జస్పాల్ భట్టి
జస్పాల్ సింగ్ భట్టి (మార్చి 3, 1955 - అక్టోబరు 25,2012) సుప్రసిద్ధ హాస్యనటుడు. ఇతడు సామాన్యప్రజల కష్టాలను టెలివిజన్ మాధ్యమంలో వ్యంగ్యంగా ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఫ్లాప్ షో, ఉల్టా పుల్టా మొదలైనజనరంజకమైన టి.వి. కార్యక్రమాల ద్వారా ఇతడు 1990వ దశకంలో వెలుగులోనికి వచ్చాడు. 2013లో ఇతడిని భారత ప్రభుత్వం ఇతని మరణానంతరం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది.[1]
జస్పాల్ భట్టి | |
---|---|
జననం | జస్పాల్ సింగ్ భట్టి 1955 మార్చి 3 |
మరణం | 2012 అక్టోబరు 25 షాకోట్, జలంధర్ | (వయసు 57)
వృత్తి | నటుడు,దర్శకుడు, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1990–2012 |
గుర్తించదగిన సేవలు | ఉల్టా పుల్టా, ఫ్లాప్ షో, ఫుల్ టెన్షన్ |
జీవిత భాగస్వామి | సవితా భట్టి (1985 - 2012) |
పురస్కారాలు | పద్మభూషణ్[1] |
జీవిత విశేషాలు
మార్చుఇతడు 1955, మార్చి 3వ తేదీన అమృత్‌సర్లో జన్మించాడు. చండీఘర్ లోని పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీనుండి ఎలెక్ట్రికల్ ఇంజనీరింగులో పట్టభద్రుడయ్యాడు.[2] ఇతడు 1985లో సవితా భట్టిని వివాహం చేసుకొన్నాడు. వీరికి జస్రాజ్ భట్టి అనే కుమారుడు, రాబియా భట్టి అనే కుమార్తె కలిగారు.[3][4] ఇతని భార్య సవితా భట్టిని ఆమ్‌ఆద్మీ పార్టీ 2014 సాధారణ ఎన్నికలలో చండీఘర్ లోక్‌సభ స్థానం నుండి తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది కానీ ఆమె ఈ ప్రతిపాదననను తిరస్కరించింది.[5]
ఫ్లాప్ షో, తదనంతర అవకాశాలు
మార్చు1990ల తొలినాళ్లలో ప్రసారమైన ఇతని టెలివిజన్ సీరియల్ ఫ్లాప్ షో ప్రజాదరణ పొందింది. ఇతని భార్య సవితా భట్టి ఈ తక్కువ బడ్జెట్ సీరియల్ ను నిర్మించి అన్ని ఎపిసోడులలో జస్పాల్ భట్టి భార్యగా నటించింది. కేవలం 10 ఎపిసోడ్‌లు మాత్రమే నిర్మించబడి ప్రసారమైనా ఈ సీరియల్‌ను ప్రేక్షకులు బాగా గుర్తుంచుకొన్నారు. ఈ సీరియల్ ద్వారా ఇతని సహనటుడు వివేక్ షౌక్‌కు సినిమా అవకాశం లభించింది.
జస్పాల్ భట్టి తరువాత ఉల్టాపుల్టా, నాన్సెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే జనబాహుళ్యమ���న టి.వి.సీరియళ్లను దూరదర్శన్ కొరకు దర్శకత్వం వహించి నటించాడు. ఇతడి హాస్యప్రియత్వం, సగటు మనిషి కష్టాలపై విసిరే చెణుకులు ప్రేక్షకులను టి.వి.ల ముందు కట్టి���డేసేవి.
1999లో ఇతడు మొదటిసారిగా దర్శకత్వం వహించిన పూర్తి నిడివి కలిగిన పంజాబీ సినిమా మాహుల్ ఠీక్ హై పంజాబ్ పోలీసులపై ఇతడు ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం. ఇంకా ఇతడు ఫనా, కోయీ మేరే దిల్ సే పూచే, జీజాజీ అనే పంజాబీ సినిమాలలోనూ, ఆ అబ్ లౌట్ చలే అనే హిందీ సినిమాలోను నటించాడు.
తరువాతి కాలంలో ఇతడు మొహాలీలో మ్యాడ్ ఆర్ట్ ట్రైనింగ్ స్కూలు పేరుతో ఒక ట్రైనింగ్ స్కూలును, జోక్ ఫ్యాక్టరీ అనే ఫిలిం స్టూడియోను స్థాపించాడు.[6]
ఇతడికి మొదటి గోల్డన్ కేలా అవార్డ్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది.[7] కళారంగంలో ఇతడు చేసిన సేవలకు గుర్తింపుగా ఇతనికి 2013లో మరణానంతర పద్మభూషణ్ పురస్కారం లభించింది.
