దైవమిచ్చిన భార్య
దైవమిచ్చిన భార్య చలం రచించిన ఒక నవల. పితృస్వామ్య వ్యవస్థలోని లోపాలపై విమర్శ ఈ నవలలో చర్చించిన అంశాలలో ఒకటి.[1]
రచయిత(లు) | చలం |
---|---|
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విషయం | నవల |
అధ్యాయాలు
మార్చుచలం ఈ నవలను కథానాయకుడు ఉత్తమపురుషలో చెప్పినట్లు వ్రాశాడు. ఈ నవలను ఈ క్రింది అధ్యాయాలుగా విభజించాడు.
- చిన్నతనం
- పద్మావతి
- పద్మావతి, నేను
- నాకు, పద్మావతికి
- శకుంతల
- మళ్లీ మొదలు
- భేదం
- అపజయం
- నేను, శకుంతల
- త్యాగం
కథా సంగ్రహం
మార్చుఇద్దరు ప్రేమికుల కథ యిది. వాళ్ళ చిన్నతనం నుండి మొదలై వారిలో ఒకరి మరణం దాకా నడుస్తుంది. రాధాకృష్ణ, పద్మావతి చిన్నతనం నుండీ స్నేహితులు. తహసీల్దారు కొడుకు రాధాకృష్ణ. వాళ్ళ పక్క యింటి జమీందార్ల అమ్మాయి పద్మావతి. పద్మావతి చెన్నపట్నంలో వుంటూ అపుడపుడూ చుట్టంచూపుకు ఊరు వస్తూంటుంది. అలా వచ్చినపుడొకసారి యిద్దరూ తొలిసారి కలుస్తారు. ఆటల్లో జట్టుకడతారు. ఆ రోజుల్లోనే పద్మావతికి ముప్ఫయ్యేళ్ళ ఒక న్యాయమూర్తితో బాల్యవివాహం జరిగిపోతుంది. స్నేహితులిద్దరూ ఏడేళ్ళు మళ్ళీ కలుసుకోరు. మరలా ఆమె ఊరు వచ్చేసరికి, యిద్దరూ నిండు యవ్వనంతో వుంటారు. యిద్దరిలోనూ పరస్పరం ప్రేమ మొదలవుతుంది. ఆమెను తనతో వచ్చేయమంటాడు రాధాకృష్ణ. కానీ పద్మావతి రాధాకృష్ణకు భార్యగా మారిపోయి పెళ్ళి అనే బంధంలో ఇరికిపోవడం, ఒకరికొకరు పాతబడిపోవడం యిష్టంలేక అతని అభ్యర్థనను తిరస్కరిస్తుంది. యిలా అప్పుడపుడూ కలుసుకోవడంలో ఎప్పటికపుడు తాజాగా ఉత్పన్నమయ్యే ప్రేమావేశపు కొత్తదనం ఆమెకి కావాలి. ఆమె న్యాయమూర్తికి భార్యగానే వుండాలనుకుంటుంది. అలాక్కాక రాధాకృష్ణతో లేచి వచ్చేస్తే సంఘం పెట్టే కష్టాలేవీ ఆమె ఎదుర్కునేందుకు సుముఖంగా లేదు. న్యాయమూర్తి విదేశాల్లో చదువుముగించుకుని వచ్చాకా, ఆమె చెన్నపట్నం కాపురానికి వెళ్ళిందని తెలిసినపుడు రాధాకృష్ణ బాధతో మండిపోతాడు. చెన్నపట్నం వెళ్ళి ఆమెకు ద్వేషాన్నంతా వెళ్ళగక్కుతూ ఉత్తరాలు రాస్తాడు. ఆమె మళ్ళీ అతణ్ణి ఎలాగో పాత పాటే పాడి ఒప్పిస్తుంది. ఈ అయోమయ స్థితిలోనే అతను వేరే పెళ్ళి కూడా చేసుకుంటాడు. అయిదేళ్ళ పాటు యింగ్లాండు వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చాక పద్మావతితో బంధం మళ్ళీ కొనసాగుతుంది. ఈసారి ఆమె యింట్లోనే. కొన్నాళ్ళకి ఒకరోజు ఇద్దరూ బాహటంగా భర్తకి పట్టుబడిపోతారు.