నాగర్‌కర్నూల్

నాగర్‌కర్నూల్ జిల్లా, నాగర్‌కర్నూల్ మండలం లోని పట్టణం.

నాగర్‌కర్నూల్, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, నాగర్‌కర్నూల్ మండలం లోని గ్రామం.[2]

Nagarkurnool
Nickname: 
Kandanulu
Nagarkurnool is located in Telangana
Nagarkurnool
Nagarkurnool
Nagarkurnool (Telangana)
Nagarkurnool is located in India
Nagarkurnool
Nagarkurnool
Nagarkurnool (India)
Coordinates: 16°29′38″N 78°18′37″E / 16.493900°N 78.310200°E / 16.493900; 78.310200
Country India
StateTelangana
DistrictNagarkurnool
Founded byNagana, Kandana
విస్తీర్ణం
 • Total4.26 కి.మీ2 (1.64 చ. మై)
Elevation
480 మీ (1,570 అ.)
జనాభా
 (2011)[1]
 • Total26,801
 • జనసాంద్రత6,300/కి.మీ2 (16,000/చ. మై.)
Languages
 • OfficialTelugu, Urdu
Time zoneUTC+5:30 (IST)
Pin
509209
Vehicle registrationTS 31
Sex ratio1.1:1 /

ఇది రెవెన్యూ డివిజన్, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్రంగా ఉంది.2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[3] ఈ పట్టణానికి నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నాగర్‌కర్నూల్ ఒక జిల్లాగా మారింది, ఇది జిల్లా పరిపాలన కేంద్రం.ఇది చుట్టుపక్క గ్రామాలకు ఈ మండల కేంద్రం ఒక పెద్ద వ్యాపార కూడలి. చుట్టుపక్క గ్రామాల ప్రజలు వారాంతంలో సేద తీర్చుకొనుటకు ఇక్కడికి వచ్చి సినిమా చూసి పొతారు.ఒక్కపుడు ఇక్కడ 5 సినిమా హాళ్ళు వుండేవి. కానీ ఇప్పుడు 3 సినిమా హాళ్లు మాత్రమే ఉన్నాయి. చిన్నా పెద్ద పాఠశాలలు మొత్తం 50 దాక ఉన్నాయి.

సరిహద్దులు

మార్చు

ఈ మండలానికి ఉత్తరాన తాడూరు మండలం, తూర్పున తెల్కపల్లి, దక్షిణాన పెద్దకొత్తపల్లి, గోపాలపేట, పశ్చిమాన బిజినేపల్లి మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

గణాంకాలు

మార్చు

2001 లెక్కల ప్రకారం మండల జనాభా 68538. ఇందులో పురుషులు 34960, మహిళలు 33578. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 74692. ఇందులో పురుషులు 37731, మహిళలు 36961. పట్టణ జనాభా 26759, గ్రామీణ జనాభా 47933. జనాభాలో ఇది జిల్లాలో 9వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు

మార్చు

మహబూబ్ నగర్ నుంచి శ్రీశైలం వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండల కేంద్రం నుంచి కొల్లాపూర్, కల్వకుర్తి, గోపాలపేట్ లకు కూడా రహదారి సౌకర్యం ఉంది.

చరిత్ర

మార్చు

నాగర్‌కర్నూల్ పూర్వనామం నాగనవోలు. 1883 వరకు ఈ పట్టణం జిల్లా కేంద్రంగా పనిచేసింది. నాగన, కందన సోదరులు ఈ ప్రాంతాన్ని పాలించారు.వారి పేరిట ఈ పట్టణానికి ప్రస్తుతనామం వచ్చినట్లు కథనం ప్రచారంలో ఉంది.