మరణం
మార్చు57 ఏళ్ల జస్పాల్ భట్టి 2012, అక్టోబరు 25న జలంధర్ జిల్లా షాకోట్ సమీపంలో కారులో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై మరణించాడు.[8][9] తన కుమారుడు జస్రాజ్ భట్టి నటించి ఇతడు నిర్మించిన పవర్‌కట్ సినిమా విడుదలకు ఒక రోజు ముందు మరణించాడు.[10]
పురస్కారాలు, సన్మానాలు
మార్చుసంవత్సరం | పురస్కారం పేరు | ప్రదానం చేసిన సంస్థ |
---|---|---|
2013 | పద్మభూషణ్ | భారత ప్రభుత్వము[1] |
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమాలు
మార్చు- దిల్ పరదేశి హో గయా (2013) ఆఖరి చిత్రం
- పవర్ కట్ (2012) – నటన, దర్శకత్వం
- ధర్తీ (2011) - సుర్వీన్ తండ్రి
- మౌసమ్ (2011)
- హమ్ తుమ్ షబానా (2011) అతిథి నటుడు
- ఛక్ దే పత్తే (2009) – ప్యారా సింగ్ లవ్లీ
- ఏక్: ది పవర్ ఆఫ్ వన్ (2009)
- ఫనా (2006) – జాలీ గుడ్ సింగ్
- నాలాయక్ (2006) – డాకూ మాన్ సింగ్
- మేరా దిల్ లేకే దేఖో (2006)
- కుఛ్ మీఠా హోజాయె (2005) – రామ్ శరణ్ దుబే
- కుఛ్ నా కహో (2003) – మాంటీ ఆహ్లువాలియా
- తుఝె మేరీ కసమ్ (2003) – సర్దార్జీ
- జానీ దుష్మన్: ఏక్ అనోఖి కహాని (2002)
- కోయీ మేరె దిల్‌సే పూఛే (2002) – నారాజ్ శంకర్
- శక్తి: ది పవర్ (2002) – నందిని మామ
- యే హై జల్వా (2002) – బూటా సింగ్
- హామారా దిల్ ఆప్‌కే పాస్ హై (2000) – బల్వీందర్
- ఖవుఫ్ (2000) – హవాసింగ్/దవాసింగ్
- వో బేవఫా థీ (2000)
- కార్టూస్ (1999) – మిని మామ
- మహౌల్ ఠీక్ హై (1999)
- ఆ అబ్ లౌట్ ఛలే (1999) – ఇక్బాల్
- జానమ్ సమ్‌ఝా కరో (1999) – టబ్బి, రాహుల్ సెక్రెటరి
- కాలా సామ్రాజ్య (1999)
- వాంటెడ్: గురుదాస్ మాన్ డెడ్ ఆర్ అలైవ్ (1994) – పోలీసు
టి.వి. సీరియల్స్
మార్చుసీరియల్ పేరు | ఛానల్ పేరు | పాత్ర | వివరాలు |
---|---|---|---|
ఉల్టా పుల్టా | డి.డి. నేషనల్ | ||
ఫ్లాప్ షో | డి.డి. నేషనల్ | ||
షెహ్‌జీకి అడ్వైజ్ | |||
ఫుల్ టెన్షన్ | |||
థాంక్యూ జీజాజీ | SAB టివి[11] | జీజాజీ | |
హై జిందగీ బై జిందగీ | జీ టీవి | భట్టి |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Padma Bhushan award for Jaspal Bhatti". Niti Central. 26 January 2013. Archived from the original on 27 జనవరి 2013. Retrieved 27 January 2013.
- ↑ "Jaspal Bhatti's son, actress Surilie in a critical condition;– Times of India". timesofindia.com. 2012. Archived from the original on 2013-10-28. Retrieved 7 February 2012.
- ↑ "Bhatti's film makes it to Sandfly Film Festival – Times of India}". indiatimes.com. 2012. Retrieved 7 February 2012.
- ↑ "Horrific end to a life of humour: Satirist Jaspal Bhatti, 57, killed in road accident". Daily Mail. London.
- ↑ "Jaspal Bhatti's wife Savita to contest Polls from Chandigarh as AAP Candidate but now she refused the Aam Aadmi Party ticket". IANS. news.biharprabha.com. Retrieved 1 March 2014.
- ↑ "MADArts – Jaspal Bhatti Film School". Archived from the original on 2016-07-30. Retrieved 2016-07-06.
- ↑ "Golden Kela Awards- Razzies of Bollywood". Archived from the original on 2016-03-04. Retrieved 2016-07-06.
- ↑ "Laughs of a Generation died with Jaspal Bhatti". Archived from the original on 26 అక్టోబరు 2012. Retrieved 25 October 2012.
- ↑ http://indiatoday.intoday.in/story/comedian-jaspal-bhatti-dead-in-road-accident-in-shahkot-in-punjab/1/226080.html
- ↑ "Jaspal Bhatti died a day before son's debut film release – The Times of India". The Times of India. Archived from the original on 2013-06-30. Retrieved 2016-07-06.
- ↑ Thank You Jijaji