ఏకలవ్యుడు
ఏకలవ్యుడు మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. బోయవంశానికి చెందినవాడు. బోయ కులానికి చెందిన వాడైనా, ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు. ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఒక సారి విలువిద్య సాధనకు అర్జునుడు, దోణుడు ఇతరులు కలిసి అడవికి వేట కుక్కలను తీసుకువెళ్లారు. అందులోని ఒక కుక్క వేగంగా, ఏకలవ్యుడు ఉన్న ప్రదేశానికి వెళ్లింది. కొత్త వేషదారణతో ఏకలవ్యుడు కనిపంచే సరికి కుక్క గట్టిగా అరిచింది. "నన్ను చూసి అరుస్తావా" అనుకున్న ఏకలవ్యుడు కుక్క నోరు తెరచి మూయుటకు మద్యగల సమయంలోనే దాని నోటిలోనికి 7 బాణాలు కొట్టాడు. తరువాత కుక్క అర్జునికి కనిపించింది. విషయం విచారించగా ఈ ప్రాంతంలో ఏకలవ్యుడు అనే అతను విలువిద్య నేర్చుకుంటున్నాడని తెలుకొని, రాత్రి ద్రోణాచార్యులు వారికి సేవ చేసే సమయంలో ఇక్కడ నా కన్న బాగా విలువిద్య చేసే వారు ఉన్నారని తెలిపారు. తరువాత రోజు ద్రోణాచార్యులు ఏకలవ్యుడిని చూడటానికి అతని వద్దకు వెళ్లారు. ఏకలవ్యుడు తన గురువుకు ఘనంగా స్వాగతం తెలిపాడు. ఏకలవ్యుడు విలువిద్య చూసి ఏంతో సంతోషించారు. కాని ఒక కుక్కను చూసి అది తనను చూసి అరచింది అనే చిన్న కారణానికి దాని నోట్లోకి 7 బాణాలు కొట్టాడు. ఇలా కోపాన్ని అదుపులో ఉంచుకోలేని, ధర్మం, అధర్మం తెడా తెలియకుండా అధర్మం వైపు మొగ్గే అతని వద్ద ఇంతటి విలువిద్య ఉంటే లోకానికి, ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుంది. కావున రాబోవు ప్రమాదాలను ముందే నివారించుటకు ఏకలవ్యుడు విలువిద్య ప్రదర్శించుటకు వీలుకాకుండా అతని కుడి చేతి బ్రొటని వేలు గురుదక్షిణగా ఇవ్వమని కోరి లోక రక్షణకు కృషి చేశాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడి చేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు. చరిత్రలో నిలిచిపోయాడు.
ఏకలవ్యుడు | |
---|---|
సమాచారం | |
కుటుంబం | హిరణ్యదాసుడు (తండ్రి) కేతుమని (కొడుకు ) |
ద్రోణాచార్యుని నిరాకరణ
మార్చుమహాభారతంలో [1] ఏకలవ్యుని పాత్ర బోయవంశంకు చెందిన ఒక యువ రాకుమారుడిలా ప్రవేశిస్తుంది.ఏకలవ్యుడు శ్రీకృష్ణునికి తండ్రియైన వాసుదేవుని సహోదరి శృతదేవకి జన్మించిన వాడు.[2] ఆ తరువాత అతడు బోయరాజైనటువంటి హిరణ్యధనుస్సుచే పెంచబడ్డాడు. హిరణ్య ధనస్సు మగధ సామ్రాజ్యాధిపతియైన జరాసంధుని సైన్యాధిపతి.[3]
అస్త్ర విద్యలో ప్రావీణ్యం పొందగోరి ద్రోణుని అభ్యర్థించాడు.ద్రోణుడు అస్త్ర విద్యలో ఆరి తేరిన వాడు,, అర్జునుడు, అతని సహోదరులకు గురువు. కానీ ద్రోణుడు ఏకలవ్యుని స్థాయిని (కోపాన్ని అదుపులో ఉంచోకోలేడు అని, అది మనస్సులోని ఉంటచోని పైకి వేరే కారణ��తో తిరష్కరించాడు) కారణంగా తిరస్కరించాడు.
ఏకలవ్యుని స్వాధ్యయనం
మార్చుద్రోణుని తిరస్కారంతో ఏకలవ్యుడు ఏమాత్రం చెదిరిపోక తిరిగి అరణ్యానికి వెళ్ళి మట్టితో ద్రోణాచార్యుని ప్రతిమను సృష్టించుకున్నాడు. ఆ ప్రతిమనే తన గురువుగా భావించి తానే స్వంతంగా విద్య నేర్చుకోవడం ప్రారంభించాడు. ఈ విధంగా అకుంఠిత దీక్షతో శ్రద్ధా భక్తులతో విద్యనభ్యసించిన ఏకలవ్యుడు అపారమైన ప్రతిభను కూడగట్టుకొని ద్రోణుని ప్రియ శిష్యుడైన అర్జునుని కూడా మించిపోయాడు. ఇలా ఉండగా ఒక నాడు ఏకలవ్యుడు ధనురాభ్యాసం కావించుచుండగా ఎక్కడి నుంచో వచ్చిన ఒక శునకం పదే పదే మొరగనారంభించింది. అప్పుడు ఏకలవ్యుడు మొరుగుతున్న కుక్క నోరు మూయకుండా వెనువెంటనే ఏడు బాణాలు సంధించాడు. దానికి గాయం కూడా ఏమీ తగలలేదు. ఆ దారి వైపుగా వస్తున్న పాండవ రాకుమారులకు ఈ అద్భుత దృశ్యం కంటపడింది. ఇంతటి ప్రతిభా పాటవాలు కలిగిన వారు ఈ అరణ్యంలో ఎవరా? అని వారు ఆశ్చర్యపోయారు. వారు ఆ అరణ్యంలో వెతుకగా నల్లని వస్త్రధారణతో, దుమ్ముపట్టిన శరీరంతో, జడలు కట్టిన వెంట్రుకలతో ఉన్న ఏకలవ్యుడు కనిపించాడు. ద్రోణుని శిష్యునిగా తనను తాను పరిచయం చేసుకున్నాడు.
గురుదక్షిణ
మార్చుఏకలవ్యుడు గురించి తెలుసుకున్న ద్రోణాచార్యుని ఏకలవ్యుడిని కలవడానికి వెళ్ళాడు. ఏకలవ్యుడు ఎప్పటి లాగే విలువిద్య దీక్షగా సాధన చేస్తున్నాడు. గురువును చూడగానే అత్యంత భక్తి ప్రపత్తులతో గురువాజ్ఞ కోసం ఎదురుచూస్తూ ఆయన ముందు మోకరిల్లాడు. ద్రోణుడు ఏకలవ్యుని గురుదక్షిణ ఇమ్మని అడిగాడు.ఏకలవ్యుడు అందుకు సంతోషంగా గురువు ఏదడిగినా సరే ఇస్తానన్నాడు. అప్పుడు ద్రోణుడు ఏమాత్రం కనికరం లేకుండా లోక కళ్యాణం కొరకు ఏకలవ్యుని కుడి చేతి బ్రొటనవేలుని ఇమ్మని అడిగాడు. ఆ వేలు పోయిన తరువాత ఏకలవ్యుడు విలువిద్య అభ్యసించలేడన్నది ద్రోణుడి అభిప్రాయం. కానీ ఏకలవ్యుడు మాత్రం బెదరక, సందేహించక వెను వెంటనే తన కుడి చేతి బ్రొటన వేలుని ఖండించి గురుదక్షిణగా సమర్పించాడు.
మరణం
మార్చుద్రోణాచార్యులు అనుకున్నదే నిజం జరిగింది. ధర్మం వైపు మొగ్గకుండా అధర్మం వైపు వెళ్లాడు. తరువాత ఏకలవ్యుడు జరాసంధునికి చాలా విశ్వాసపాత్రుడిగా వ్యవహరించాడు. రుక్మిణీ స్వయంవరం సమయంలో జరాసంధుని కోరిక మేరకు, శిశుపాలుడికి, రుక్మిణీ దేవి తండ్రియైన భీష్మకునికి మధ్యవర్తిగా వ్యవహరించాడు.[3] భీష్మకుడు రుక్మిణి శిశుపాలుడిని పెళ్ళి చేసుకోవాలని కోరాడు. కానీ రుక్మిణీ శ్రీకృష్ణుని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. తరువాత ఒకసారి జరాసంధుని సైన్యంతో ఏకలవ్యుడు మధుర రాజ్యం పె ఏకలవ్యుడు దాడి చేసి, యాదవులను మట్టు పెట్టాడు. యాదవ రాజ్యాన్ని కాపాడుకోనేందుకు శ్రీ కృష్ణుడు ఏకలవ్యుడును హతమారుస్తాడు శ్రీకృష్ణుడుచే, తర్వాత జన్మలో ద్రోణాచార్యుడును చంపే వరం పొందుతాడు [3][4]
గ్రహంచవలసింది
మార్చుపురాణాల ప్రకారం మహాభారతంలో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రలో ఏకలవ్య ఒకడు, అతను తన గురువును గౌరవించడం కోసం తన ఒక వేలు పోగొట్టుకున్నాడు, మంచి విద్యార్థి పరీక్షలో మార్కులు సాధించేవాడు కాదని, వారి ఉపాధ్యాయుల మాటలను గౌరవించి, వినడం, అనుసరించడం అని చెబుతారు.
మూలాలు
మార్చు- ↑ "మహాభారతము ఒకటవ పుస్తకము: ఆది పర్వము, సంభవ పర్వము 134వ విభాగము".
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2007-07-01. Retrieved 2007-07-01.
- ↑ 3.0 3.1 3.2 A. D. Athawale. Vastav Darshan of Mahabharat. Continental Book Service, Pune, 1970
- ↑ Dowson, John (1820-1881). A classical dictionary of Hindu mythology and religion, geography, history, and literature. London: Trübner, 1879 [Reprint, London: Routledge, 1979]. Also available at ప్రాచీన భారతదేశంలోని పురాణ విజ్ఞాన సర్వస్వం