రాజకీయాలు

మార్చు

ఈ మండలం నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంకటేశ్వరం మణెమ్మ విజయం సాధించింద��.నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్ మండల స్థానం (ఎరుపు రంగు)

విద్యాసంస్థలు:

మార్చు

2008-09 నాటికి మండలంలో 54 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 34 మండల పరిషత్తు, 4 ప్రైవేట్ ఎయిడెడ్, 15 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 20 ప్రాథమికోన్నత పాఠశాలలు (10 మండల పరిషత్తు, 10 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 30 ఉన్నత పాఠశాలలు (3 ప్రభుత్వ, 9 జడ్పీ, 3 ప్రైవేట్ ఎయిడెడ్, 15 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 8 జూనియర్ కళాశాలలు (2 ప్రభుత్వ, 6 ప్రైవేట్) ఉన్నాయి.

వ్యవసాయం, నీటిపారుదల:

మార్చు

మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. ప్రత్తి, వరి, వేరుశనగ, జొన్నలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 628 మిమీ. మండలంలో సుమారు 1800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ

మార్చు
  • 1972: నాగర్‌కర్నూలులో కొత్త బస్టాండు ప్రారంభమైంది.
  • 1979 మార్చి 10: పుట్టపర్తి సాయిబాబా పట్టణానికి విచ్చేసి సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ చేశారు.
  • 2011: నాగర్‌కర్నూల్‌ను మేజర్ గ్రామపంచాయతి నుంచి పురపాలక సంఘంగా హోదా పెంచబడింది
  • 2016, అక్టోబరు 11: ఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలో చేరింది.

కలెక్టరేట్‌ నూతన భవన సముదాయం

మార్చు

జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా దేశిటిక్యాల శివారులోని కొల్లాపూర్‌ చౌరస్తాలో 12 ఎకరాల్లో 1.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 56 కోట్ల రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు పైన రెండు అంతస్తులు ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. కింది అంతస్తులో కలెక్టర్‌, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలు, రెండు వెయిటింగ్‌ హాల్స్‌, రెండు వీడియోకాన్ఫరెన్స్‌ హాల్స్‌, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులు, దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్‌ హాల్‌ను నిర్మించారు. మొదటి అంతస్తులో వివిధ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి.[4]

2023, జూన్ 6న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు. కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతోపాటు స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5]

అభివృద్ధి కార్యక్రమాలు

మార్చు

2022 జూన్ 18న తేదీన తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్‌ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు నాగర్‌కర్నూల్ పట్టణంలో 17 కోట్ల రూపాయలతో నిర్మించిన ట్యాంక్‌బండ్‌, 60 కోట్ల రూపాయలతో చేపట్టిన జడ్చర్ల-నాగర్‌కర్నూల్‌ ఆర్‌అండ్‌బీ రోడ్డు (వయా సిర్సవాడ), 1.20 కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త మున్సిపల్‌ భవనం, 1.20 కోట్ల రూపాయలతో మహేంద్రనాథ్‌ చౌరస్తాలో ఏర్పాటుచేసిన సైడ్‌ లైటింగ్‌ లను ప్రారంభించాడు. 35లక్షల రూపాయలతో కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటుచేసిన మిషన్‌ భగీరథ పైలాన్‌ ను, 25 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన జాతీయ జెండాను ఆవిష్కరించాడు. 4.50 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన నాన్‌వెజ్‌ మార్కెట్‌, 2 కోట్ల రూపాయలతో పాత మార్కెట్‌ వద్ద ఏర్పాటుచేసిన డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాలకు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, నాగర్ కర్నూల్‌ ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, గోరటి వెంకన్న, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.[6]

ప్రముఖులు

మార్చు

దేవాలయాలు

మార్చు

ఈ గ్రామంలో శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయాలు ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 12, 44. Retrieved 11 June 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
  3. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
  4. telugu, NT News (2023-06-06). "CM KCR | నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-06-06. Retrieved 2023-06-06.
  5. "CM KCR : నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్‌". Prabha News. 2023-06-06. Archived from the original on 2023-06-06. Retrieved 2023-06-06.
  6. telugu, NT News (2022-06-17). "అభివృద్ధికి అంకురార్పణ". Namasthe Telangana. Archived from the original on 2022-06-18. Retrieved 2022-06-18.

వెలుపలి లంకెలు

మార్చు