ఆండిలే ఫెహ్లుక్వాయో
ఆండిలే లక్కీ ఫెహ్లుక్వాయో (జననం 1996 మార్చి 3) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు.[1] అతను ఎడమచేతి వాటం దిగువ వరుస బ్యాటరు, కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలరు. 2016 సెప్టెంబరులో దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించాడు.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఆండిలే లకీ ఫెహ్లుక్వాయో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | డర్బన్, క్వాజులు నాటల్, దక్షిణాఫ్రికా | 1996 మార్చి 3|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం-ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | Okuhle Cele (cousin) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 333) | 2017 సెప్టెంబరు 28 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2018 జనవరి 24 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 118) | 2016 సెప్టెంబరు 25 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2022 అక్టోబరు 11 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 68) | 2017 జనవరి 20 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 జూలై 31 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013/14–2018/19 | క్వాజులు-నాటల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014/15–2020/21 | డాల్ఫిన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | కేప్‌టౌన్ బ్లిట్జ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019/20 | డర్బన్ హీట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021/22–present | క్వాజులు-నాటల్ Coastal | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | పార్ల్ రాయల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 17 September 2023 |
జీవితం తొలి దశలో
మార్చుఆండిలే, ఫీల్డ్ హాకీలో డర్బన్‌లోని గ్లెన్‌వుడ్ హై స్కూల్‌కు బర్సరీని గెలుచుకున్నాడు. తన సంరక్షకురాలు రోజ్‌మేరీ డిస్మోర్ అతనికి క్రికెట్‌ను పరిచయం చేసింది. ఆండిలే తల్లి ఆమె ఇంటిలో పనిమనిషిగా చేసేది. [3]
ప్రారంభ దేశీయ కెరీర్
మార్చు2014 జనవరిలో ఆండిలే, 2014 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం 15 మందితో కూడిన దక్షిణాఫ్రికా జట్టులో ఎంపికయ్యాడు. [4]
2015 ఆఫ్రికా T20 కప్ కోసం క్వాజులు-నాటల్ క్రికెట్ జట్టు లోకి ఆండిలేను తీసుకున్నారు.[5]
2017 ఆగస్టులో, T20 గ్లోబల్ లీగ్ మొదటి సీజన్ కోసం జో'బర్గ్ జెయింట్స్ జట్టులో ఆండిలే ఎంపికయ్యాడు. [6] అయితే, 2017 అక్టోబరులో, క్రికెట్ సౌత్ ఆఫ్రికా, ఆ టోర్నమెంటును 2018 నవంబరు కు వాయిదా వేసి, ఆ వెంటనే రద్దు చేసింది.[7]
2018 సెప్టెంబరులో ఆండిలే, 2018 ఆఫ్రికా T20 కప్ కోసం క్వాజులు-నాటల్ జట్టుకు ఎంపికయ్యాడు. [8] అతను టోర్నమెంటు నాలుగు మ్యాచ్‌లలో పది వికెట్లు తీసుకుని, క్వాజులు-నాటల్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా నిలిచాడు. [9]
2018 అక్టోబరులో, ఎంజాన్సీ సూపర్ లీగ్ T20 టోర్నమెంటు మొదటి ఎడిషనులో కేప్ టౌన్ బ్లిట్జ్ జట్టుకు ఆండిలే ఎంపికయ్యాడు. [10] [11] ఎంజాన్సీ సూపర్ లీగ్ 2019 కోసం డర్బన్ హీట్ జట్టులో చేరాడు.[12] 2021 ఏప్రిల్లో, అతన్ని దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు క్వాజులు-నాటల్ జట్టులోకి తీసుకున్నారు.[13]
2022 మార్చి 27న, 2021–22 CSA వన్-డే కప్‌లో డివిజన్ వన్‌లో ఆండిలే, 100 నాటౌట్‌తో లిస్టు A క్రికెట్‌లో తన మొదటి సెంచరీ సాధించాడు. [14]
అంతర్జాతీయ కెరీర్
మార్చు2016 సెప్టెంబరులో, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ జట్టుకు ఆండిలే ఎంపికయ్యాడు. [15] 2016 సెప్టెంబరు 25న ఐర్లాండ్‌పై దక్షిణాఫ్రికా తరపున తన వన్‌డే రంగప్రవేశం చేసాడు.[16] 2017 జనవరిలో, అతను శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో చేరాడు.[17] 2017 జనవరి 20న శ్రీలంకపై దక్షిణాఫ్రికా తరపున తన T20I రంగప్రవేశం చేసాడు.[18]
2017 జూన్లో ఆండిలే, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఎంపికయ్యాడు గానీ ఆడలేదు.[19] 2017 సెప్టెంబరులో, బంగ్లాదేశ్‌తో జరిగిన వారి సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. [20] అతను 2017 సెప్టెంబరు 28న బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో ప్రవేశించాడు.[21]
2019 ఏప్రిల్లో ఆండిలే, 2019 క్రికెట్ ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా 15 మంది వ్యక్తుల జట్టులో ఎంపికయ్యాడు.[22][23] 2019 జూన్ 23న, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, ఆండిలే తన 50వ వన్‌డే ఆడాడు.[24] ప్రపంచ కప్ తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆండిలేను జట్టులో రైజింగ్ స్టార్‌గా పేర్కొంది.[25]
2021 సెప్టెంబరులో, 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా జట్టులో ఉన్న ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లలో ఆండిలే ఒకడిగా ఎంపికయ్యాడు. [26]
మూలాలు
మార్చు- ↑ "Andile Phehlukwayo". ESPN Cricinfo. Retrieved 27 June 2015.
