బి. సంజీవరావు
బేగరి సంజీవరావు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. 2014లో వికారాబాదు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]
బి. సంజీవరావు | |||
బి. సంజీవరావు | |||
తెలంగాణ రాష్ట్ర మాజీ శాసనసభ్యుడు
| |||
నియోజకవర్గం | వికారాబాదు శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మే 9 గేట్‌వనంపల్లి, నవాబ్‌పేట్ మండలం, వికారాబాదు జిల్లా, తెలంగాణ | ||
మరణం | ఫిబ్రవరి 25, 2020 | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | మధురవేణి | ||
సంతానం | ముగ్గురు కుమార్తెలు (లావణ్య, సుష్మా ప్రియాంక, ప్రియదర్శిని) | ||
మతం | హిందూ |
జననం
మార్చుసంజీవరావు మే 9న దేవదాస్, కమలమ్మ దంపతులకు వికారాబాదు జిల్లా, నవాబ్‌పేట్ మండలం, గేట్‌వనంపల్లి గ్రామంలో జన్మించాడు. బీఎస్సీ అగ్రికల్చర్ చదివాడు.[2]
ఉద్యోగం - కుటుంబం
మార్చుగ్రూప్–2 ఉద్యోగం సాధించి ఏఓగా పనిచేశాడు. సంజీవరావుకు మధురవేణితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు (లావణ్య, సుష్మా ప్రియాంక, ప్రియదర్శిని).[3]
రాజకీయ ప్రస్థానం
మార్చురాజకీయాలపై ఆసక్తితో ఉన్న సంజీవరావు తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1994లో స్వతంత్ర అభ్యర్థిగా వికారాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏ. చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయాడు.
1995లో జరిగిన వికారాబాదు పురపాలక సంఘం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 3,700 మెజార్టీతో గెలిచి వికారాబాదు పురపాలక సంఘ అధ్య���్షుని బాధ్యతలు స్వీకరించాడు. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా తరపున ధారూర్ జడ్పీటీసీగా పోటీచేసి గెలుపొందాడు. 2008లో జరిగిన ఉప ఎన్నికలో టీడిపి నుండి పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ చేతిలో ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలలో కొంతకాలం పనిచేశాడు. 2014లో ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి వికారాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ పై 10124 ఓట్ల తేడాతో గెలుపొందాడు.[4] ఆ తరువాత సంజీవరావు అనారోగ్యానికి గురవడంతో 2018లో టికెట్ రాకపోవడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.[5]
1999, 2004 ఎన్నికల్లో సంజీవరావు భార్య మధురవేణి పోటీచేసి రెండుసార్లు ఏ. చంద్రశేఖర్ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయింది.
మరణం
మార్చుమూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న సంజీవరావు కొద్దిరోజుల క్రితం డయాలసిస్ చేయించుకున్నాడు. 2020, ఫిబ్రవరి 24 సోమవారం రాత్రి అస్వస్థతకు గురైన సంజీవరావును నిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. 2020, ఫిబ్రవరి 25 మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు.[6]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు, వికారాబాదు (26 February 2020). "వ్యవసాయాధికారి నుంచి ఎమ్మెల్యే వరకు." Archived from the original on 27 February 2020. Retrieved 27 February 2020.
- ↑ Eenadu (14 November 2023). "నవాబు పేట నేతలు వీరు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
- ↑ ఈనాడు, ప్రధానాంశాలు (26 February 2020). "మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మృతి". google.eenadu.net. Archived from the original on 27 February 2020. Retrieved 27 February 2020.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ సాక్షి, తెలంగాణ (26 February 2020). "మాజీ ఎమ్మెల్యే సంజీవరావు కన్నుమూత". Archived from the original on 27 February 2020. Retrieved 27 February 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (26 February 2020). "మాజీ ఎమ్మెల్యే సంజీవరావు హఠాన్మరణం". Archived from the original on 27 February 2020. Retrieved 27 February 2020.