పొందూరి వెంకట రమణారావు

పొందూరి వెంకట రమణ రావు ( ఏప్రిల్ 3, 1917 - ఏప్రిల్ 13, 2005) ఒక భారతీయ మైక్రోబయాలజిస్ట్. ఇతడు బ్రిటిష్ ఇండియా, మద్రాసు ప్రెసిడెన్సీ, ఒంగోలు జిల్లాలోని (ప్రస్తుతం ప్రకాశం జిల్లా ) రాజుపాలెంలో జన్మించాడు.

పొందూరి వెంకట రమణారావు
జననం (1917-04-03) 1917 ఏప్రిల్ 3 (వయసు 107)
కె.రాజుపాలెం, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం2005 ఏప్రిల్ 13(2005-04-13) (వయసు 88)
రంగములుమైక్రో బయాలజీ
వృత్తిసంస్థలుఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్
చదువుకున్న సంస్థలుఆంధ్ర వైద్య కళాశాల, విశాఖపట్నం

ఇతడు 1937లో రాజమండ్రిలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు . 1944లో విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ పట్టా పొందాడు. 1944 - 1947 మధ్య ఆర్మీ మెడికల్ సర్వీస్‌లో పనిచేశాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో రెజిమెంటల్ మెడికల్ ఆఫీసర్‌గా, ఫీల్డ్ అంబులెన్స్ ఆఫీసర్ (ఆర్మీ) గా పనిచేశాడు. ఇతడు 1948లో కోల్‌కతాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ నుండి పబ్లిక్ హెల్త్‌లో డిప్లొమాను, ఆంధ్రా మెడికల్ కాలేజీ నుండి బాక్టీరియాలజీలో ఎం.డి. డిగ్రీని పొందాడు.

1953లో ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్‌లో బాక్టీరియాలజీ లెక్చరర్‌గా చేరి 1957లో ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందాడు. వైద్య కళాశాలలో 14 సంవత్సరాలపాటు ఇతడు మైక్రోబయాలజీ విభాగాన్ని నిర్వహించాడు. ఆ విభాగాన్ని సమగ్ర పరిశోధనా సౌకర్యాలతో పూర్తి స్థాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ కేంద్రంగా అభివృద్ధి చేశాడు. ఇతడు 1958-1959లో ఎ.సి.టి.ఎం. ఫెలోషిప్‌తో సిరాక్యూస్, న్యూయార్క్ ను అల్బానీ, న్యూయార్క్‌లోని వైరస్ ల్యాబ్‌లను సందర్శించాడు. అక్కడ ఇతడు యావ్స్, ఎండిమిక్ టైఫస్, కలరాలపై పనిచేశాడు.ఇతడు 12 జాతీయ, అంతర్జాతీయ సైంటిఫిక్ అసోసియేషన్లలో సభ్యునిగా ఉన్నాడు. ప్రజారోగ్య రంగంలో తన కృషికి గుర్తింపుగా అమెరికన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ఫెలోగా ఎన్నికయ్యాడు. ఇతడు అనేక ఐ.సి.ఎం.ఆర్ కమిటీలలో, శాస్త్రీయ సలహా బోర్డులలో సభ్యుడిగా సేవలను అందజేశాడు. 1967లో ఇతడు హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి 1973 వరకు పనిచేశాడు. ఈ సంస్థను 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. నాచారం వద్ద ఈ భూమిని ప్రీమియర్ వ్యాక్సిన్ యూనిట్‌గా మార్చాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అప్పటి భారత రాష్ట్రపతి వివి గిరి ప్రారంభించారు

ఇతడు యుగోస్లేవియా, యునైటెడ్ కింగ్‌డమ్, యుఎస్‌ఎస్‌ఆర్‌లోని వివిధ ఇన్‌స్టిట్యూట్‌లను WHO ఫెలోగా సందర్శించి లైయోఫిలైజ్డ్ మశూచి వ్యాక్సిన్ ఉత్పత్తిని పరిశీలించాడు.

పదవీ విరమణ తరువాత, ఇతడు బెల్జియం, దావణగెరె, దక్కన్, బీదర్ డెంటల్ కాలేజీలలోని వివిధ వైద్య కళాశాలలలో బోధించాడు. దక్షిణ బీహార్‌లో జాతీయ మశూచి నిర్మూలన కార్యక్రమానికి (NSEP) భారత ప్రభుత్వం , ప్రపంచ ఆరోగ్య సంస్థలకు సలహాదారుగా వ్యవహ��ించాడు. మశూచి చివరికి 1975లో భారతదేశం నుండి నిర్మూలించబడింది.

మూలాలు

మార్చు
  • రావు, డా. పి.వి.రమణ; ఎసెన్షియల్స్ ఆఫ్ మైక్రోబయాలజీ, మెడిసర్జ్ పబ్లికేషన్స్. 1వ ఎడిషన్, 2004. ISBN 81-239-1084-3