కవనశర్మగా ప్రసిద్ధి చెందిన కందుల వరాహ నరసింహ శర్మ (జ. సెప్టెంబర్ 23, 1939 - మ. అక్టోబర్ 25, 2018) స్వస్థలం విశాఖపట్నం. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు. జలవనరులు ప్రత్యేకత. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ఆచార్యులుగా పనిచేసి ఉపన్యాసకులుగా చాల దేశాలు సందర్శించారు. బెంగుళూరు, విశాఖపట్నం లలో ఎక్కువగా వుండేవారు. తెలుగులో మంచి కథకుడిగా, వ్యాసకర్తగా పేరు సంపాదించుకున్నారు. రచన (మాస పత్రిక)కి సలహాదారులలో ఒకరు.

కవనశర్మ

ఈయన రచనలలో కవనశర్మ కథలు, సైన్సు నడచిన బాట, వ్యంగ్య కవనాలు, పరిధి ఉత్కృష్టమైనవి. వ్యంగ కవనాలు పేరులోనే తెలిపినట్లుగా వ్యంగ్య భరితమైన కథలు. పరిధి ఉమ్మడి కుటుంబము యొక్క పరిమితులను, కష్టనష్టాలను, మంచి చెడ్డలను పరిశీలిస్తుంది.[1]

కారామాస్టారు శ్రీకాకుళం లో ఏర్పరచిన ”కధానిలయం ”కు శర్మగారు  సలహాదారుగా ఉండేవారు.[2]

కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ 2018 అక్టోబరు 25న మరణించాడు.

రచనలు

మార్చు
  1. సైన్సు నడచిన బాట
  2. సర్ ఆర్థర్ కాటన్ జీవితం - కృషి (అనువాదం)
  3. వ్యంగ్య కవనాలు
  4. కవనశర్మ కథలు
  5. పరిధి
  6. బంగారు రోజులు
  7. ఇరాక్ డైరీ
  8. కోతిరాతలు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-05-07. Retrieved 2008-01-07.
  2. gdurgaprasad (2018-11-06). "కవనశర్మ". సరసభారతి ఉయ్యూరు. Retrieved 2020-05-17.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=కవనశర్మ&oldid=3903470" నుండి వెలికితీశారు