది.[4][5]

ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్

మార్చు

భారతదేశ సరిహద్దులోని బెలోనియా రైల్వే స్టేషనులో ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ కోసం ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ఉంది.

రాజకీయాలు

మార్చు

బెలోనియా అసెంబ్లీ నియోజకవర్గం త్రిపుర పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[6]

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. Falling Rain Genomics, Inc - Belonia
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 31 December 2020.
  3. "BLNIA/Belonia Railway Station Map/Atlas NFR/Northeast Frontier Zone - Railway Enquiry". indiarailinfo.com. Retrieved 31 December 2020.
  4. IANS (22 February 2016). "First Commercial Broad Guage [sic] Freight Train Arrives In Tripura". NDTV. Retrieved 31 December 2020.
  5. "TRIPURAINFO : The first news, views & information website of TRIPURA". 2016-03-21. Archived from the original on 2016-03-21. Retrieved 31 December 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies" (PDF). Tripura. Election Commission of India. Archived from the original (PDF) on 8 November 2005. Retrieved 31 December 2020.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బెలోనియా&oldid=3946624" నుండి వెలికితీశారు