చెన్నపట్నం వెళ్ళి ఆమెకు ద్వేషాన్నంతా వెళ్ళగక్కుతూ ఉత్తరాలు రాస్తాడు. ఆమె మళ్ళీ అతణ్ణి ఎలాగో పాత పాటే పాడి ఒప్పిస్తుంది. ఈ అయోమయ స్థితిలోనే అతను వేరే పెళ్ళి కూడా చేసుకుంటాడు. అయిదేళ్ళ పాటు యింగ్లాండు వెళ్ళిపోతాడు. తిరిగి వచ్చాక పద్మావతితో బంధం మళ్ళీ కొనసాగుతుంది. ఈసారి ఆమె యింట్లోనే. కొన్నాళ్ళకి ఒకరోజు ఇద్దరూ బాహటంగా భర్తకి పట్టుబడిపోతారు. ఆమె భర్త పద్మావతిని కొన్నాళ్ళపాటు సింగపూరు తీసుకుపోతాడు. తర్వాత చెన్నపట్టణం తీసుకువచ్చి ఇంట్లో ఖైదు చేస్తాడు. ఇద్దరూ కలుసుకోకూడదని, ఉత్తరాలు రాసుకోకూడదనీ, లేదంటే రాధాకృష్ణ మీద కేసులు పెట్టిస్తాననీ బెదిరిస్తాడు. షరతులకు ఆమె లొంగిపోతుంది. అంతేకాదు, రాధాకృష్ణ కూడా లొంగిపోయేలా ఒప్పిస్తుంది. మరో ప్రక్క రాధాకృష్ణ తన భార్యతో సఖ��యత పెంచుకుని, మామూలు సంసారిక జీవనంలో పడతాడు. కొన్నేళ్ళకు ఎపుడో పని మీద మలబారు వెళ్ళినపుడు మళ్ళీ పద్మావతి కన్పిస్తుంది. ఆమె దేశ పర్యటనలో వుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటారు. పడవ యెక్కి సముద్రంలోకి వెళ్తారు. అందమైన ప్రకృతి మధ్య ఒకరి సాంగత్యాన్ని ఒకరు ఆస్వాదిస్తారు. అయితే ఇద్దరి మధ్య భౌతికమైన వాంఛ వుండదు. తర్వాత ఆమె భర్త ఆ రాత్రంతా ఆమె రాధాకృష్ణతోనే వుందని అనుమానిస్తాడు. రాధాకృష్���ను కోర్టు కీడ్చి అంతు చూడాలనుకుంటాడు. పద్మావతి రాధాకృష్ణను కాపాడాలనుకుంటుంది. అతణ్ణి చెన్నై రమ్మని కబురు పంపిస్తుంది. అతను వున్న హోటలుకి వస్తుంది. కోర్టువ్యవహారం లేకుండా చెయబోతున్నానంటుంది, ఇక ఇబ్బందులేమీ వుండవంటుంది, రాధా కృష్ణని కావలించుకుని అతణ్ణింకెప్పటికీ చూడటానికి వీలుపడదంటూ, ఎలా బతుకుతాడో అని దిగులుపడుతుంది, కాస్త ప్రేలాపనగా మాట్లాడుతుంది. అంతకుముందే పుచ్చుకున్న ఏదో విష ప్రభావం పెరిగి, అతని చేతుల్లో మరణిస్తుంది[2].
విశేషాలు
మార్చు- ఈ నవల గుడిపాటి వెంకటచలం వ్రాసిన 8 నవలలలో రెండవది. మొదటి నవల శశిరేఖ 1921లో వ్రాశాడు. ఈ నవలను 1923లో రచించాడు. వివాహం, మైదానం, బ్రాహ్మణీకం, అరుణ, అమీనా, జీవితాదర్శం ఇతని తక్కిన నవలలు.
- ఈ నవలకు ప్రేరణ ఆంగ్ల రచయిత హెచ్.జి.వెల్స్ వ్రాసిన ద పాషనేట్ ఫ్రెండ్స్ అనే రచన.
మూలాలు
మార్చు- ↑ నళిని, నటరాజన్ (1996). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Press. p. 321. ISBN 0313287783. Retrieved 21 February 2018.
- ↑ మెహర్. "దైవమిచ్చిన భార్య – రీడింగ్ నోట్సు". కలం కలలు. మెహర్. Archived from the original on 27 September 2016. Retrieved 2 August 2020.