చిలుకూరి నారాయణరావు
డా"చిలుకూరి నారాయణరావు (ఆగష్టు 9, 1889 - జూన్ 22, 1951) భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు.
జననం
మార్చుఈయన విశాఖపట్నం జిల్లా, పొందూరు సమీపంలోని ఆనందపురంలో 1889, ఆగష్టు 9 న జన్మించాడు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష కన్నడం. ఈయన శ్రీకాకుళం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, పర్లాకిమిడి, విజయనగరం ల లోని మహారాజా కళాశాలలో చదివి పట్టభద్రులయ్యాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగు, కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందాడు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి జె.ఎ.యేట్స్‌తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకుడుగా పనిచేశాడు. తరువాత అనంతపురం దత్తమండల కళాశాల (తరువాతి కాలంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ)లో ఆంధ్రోపన్యాసకుడిగా చాలాకాలం పనిచేశాడు. ఈయన ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చే 'కళాప్రపూర్ణ' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందాడు. 'ఆంధ్ర బెర్నార్డ్ షా' అనే బిరుదుకూడ ఇతనికి ఉంది.
మరణం
మార్చుఇతడు 1951, జూన్ 22న పుట్టు కురుపు వ్యాధి వలన చెన్నైలో పరమపదించాడు.
చిలుకూరి నారాయణరావు గిడుగు రామ్మూర్తితో పాటు వ్యావహారిక భాషా ఉద్యమ ప్రచారానికి విశేష కృషి చేశాడు. 1933 లో జరిగిన అభినవాంధ్ర కవిపండిత మహాసభ, నారాయణరావు అధ్యక్షతన ఆధునిక వ్యవహారిక భాషనే బోధన భాషగా ఉపయోగించాలని తీర్మానించింది. ఆలంకారికులు, వైయాకరణుల మధ్యలో తెలుగు కవులు నలిగిపోయారని భావించాడు. అందుకే 1937లో వెలువరించిన ఆంధ్ర భాషా చరిత్రని అప్పట్లోనే వాడుక భాషలో రాశాడు.
దత్తమండలానికి రాయలసీమ అన్న పేరును చిలుకూరి నారాయణరావు సూచించాడని, గాడిచర్ల హరిసర్వోత్తమరావు సూచించాడని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హరిసర్వోత్తమరావు జీవితచరిత్ర శ్రీ సర్వోత్తమజీవితంలో గ్రంథకర్త ఎం.వీరభద్రరావు, రాయలసీమ పేరును హరిసర్వోత్తమరావు సూచించాడని వ్రాసినా, 1946లో ఒక రేడియో ప్రసంగంలో చిలుకూరి నారాయణరావు తాను రాయలసీమ అన్నపేరును సూచించినందుకు గర్వపడుతున్నానని చెప్పుకోవటాన్ని ఎవరూ ఖండించలేదు. కాబట్టి ఈ పేరును చిలుకూరి నారాయణరావే పునరుద్ధరించి ఉంటాడని అనుకోవచ్చు[1] రాయలసీమ పేరును సూచించిన నారాయణరావు దాన్ని పప్పూరు రామాచార్యుల చే ప్రతిపాదింపజేశారని భావిస్తున్నారు.
విశేషాలు
మార్చు- మద్రాసు విశ్వవిద్యాలయంలో 1930 ఫిబ్రవరి ఆరోతేదీన తొలిసారిగా తెలుగు సాహిత్యంలో పిహెచ్.డి. చేసిన పండితుడు.
- 240 గ్రంథాలు వ్రా��ాడు. ఒకలక్షా యాభైవేల తెలుగు సామెతలు సేకరిస్తే ఎనభైవేలే మిగిలాయి.
- నవ్య సాహిత్య పరిషత్తు తొలి అధ్యక్షుడు, శ్రీకృష్ణదేవరాయ విద్యాపరిషత్తు వ్యవస్థాపకాధ్యక్షుడు.
- తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు ద్రావిడ భాషలని కాల్డ్ వెల్ పండితుని సిద్ధాంతంతో చిలుకూరి విభేదించాడు. తమిళ, మలయాళ భాషలకు సన్నిహిత సంబంధం ఉంది, తెలుగుభాషకు తక్కిన ద్రావిడ భాషలతో సంబంధం లేదు, స్వతంత్రమైన స్థానం ఉందన్న గ్రియర్‌సన్ వాదనతో చిలుకూరి ఏకీభవించాడు.
