బత్తుల బలరామకృష్ణ
బత్తుల బలరామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రాజానగరం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
బత్తుల బలరామకృష్ణ | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 నుండి ప్రస్తుతం | |||
ముందు | జక్కంపూడి రాజా | ||
---|---|---|---|
నియోజకవర్గం | రాజానగరం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1975 గదరాడ గ్రామం, కోరుకొండ మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | జనసేన పార్టీ | ||
తల్లిదండ్రులు | గంగారావు, గోవిందమ్మ | ||
జీవిత భాగస్వామి | వెంకట లక్ష్మి | ||
సంతానం | ప్రత్యూష దేవి, వందనంబిక |
రాజకీయ జీవితం
మార్చుబత్తుల బలరామకృష్ణ కోరుకొండ మండలం గాదరాడలో శక్తిపీఠం ద్వారా ప్రజలకు పరిచయమైన ఆయన ఆ తరువాత వైఎస్‌ఆర్‌సీపీలో చేరి ఆయన సతీమణి వెంకటలక్ష్మిని ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిపించుకొని అనతి కాలంలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు. ఆయన ఆ తరువాత జనసేన పార్టీలో చేరగా ఆయనను రాజానగరం నియోజకవర్గానికి ఇంచార్జిగా 16 జులై 2023న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నియమించాడు.[2]
బలరామకృష్ణ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో జనసేన పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా పై 34,049 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4][5]
మూలాలు
మార్చు- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ A. B. P. Desam (16 July 2023). "వేగం పెంచిన పవన్ కళ్యాణ్, 3 నియోజకవర్గాలకు ఇంఛార్జుల నియామకం - నిర్మాతకు కీలక పదవి". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Rajanagaram". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ Eenadu (5 June 2024). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విజేతలు వీరే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.