- ↑ "Andile Phehlukwayo profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 26 July 2021.
- ↑ రౌండరు-andile-phehlukwayo "Go in with a game plan". Red Bulletin Magazine. Retrieved 26 February 2017.
{{cite web}}
: Check|url=
value (help) - ↑ "All 16 squads for the ICC U19 Cricket World Cup UAE 2014 confirmed". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 26 July 2021.
- ↑ క్వాజులు-నాటల్ Squad / Players – ESPNcricinfo. Retrieved 31 August 2015.
- ↑ "T20 Global League announces final team squads". T20 Global League. Archived from the original on 5 September 2017. Retrieved 28 August 2017.
- ↑ "Cricket South Africa postpones Global T20 league". ESPN Cricinfo. Retrieved 10 October 2017.
- ↑ "క్వాజులు-నాటల్ Squad". ESPN Cricinfo. Retrieved 12 September 2018.
- ↑ "Africa T20 Cup, 2018/19 - క్వాజులు-నాటల్: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 16 September 2018.
- ↑ "Mzansi Super League - full squad lists". Sport24. Retrieved 17 October 2018.
- ↑ "Mzansi Super League Player Draft: The story so far". Independent Online. Retrieved 17 October 2018.
- ↑ "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 September 2019. Retrieved 4 September 2019.
- ↑ "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 April 2021. Retrieved 20 April 2021.
- ↑ "Another century for Klaasen as Titans take the lead in One Day Cup". Citizen. Retrieved 30 March 2022.[permanent dead link]
- ↑ "South Africa pick Phehlukwayo for Australia ODIs". ESPNcricinfo. ESPN Sports Media. 6 September 2016. Retrieved 6 September 2016.
- ↑ "Ireland tour of South Africa, Only ODI: South Africa v Ireland at Benoni, Sep 25, 2016". ESPN Cricinfo. Retrieved 25 September 2016.
- ↑ "Behardien to lead in T20 as SA ring changes". ESPN Cricinfo. Retrieved 9 January 2017.
- ↑ "Sri Lanka tour of South Africa, 1st T20I: South Africa v Sri Lanka at Centurion, Jan 20, 2017". ESPN Cricinfo. Retrieved 20 January 2017.
- ↑ "Kuhn, Phehlukwayo in South Africa's Test squad". ESPN Cricinfo. Retrieved 26 June 2017.
- ↑ "Markram set for Test debut against Bangladesh". ESPN Cricinfo. Retrieved 22 September 2017.
- ↑ "1st Test, Bangladesh tour of South Africa at Potchefstroom, Sep 28-Oct 2 2017". ESPN Cricinfo. Retrieved 28 September 2017.
- ↑ "Hashim Amla in World Cup squad; Reeza Hendricks, Chris Morris miss out". ESPN Cricinfo. Retrieved 18 April 2019.
- ↑ "Amla edges out Hendricks to make South Africa's World Cup squad". International Cricket Council. Retrieved 18 April 2019.
- ↑ "ICC Cricket World Cup 2019 (Match 30): Pakistan vs South Africa – Stats Preview". Cricket Addictor. Retrieved 23 June 2019.
- ↑ "CWC19 report card: South Africa". International Cricket Council. Retrieved 9 July 2019.
- ↑ "T20 World Cup: South Africa leave out Faf du Plessis, Imran Tahir and Chris Morris". ESPN Cricinfo. Retrieved 9 September 2021.