- తెలుగులోకి ఖురాన్ గ్రంథాన్ని అనువదించిన తొలివ్యక్తి చిలుకూరి నారాయణ రావు. మొదటి "తెలుగు కురాను" (1925), రెండవ ముద్రణ 1938 పీఠికలో ఆయన ఇలా అన్నాడు "ఎన్నియో సమయములందు హిందువులకును ముస్లిములకును కలిగిన కలహములవలన ఆపద రానున్నపుడు ఈ యాంధ్రానువాదము ఈ రెండు మతములవారికిని సామరస్యమును కుదిరించినది. ఇదియే గ్రంథకర్తకును, గ్రంథ ప్రకాశకులకును బహుమానము".
- ఉమర్ ఖయ్యూమ్ వ్రాసిన రుబాయత్‌లను ముత్యాలసరములు అనే పేరుతో తెలుగులో వ్రాశాడు.
- కురాను షరీఫు - ముస్లీముల పవిత్ర గ్రంథం కురాన్‌కు మొట్టమొదటి తెలుగు అనువాదం.
- అశోకుని ధర్మశాస్త్రములు
- సంస్కృతలోకోక్తులు
- ఉపనిషత్తులు
- ఉమర్ ఖయాం రుబాయతు (ముత్యాల సరములు)
- ముసలమ్మ (ఒక వీరకాపుపడుచు)
- చక్కటులు - సామెతలు: 80,000 (అముద్రితం)
- అశ్వత్థామ (తెలుగు నాటకం)
- అంబ (మొండి శిఖండి) (నాటకం)
- అచ్చి (కాపువలపు) (నాటకం)
- పెళ్ళి (హాస్యము)
- నాటకనాటకము
- నందుడు (మాలభక్తుడు) (నాటకం)
- ఆరోగ్య నాటకము
- గుజరాతీ వాజ్మయ చరిత్రము
- అశోకచక్రవర్తి ధర్మశాసనములు (అనువాదం)[3]
- పదనకొండవ శతాబ్దమునాఁటి తెనుఁగు భాష (సిద్ధాంత గ్రంథము)
- ఆంధ్రభాషా చరిత్రము (రెండు సంపుటాలు - రాయల్ సైజు 1750 పుటలు)
- ప్రాచీన విద్యాపీఠములు
- జర్మనీ విద్యావిధానము
- విక్రమాశ్వత్థామీయమ్ (సంస్కృత నాటకం)
- వాడే (నాటకం)
- శూరసేనుడు (అముద్రిత నాటకం)
- నిగమశర్మ (అముద్రిత నాటకం)
- బ్రహ్మశిరము (అముద్రిత నాటకం)
- మదాలస (అముద్రిత నాటకం)
- శిరోమణి (ద్రౌపదీ విజయము) (అముద్రిత నాటకం)
- బొమ్మపొత్తికలు (అముద్రిత నాటకం)
- ప్రకృతి నాటకం (అముద్రిత నాటకం)
- జపాను కవితలు
- ఆంధ్ర దేశపు జానపద గేయాలు
- బాలల గేయసాహిత్యము
- శ్రీమద్భగవద్గీత కావ్యము
- సృష్టి రాద్ధాంతము
- తుక్ఖాంబ
- రాగసూచిక
- వైదిక వాజ్మయ చరిత్ర
- హిందీవాజ్మయ చరిత్ర
- జపాన్-తెనుఁగు పదకోశము
- తెనుఁగు-జపాన్ పదకోశము
- మరాఠి-తెనుఁగు పదకోశము
- ఆంగ్లాంధ్ర నిఘంటువు
- వనస్పతి నిఘంటువు
- జపాన్ భాషాబోధిని
- జర్మను భాషా స్వయంబోధిని
- హేమచంద్రుని దేశి నామమాల
- నన్నయ భారత పదకోశము
- కవులు-కావ్యములు సూచిక
- పార్శీవారి ప్రార్థనలు (అముద్రితం)
- అథర్వణవేదము (అముద్రితం)
- An Introduction to Dravidian Philology
- The Dance of Rain Drops
- The Nomenclature of Karnataka Ragas
- An Index to the Achchika Words in Srinatha's works
- English - Telugu Technical Dictionary
- The Bhagavat Geetha
- Lectures on Geetha
- A short Survey of Telugu Literature
- Florilegia
- Sanskrit Aphorism with English Explanation (అముద్రితం)
- Songs of Tyagaraja
మూలాలు
మార్చు- ↑ Rayalaseema during colonial times: a study in Indian nationalism By P. Yanadi Raju
- ↑ వాజ్మయ తపస్వి -డా.చిలుకూరి నారాయణరావు(పుస్తకం) రచయిత - అవధానం నాగరాజారావు
- ↑ [1] డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో