ఎఫ్.ఎన్.బిల్లిమోరియా

భారతీయ సైనికాదళం లో జనరల్

లెఫ్టినెంట్ జనరల్ ఫరీదూన్ నోషిర్ 'బిల్లీ' బిల్లిమోరియా, పరమ విశిష్ట సేవా పతకం (1933-2005) భారత సైన్యంలో సెంట్రల్ కమాండ్ కు 15వ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ అయిన భారతీయ సైనికాధికారి. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధంలో ఆయన ఒక బెటాలియనుకు నాయకత్వం వహించాడు.[1] 1986 లో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి కమాండెంట్‌గా కూడా పనిచేశాడు.[2]

లెఫ్టెనెంట్ జనరల్
ఎఫ్.ఎన్.బిల్లిమోరియా
పరమ విశిష్ట సేవా పతకం
మారుపేరుబిల్లీ
జననం1933
భారతదేశం
మరణం2005
రాజభక్తిబ్రిటీషు ఇండియా
 India
సేవలు/శాఖబ్రిటీషు ఇండియన్ ఆర్మీ
 Indian Army
సేవా కాలం1955–1993
ర్యాంకు లెఫ్టెనెంట్ జనరల్
యూనిట్2/5 గూర్ఖా రైఫిల్స్, 27వ మౌంటెన్ డివిజన్
పనిచేసే దళాలుసెంట్రల్ కామాండ్
X కార్ప్స్
2/5 గూర్ఖా రైఫిల్స్
పోరాటాలు / యుద్ధాలుభారత పాక్ యుద్ధం 1971
పురస్కారాలు పరమ విశిష్ట సేవా పతకం
సంబంధీకులుబ్రిగేడియర్ ఎన్.డి.బిల్లిమోరియా (తండ్రి)
రత్తీ బిల్లిమోరియా (తల్లి)
యాస్మిన్ బిల్లిమోరియా (భార్య)
కరణ్ బిల్లిమోరియా (కొడుకు)

ప్రారంభ జీవితం, విద్య

మార్చు

బిల్లిమోరియా 1933, జూన్ 27న బొంబాయిలోని ఒక పార్శీ కుటుంబంలో జన్మించాడు.[3] ఈయన తండ్రి బ్రిగేడియర్ ఎన్.డి.బిల్లిమోరియా. తల్లి రత్తీ బిల్లిమోరియా. ఈయన విద్యాభ్యాసం అహ్మదాబాద్ లోని సెయింట్ జేవియల్ ఉన్నత పాఠశాలలో, డూన్ పాఠశాలలో సాగింది. 1949లో డెహ్రాడూన్‌లోని ఇండియన్ ��ిలటరీ అకాడమీలో ప్రవేశించాడు.[3] ఆ తరువాత జాయింట్ సర్వీసెస్ వింగ్ యొక్క 2వ కోర్సులో చేరాడు. ఇది నేషనల్ డిఫెన్స్ అకాడమీ స్థానంలో పూర్వమున్న సంస్థ.[4][5]

వృత్తిజీవితం

మార్చు

బిల్లిమోరియా 1953 జూన్ 7న భారత సైన్యంలో 5 గూర్ఖా రైఫిల్స్ (ఫ్రంటియర్ ఫోర్స్) కు నియమించబడ్డాడు. ఈయన డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. 1959 జనవరి నుండి 1961 మే వరకు భారత మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు సహాయకుడిగా పనిచేశాడు. ఈయన 1962 నుండి 1963 కు మధ్య ఐక్యరాజ్యసమితి దళాలలో భాగంగా తన బెటాలియన్‌తో కాంగోకు వెళ్ళాడు. బిల్లిమోరియా 1969 అక్టోబరులో 2/5 గూర్ఖా రైఫిల్స్ యొక్క నేతృత్వ బాధ్యతను తీసుకున్నాడు. ఈ పదవిలో ఉన్నకాలంలో 1971 భారత-పాక్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఈయన 1973 నుండి మూడు సంవత్సరాల పాటు వార్‌మిన్స్టర్‌లోని స్కూల్ ఆఫ్ ఇన్ఫెంట్రీలో భారతీయ సైనికదళ అనుసంధాన అధికారిగా ఉన్నాడు.[5][6]

బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందిన తరువాత, ఈయన రాజస్థాన్ పదాతిదళ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించాడు. ఆ తరువాత ఉత్తర సెక్టార్లోని ఒక దళానికి బ్రిగేడియర్ జనరల్ స్టాఫ్‌గా, ఆ తరువాత ఉత్తర విభాగంలోని పదాతిదళం విభాగానికి డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా నియమించబడ్డాడు. మేజర్ జనరల్‌గా పదోన్నతి పొందిన తరువాత, ఈయన తూర్పు సెక్టార్లో పర్వత విభాగానికి నాయకత్వం వహించాడు. తదనంతరం ఇండియన్ మిలిటరీ అకాడమీ డిప్యూటీ కమాండెంట్, చీఫ్ ఇన్స్ట్రక్టర్ అయ్యాడు. ఈయన లెఫ్టినెంట్ జనరల్ హోదాకు పదోన్నతి పొంది, 1986 ఫిబ్రవరిలో డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీకి కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించాడు.[6] ఈయన 1987 అక్టోబర్ లో 10 కార్ప్స్ కమాండ్ బాధ్యతలు స్వీకరించాడు.[6][7]

ఈయన 1989 నవంబర్ 1న సెంట్రల్ కమాండ్ ఆర్మీ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించారు.[8] బిలిమోరియా సెంట్రల్ ఆర్మీ కమాండర్‌గా ఉన్నప్పుడు, ఇండో-శ్రీలంక ఒప్పందం ప్రకారం శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో మోహరించిన భారత శాంతి పరిరక్షక దళం యొక్క పనిని సమీక్షించడానికి భారత ప్రభుత్వం 1990లో శ్రీలంకకు పంపింది. ఈయన చేసిన సిఫారసుల మేరకు 1990లో ఈ బలగాన్ని వెనక్కి పిలిపించి, ఎల్.టి.టి.ఈ తో భారతదేశ సైనిక పోరాటాన్ని ముగించింది.[3]

వారసత్వం

మార్చు

ఈయన పేరు మీద స్థాపించబడిన లెఫ్టినెంట్ జనరల్ ఎఫ్.ఎన్.బిల్లిమోరియా ట్రోఫీని లక్నో కంటోన్మెంట్ లోని ఆర్మీ మెడికల్ కార్ప్స్ సెంటర్ & స్కూల్ యొక్క గ్రాడ్యుయేటింగ్ తరగతిలోని ఉత్తమ అధికారికి ప్రదానం చేస్తారు.[9]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈయన తన భార్య యాస్మిన్ ను 1960 జనవరిలో సికింద్రాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కరణ్ బిల్లిమోరియా (బారన్ బిల్లిమోరియా) కోబ్రా బీర్ స్థాపించిన బ్రిటిష్ భారతీయ పారిశ్రామికవేత్త ఈయన కుమారుడు.[5] ఈయన భార్య యాస్మిన్ బిల్లిమోరియా (వివాహానికి ముందు యాస్మిన్ ఇటాలియా) హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యుడు డి.డి.ఇటాలియా మనవరాలు (కూతురు ఐమై ఇటాలియా సంతానం)[10] ఎఫ్.ఎన్.బిల్లిమోరియా 2005, ఆగష్టు 31న 72 యేళ్ల వయసులో క్యాన్సర్‌తో మరణించాడు.[3]

మూలాలు

మార్చు
  1. "Ft-Lt Raina adjudged best". The Times of India. 2004-02-24. Archived from the original on 2012-07-01. Retrieved 2012-03-28.
  2. "DSSC, Wellington - TIMELINE" (PDF). Defence Services Staff College.
  3. 3.0 3.1 3.2 3.3 "Lieutenant-General Faridoon Bilimoria".
  4. Indian Defence Review 1990, pg. 133 "Lieutenant, General Billimoria F.N., G.O.C-in-command....Education:The Doon School"
  5. 5.0 5.1 5.2 "Lt Gen FN Bilimoria: A Soldier's General". thecitizen.in. Archived from the original on 2023-03-04. Retrieved 2024-10-11.
  6. 6.0 6.1 6.2 "Lt Gen F.N. Bilimoria takes over as Corps Commander" (PDF). 1987-10-21. Retrieved 2023-03-04.
  7. "49 AD REGIMENT CELEBRATES RAISING DAY" (PDF). 1988-05-03. Retrieved 2023-03-04.
  8. "NEW ARMY C0MMANDERS ANNOUNCED" (PDF). 1989-10-29. Retrieved 2023-03-04.
  9. "Indian Navy | Best Officer [www.bharat-rakshak.com]". Bharat-rakshak.com. Archived from the original on 2021-10-23. Retrieved 2012-03-28.
  10. "It's a life-changing moment: Lord Bilimoria". The Indian Express.