బహ్‌రైచ్ జిల్లా
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బహ్‌రైచ్ జిల్లా (హిందీ:जनपद बहराइच) (ఉర్దూ: ضلع بہرائچ) ఒకటి. బహ్‌రైచ్ పట్టణం ఈ జిల్లా కేంద్రం. జిల్లా దేవీపటన్ డివిజన్‌లో భాగం.
బహ్‌రైచ్ జిల్లా
बहराइच जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | దేవీపటన్ |
ముఖ్య పట్టణం | బహ్రైచ్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,696.8 కి.మీ2 (1,813.4 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 34,78,257 |
• జనసాంద్రత | 740/కి.మీ2 (1,900/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 51.1 per cent |
సగటు వార్షిక వర్షపాతం | 1125 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
చరిత్ర
మార్చుబహ్రైచ్ జిల్లా అవధ్ ప్రాంతంలో భాగం. ఈ జిల్లా నాంపరా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అరణ్యప్రాంతంతో కూడిన 100 గ్రామాల కంటే అధికంగా ఉన్న ఈ ప్రాంతం కొంతమంది వంశానుగత రాజుల పాలనలో ఉండేది. దివంగత రాజా సదత్ ఈ ప్రాంతంలో పాఠశాలలు నిర్మించి, విద్యాభివృద్ధికి కృషి చేసాడు.
భౌగోళికం
మార్చుబహ్రైచ్ జిల్లా వాయవ్య సరిహద్దులో నేపాల్ దేశంలోని బర్దియా జిల్లా, ఈశాన్య సరిహద్దులో నేపాల్ దేశంలోని బంకే జిల్లా, పశ్చిమ సరిహద్దులో లఖింపూర్ ఖేరి, సీతాపూర్ జిల్లాలు, పశ్చిమ సరిహద్దులో సీతాపూర్ జిల్లా, నైరుతీ సరిహద్దులో హర్దోయీ, ఆగ్నేయ సరిహద్దు��ో గోండా, తూర్పు సరిహద్దులో శ్రావస్తి జిల్లాలు ఉన్నాయి.
ఆర్ధికం
మార్చు2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బహ్‌రైచ్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 32 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,478,257, [2] |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 90వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | 706 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 46.08%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 891:1000 |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 51.1%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ప్రజలు
మార్చుజిల్లాలో మొత్తం ప్రజలలో మైనారిటీ ప్రజలు 36% ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎ వర్గానికి చెందిన జిల్లాలలో బహ్‌రైచ్ జిలా ఒకటి.బహ్‌రైచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 సంఘిక, ఆర్థిక సూచికలు, అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్నులా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.[3]
విద్య
మార్చు- ఎస్.టి. పీటర్ ఇంటర్ కాలేజ్ (నంపద)
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
- ↑ 2.0 2.1 2.2 2.3 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010 Archived 2011-09-30 at the Wayback Machine. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS